శ్రీ వెంకటేశుని..ఈనామాలు..మననం చేస్తే..
ఆ నారాయణుడు మనకి తోడుగా ఉంటాడు.......!!
అభయ హస్తం అధోముఖంగా కనబడితే..
దానిని వరదహస్తం అంటారు.
శ్రీ వేంకటేశాయ శ్రీనివాసాయ నమః’ –
ఇది ఒక మహామంత్రం.
శ్రీవేంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమోనమః’ – ఇది నామత్రయం.
వీటిని ఎవరు నిత్యం జపం చేస్తారో
వారియందు సర్వదేవాత్మకుడైన నారాయణుని అనుగ్రహం లభిస్తున్నది,
త్రికరణాలు శుద్ధం అవుతున్నాయి.
ఆనాడు బ్రహ్మదేవుడు జ్యోతిర్మయంగా సాక్షాత్కరింపజేసుకున్న శ్రీనివాస మూర్తి లోకాన్ని అనుగ్రహించడానికి స్వయంభూ శిలామూర్తిగా తనను తాను ప్రకటించుకున్నాడు.
ఆ ప్రకటించిన రూపానికి తొలి ఆరాధన చేసిన వాడు బ్రహ్మదేవుడే.
బ్రహ్మదేవుని చేత తొలుత నిర్వహింపబడిన ఉత్సవాలు గనుక బ్రహ్మోత్సవాలు అని పేరు.
సౌరమానం ప్రకారం కన్యామాసంలో స్వామి సాక్షాత్కరించి అనుగ్రహించాడు గనుక
ఆ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి.
అధికమాసం వచ్చిన సంవత్సరంలో రెండు పర్యాయాలు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు.
‘బృహి వృద్ధౌ’ అనే ధాతువు ప్రకారం పెద్దదైన
అని అర్థం.
బ్రహ్మోత్సవం అంటే – సంవత్సరంలో జరిగే అన్ని ఉత్సవాలలోనూ అతి పెద్దదైన ఉత్సవం గనుక బ్రహ్మోత్సవం అంటారు.
మన ప్రాణ వీధులలో సంచరించే పరమాత్మ చైతన్యమే తిరుమల మాడ వీధులలో వివిధ వాహనాలపై సంచరిస్తున్న శ్రీనివాస మూర్తి యొక్క దివ్య మంగళ విగ్రహం.
యోగరీత్యా చూస్తే అంతర్ముఖ దృష్టికి
గోచరించే శ్రీనివాస బ్రహ్మము
ఆరాధనకై లోకాన్ని అనుగ్రహించడానికై
ఈ బాహ్యమైన బ్రహ్మాండంలో భవ్యమైన
భరత వర్షంలో పావనమైన స్వామి
పుష్కరిణీ తీరంలో వెలసి అనుగ్రహిస్తూ ఉన్నాడు.
అర్చామూర్తిగా ఆరాధింపబడుతున్న ఈ వేంకటపతి అంతర్యామిగా మనలో సంచరించే పరబ్రహ్మయే.
ఈ దృష్టి మనలో మేల్కొపడానికే వివిధ ఉత్సవాల పేర్లతో స్వామిని ఊరేగిస్తూ, ఆరాధిస్తూ మనలో స్వామి యొక్క దివ్యమంగళ రూప స్ఫురణని ప్రతిష్టింప జేస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఓం నమో వేంకటేశాయ !!
సర్వే జనా సుఖినోభవంతు..!
#తెలుసుకుందాం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #om namo venkatesaya #🙏🌼 ఓం నమో నారాయణయ 🌼🙏 #govinda


