U19 Asia Cup: #🏏క్రికెట్ 🏏 #🇮🇳టీమ్ ఇండియా😍
*పాక్‌పై భారత్ ఘన విజయం❗*
Uppala Shivaprasad
December 14, 2025🏏
అండర్ 19 ఆసియా కప్ టోర్నీలో భారత్ జోరు కొనసాగుతోంది. పాకిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఆయుష్ మాత్రే సారథ్యంలోని భారత అండర్ 19 జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 46.1 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ(5) తీవ్రంగా నిరాశపర్చగా.. ఆరోన్ జార్జ్(88 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో 85) హాఫ్ సెంచరీతో భారత్‌ను ఆదుకున్నాడు. పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ సయ్యమ్, నిఖబ్ షఫీక్ మూడేసి వికెట్లు తీయగా.. నిఖబ్ షఫీక్ రెండు వికెట్లు పడగొట్టాడు. అలీరాజా, అహ్మద్ హుస్సేన్‌కు తలో వికెట్ దక్కింది.
అనంతరం పాకిస్థాన్ 41.2 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. పాకిస్థాన్ అండర్ 19 బ్యాటర్లలో హజైఫా అషన్(83 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో దీపేష్ దేవంద్రన్(3/16), కాన్షిక్ చౌహన్(3/33) మూడేసి వికెట్లు తీయగా.. కిషన్ సింగ్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. ఖిలన్ పటేల్, వైభవ్ సూర్యవంశీ తలో వికెట్ తీసారు.


