https://www.facebook.com/share/v/16MjHu4fEa/ #పొలిటికల్ జోక్స్ 😂
#ఏపీ అప్ డేట్స్..📖 #విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪
*బాబుతో తప్పు చేయిస్తున్న అధికారం❗*
NOVEMBER 17 2025🎯
విశాఖలో సీఐఐ సదస్సు పేరుతో రెండు రోజుల పాటు చంద్రబాబు సర్కార్ హడావుడి చేసింది. లక్షల కోట్లు పెట్టుబడులు, వందలాది పరిశ్రమలు, లక్షలాది ఉద్యోగాలు వస్తున్నాయంటూ సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ ఆకాశమే హద్దుగా ప్రచారం చేశారు. ప్రభుత్వ మీడియా కూడా అదే ప్రచారంలో మునిగి ఉండగా, చంద్రబాబు నోరు జారారు.
విశాఖ ఉక్కు కార్మికులు, సంబంధిత సంఘాల నాయకులపై ఆయన నోరు పారేసుకున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టపోవడానికి కార్మికులు, కార్మిక సంఘాల నాయకులే సోమరితనమే కారణమని అర్థం వచ్చే రీతిలో బహిరంగంగానే ఆయన అన్నారు. చంద్రబాబు ఎంత ఫ్రెండ్లీగా వుంటారో కానీ, ప్రశ్నిస్తే చాలు ఆయన తట్టుకోలేరు. చేతిలో అపరిమితమైన అధికారం వుందనే కారణం కావచ్చు, ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఆయన అనుకుంటున్నట్టున్నారు.
సీఐఐ సమ్మిట్ వల్ల వచ్చే పెట్టుబడులు, ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులపై ఆయన చేసిన కామెంట్స్ రాజకీయంగా టీడీపీకి తీవ్ర నష్టం తెచ్చేలా ఉన్నాయి. బాబు చేసిన నష్టాన్ని, పూడ్చేందుకు అన్నట్టుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వీడియో విడుదల చేశారు. బాబు మాటల్ని వక్రీకరించారని ఆయన వివరణ ఇవ్వడం గమనార్హం.
చంద్రబాబు ఆగ్రహాన్ని, అనుగ్రహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో పౌర సమాజం వుందని పల్లా శ్రీనివాసరావు భావిస్తున్నారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. గతంలో తమ సమస్యలు చెప్పుకోడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులపై నడిరోడ్డుపై చంద్రబాబు చిందులు తొక్కారు. తోకలు కట్ చేస్తానని, వారి వృత్తిని అవమానించే రీతిలో బాబు మండిపడడాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు.
మరోవైపు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును నిలుపుకోలేక పోతుండడంతో పాటు ఇంకా పెట్టని ప్రైవేట్ ఉక్కు ఫ్యాక్టరీ లాభాల్లో నడుస్తుందని ఆయన చెప్పడం విశేషం. ప్రైవేటీకరణపై చంద్రబాబు మోజు మరోసారి బయటపడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
చంద్రబాబు పాలనంటే చాలు ప్రైవేట్కు స్వర్గధామం. విద్య, వైద్యం, పరిశ్రమలు ఇలా ఒక్కటేమిటి అన్నీ ప్రైవేట్పరమే. కేవలం తమ పదవుల్ని మినహాయించుకుని, అన్నింటినీ ప్రైవేట్పరం చేయడానికి చంద్రబాబు వెనుకాడడం లేదని వామపక్షాల నాయకుల విమర్శలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.
విశాఖ ఉక్కు పరిశ్రమపై చంద్రబాబు కామెంట్స్ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో టీడీపీకి నష్టం తెచ్చేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. బాబు చెప్పింది వినాలే తప్ప, ఎదురు ప్రశ్నిస్తే ఆయన స్పందన అట్లే వుంటుందనే మాట వినిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్ష నాయకుడిగా మరోలా వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లు అని సీపీఐ నాయకుడు కె.రామకృష్ణ ఆరోపణ చర్చనీయాంశమైంది.
#భార్యా బాధితులు😭
*కానీ ఏమిచేద్దాం తప్పదు కదా..❓ మార్చుకునే అవకాశం కూడాలేదు..*😜😜
_*🚩 #"కార్తీక పురాణం" - 22 వ అధ్యాయము🚩*_
🕉🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️🌻🕉️
*పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట*
☘☘☘☘☘☘☘☘☘
మరల అత్రి మహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను.
పురంజయుడు వశిష్టుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియై దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి , శ్రీహరిని గానముచేసి , సాష్టాంగ నమస్కారము చేసి , సూర్యోదయముకాగానే నదికిపోయి , స్నానమాచరించి తన గృహమున కెగెను. అట్టి సమయములో విష్ణుభక్తుడగు ఒక వృద్ద బ్రాహ్మణుడు - మెడ నిండా తులసి మాలలు ధరించి పురంజయుని సమిపించి *"రాజా ! విచారింపకుము నీవు వెంటనే చెల్లాచెదురైయున్న నీ సైన్యమును కూడాదీసుకొని , యుద్ద సన్నద్ధుడై శత్రురాజులతో పోరు సల్పుము , నీ రాజ్యము నీకు దక్కును"*, అని దీవించి అదృశ్యుడయ్యెను. *"ఈతడెవరో మహానుభావునివలె ఉన్నారు అని , ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధసన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను. దెబ్బతిని క్రోథముతో నున్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేకపోయినవి. అదియును గాక , శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా !*
ఆ యుద్దములో కాంభోజాది భూపాలురు ఓడిపోయి *"పురంజయా రక్షింపుము రక్షింపు"* మని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను. శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులయిన వారికి శత్రుభయము కలుగుతుందా ! విషం త్రాగినను అమృతమే యగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని యివ్వగా *'శ్రీ హరి'* అని ప్రార్ధించి త్రాగగా అమృతమైనది గదా ! శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు వున్నంత వరకును ధృవుడు చిరంజీవియే గదా !
హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరచును. కార్తీకమాసమంతయు నదీ స్నానమొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారధన చేసినచో సర్వవిపత్తులు పటాపంచలగును. అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి యే జాతి వారికైనా పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యయన మొనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠానతత్పరుడైన వైష్ణవోత్తముని హృదయపద్మమున భగవంతుడుండును. సంసారసాగరం ఉద్దరించుటకు దైవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. వ్యాసుడు , అంబరీషుడు , శౌనకాది మహాఋషులు - మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తినొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండును. ఎవరికైనను శక్తి లేని యెడల వారు తమ ద్రవ్యమును వెచ్చించియైనను మరి యొకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు , భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదాసంపదలనొసంగి కాపాడుచుండును.
శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి , వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు , నిరాకారుడు , నిర్వికల్పుడు , నిత్యానందుడు , నీరజాక్షుడు , పద్నాలుగు లోకములను తన కుక్షియందిడుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీమహావిష్ణువునకు అతిప్రియమైన కార్తీక మాసవ్రతమును భక్తి శ్రద్దలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీమహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరిసంపదలతో కలకలలాడును. కార్తీకమాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము.
*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీకమహాత్మ్య మందలి ద్వావింశోధ్యాయము - ఇరవై రెండవో రోజు పారాయణము సమాప్తము.*
*_🙏🙏🙏🙏🙏_*
https://youtube.com/shorts/7auD5EvhDWc?si=g6fxGEC8_8nTgmJh #ppp #పబ్లిక్ టాక్.. 🗣️
https://youtube.com/shorts/otu0bOZxDUo?si=X8Z75095tIX_1o0c #వైజాగ్ లో గూగుల్
https://youtube.com/watch?v=oPmNBqQ8W5k&si=0_9v4nLpmrHLmvZF #విశాఖ ఉక్కు👊ఆంధ్రుల హక్కు💪






![భార్యా బాధితులు😭 - పర్చినట్టునొయచీరఎ' నీ విప్పడంటిునవ; 0 ಸಲಕ್ನ మీకు 0~٣ కానీ )০&], మౌ 8608 ಸಳ್ಳಜ್ರz ಅಸ್ಥರ್ಓ್ 2 పర్చినట్టునొయచీరఎ' నీ విప్పడంటిునవ; 0 ಸಲಕ್ನ మీకు 0~٣ కానీ )০&], మౌ 8608 ಸಳ್ಳಜ್ರz ಅಸ್ಥರ್ಓ್ 2 - ShareChat భార్యా బాధితులు😭 - పర్చినట్టునొయచీరఎ' నీ విప్పడంటిునవ; 0 ಸಲಕ್ನ మీకు 0~٣ కానీ )০&], మౌ 8608 ಸಳ್ಳಜ್ರz ಅಸ್ಥರ್ಓ್ 2 పర్చినట్టునొయచీరఎ' నీ విప్పడంటిునవ; 0 ಸಲಕ್ನ మీకు 0~٣ కానీ )০&], మౌ 8608 ಸಳ್ಳಜ್ರz ಅಸ್ಥರ್ಓ್ 2 - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_135577_127a5f60_1763380134172_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=172_sc.jpg)

!["కార్తీక పురాణం" - Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu - ShareChat "కార్తీక పురాణం" - Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu Karthika Puranam] సంపూర్ణ కార్తీక మహాపురాణము 538 LCu CV z covlu - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_615510_21291f6b_1763307614029_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=029_sc.jpg)


