ShareChat
click to see wallet page
search
#Ipl 2026 #ipl #bcci #📝CRICKET Updates 📝 ఐపీఎల్‌ 2026 సీజన్‌కు ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) అనుకోని సమస్యలో పడింది. బంగ్లాదేశ్‌ పేసర్‌ ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌ను విడుదల చేయాలంటూ బీసీసీఐ అకస్మాత్తుగా ఆదేశాలు జారీ చేయడంతో కేకేఆర్‌ పరిస్థితి గందరగోళంగా మారింది. చెన్నై సూపర్‌కింగ్స్‌తో పోటీ పడి మరీ రూ.9.20 కోట్ల భారీ ధరకు ముస్తాఫిజర్‌ను దక్కించుకున్న కేకేఆర్‌(KKR).. అతడు ఒక్క బంతి కూడా వేయకముందే జట్టును వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఫోర్స్‌ మేజర్‌’ పరిధిలో.. ముస్తాఫిజుర్‌ వ్యవహారం ‘ఫోర్స్‌ మేజర్‌’ పరిధిలోకి వస్తుంది. అంటే ఎవరి నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితుల వల్ల ఒప్పందాలను అమలు చేయలేని సందర్భం. ఈ నేపథ్యంలో కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌తో ఉన్న ఒప్పందాన్ని కొనసాగించాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే అతడి ఉపసంహరణ బీసీసీఐ ఆదేశాల మేరకే జరిగింది. అయితే ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.. ముస్తాఫిజుర్‌ కేకేఆర్‌ లేదా బీసీసీఐ నుంచి పరిహారం ఏదైనా కోరుతాడా? అనేది మాత్రం చర్చనీయాంశంగా మారింది రీఫండ్‌ ఎందుకు కీలకం? ఈ రూ.9.20 కోట్ల రీఫండ్‌ కేకేఆర్‌కు చాలా కీలకం. ఎందుకంటే ఆ మొత్తంతోనే రిజిస్టర్డ్‌ అవైలబుల్‌ ప్లేయర్‌ పూల్‌ (RAPP) లేదా రీప్లేస్‌మెంట్‌ డ్రాఫ్ట్‌లో సమాన స్థాయి విదేశీ పేసర్‌ను వెతుక్కునే అవకాశం ఉంటుంది. ఆ మొత్తం లేకపోతే, కేకేఆర్‌ తన తప్పు లేకుండానే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంపై బీసీసీఐ కూడా కొంత సానుకూల సంకేతాలే ఇచ్చింది. బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా కేకేఆర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అయితే నిధులు ఎప్పుడు, ఎలా తిరిగి జమ అవుతాయన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అన్ని పరిణామాలను గమనిస్తే, ముస్తాఫిజర్‌పై ఖర్చు చేసిన రూ.9.20 కోట్లతోనే కేకేఆర్‌ కొత్త విదేశీ పేసర్‌ కోసం ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే డెత్‌ ఓవర్లలో ముస్తాఫిజర్‌ స్థాయిలో ప్రభావం చూపగల బౌలర్‌ను దొరకబెట్టడం మాత్రం అంత సులువు కాదని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
📝CRICKET Updates 📝 - ShareChat