శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ బయలు వీరభద్రస్వామి వారు...................
వేల సంవత్సరాల నుండి శ్రీశైల క్షేత్ర పాలకుడుగా మహిమాన్విత బయలు వీరభధ్రస్వామి వారు అవతరించి ఉన్నారు.క్షేత్రానికి ప్రారంభంలో ఆరుబయట ఉండి ఎటువంటి ఆచ్ఛాదన ఆలయం లేకుండా బయలు గా దర్శనమిస్తారు కనుక ఆయనకు బయలు వీరభద్ర స్వామి అని పేరు వచ్చింది.ఈ స్వామి వారు ఉన్న ప్రదేశం ఎటువంటి కప్పు ఉండదు,ఎవరైనా నేరుగా స్వామి వారిని దర్శించుకోవచ్చు.
ప్రసన్న వదనంతో కిరీటముకుట అని కలిగి దశభుజాలు స్వామివారు పది చేతులతో వివిధ ఆయుధాలతో దర్శనమిస్తారు స్వామివారికి క్రింది వైపు లో కుడివైపున దక్షుడు ఎడం వైపున భద్రకాళి దర్శనమిస్తారు స్వామిని దర్శించినంత మాత్రానే ఎంతటి క్లిష్ట సమస్యనైనా తొలగిపోతాయని వ్యాధులు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని ప్రసిద్ధి ముఖ్యంగా ఆగమ సంప్రదాయంలో క్షేత్రపాలక పూజకు చాలా విశేష స్థానం ఉంది
క్షేత్రపాలకుడు పూజలు చేయడం వలన ఆ క్షేత్రంలో ఉన్నటువంటి భక్తులు ఎటువంటి భయాలు లేకుండా సుఖసంతోషాలతో ఉంటారు మంగళవారం ఆదివారం మరియు అమావాస్య రోజుల్లో చేసే వీరభద్ర స్వామి పూజ అనేక ఫలితాలు ఇస్తుందని ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి ఈ స్వామి పూజలో సకల గ్రహ అరిష్ట దోషాలు దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి అదేవిధంగా సంతానం ఐశ్వర్యం వాహనం మొదలైన అనేక శుభ ఫలితాలు చేకూరుతాయి
శ్రీశైల క్షేత్రంలో ఉన్న వీరభద్ర స్వరూపం దగ్గర కూర్చుని ప్రతిరోజూ ఒక గంట సేపు శివనామములు చెప్పుకుని కొద్దిరోజులు అక్కడ ఉండి వస్తే ఆ వ్యాధులు నయం అవుతాయి. అలా నయమయిన సందర్భములు ఎన్నో ఉన్నాయి. అక్కడ ఉన్న వీరభద్ర మూర్తిలోంచి అటువంటి శక్తి ప్రసారం అవుతుంది అని పెద్దలు చెప్తారు
నూతన వాహనములకు ఎక్కువగా బయలు వీరభద్రస్వామి వారి సమక్షంలో పూజలు చేస్తారు,దీని వలన ఎటువంటి ప్రమాదాలు జరగవని భక్తులు చెపుతుంటారు
ఓం నమో వీరభద్రాయ నమః
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


