🌼🌿అమ్మ శ్రీ లలితా మహా త్రిపుర సుందరి🌼🌿
కదమ్బవనచారిణీం మునికదమ్బకాదమ్బినీం
నితమ్బజితభూధరాం సురనితమ్బినీసేవితామ్|
నవామ్బురుహలొచనామభినవామ్బుదశ్యామలాం
త్రిలొచనకుటుమ్బినీం త్రిపురసున్దరీమాశ్రయే||
"కదంబవృక్షములు (కడిమి చేట్లు) వనమందు నివసించునదీ, మునిసముదాయమను కదంబవృక్షములను వికసింపచేయు (ఆనందింప చేయు) మేఘమాలయైనదీ, పర్వతముల కంటే ఏత్తైన నితంబము కలదీ, దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులుకలదీ, తొలకరిమబ్బు వలే నల్లనైనదీ, మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగుత్రిపురసుందరిని ఆశ్రయించుచున్నాను."
త్రిపురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమే ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామెశ్వర స్వరూపము అమ్మ ! పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ, విల్లు, పాశాంకుసాలను ధరించిన రూపంలో, కుడివైపున సరస్వతి దేవి, ఎడమవైపునలక్ష్మీ దేవి, సేవలు చేస్తు ఉండగా, లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది.
దారిద్రయ దుఖాలను తొలగించి, సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది. ఈమే శ్రీ విద్యా స్వరూపిణి. సృష్టి,స్తితి, సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరధన. కుంకుమ అర్చన, లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి..
#☘️🛑🙏sree lalitha tripura sundari devi darshanam 🛑☘️🙏 #lalitha tripura sundari #sree lalitha tripura sundari devi darshanam #🙏ఓం శ్రీమాత్రేనమః 🙏 #శ్రీ మాత్రేనమః 🙏🔱


