#ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯
*ఇదేమి కులపైత్యం.. సంక్రాంతి కమ్మ కులానిదా❗*
JANUARY 15, 2026🔥🌞🌾
భారతదేశం అంటే రకరకాల కులాలు, మతాలు, భాషల కలయిక. అందులో మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడేది కులం. అందులో కులాన్ని అడ్డుపెట్టుకోని రాజకీయాలు చేసేవారు ఉన్నారు, తమ కులం కోసమే రాజకీయ పార్టీలు నడుపుతున్నవారు కూడా ఉన్నారు. ఇక ఏపీలో అయితే కుల రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉంది. అందులోను కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరి అతిని చూస్తుంటే “ఏంట్రా వీళ్లు ఇలా తయారయ్యారు” అనే పరిస్థితికి తెచ్చుకున్నారు.
తాజాగా టీడీపీ మీడియాలో యాంకర్గా పని చేసే యాంకరమ్మ సంక్రాంతి పండగ అంటే కమ్మవారి పండగనే అనేసింది. అందులోను కమ్మవారి వంటల కోసం ఇతరులు ఎదురు చూస్తారని, కమ్మవారు పండించే ధాన్యం, మామిడి పంటలు అంటూ తెగ ఊగిపోతూ కమ్మని భోజనం కమ్మ వారిదే. కోడి పందేలు కూడా కమ్మ వారిదే, హరిదాసులకు అయినా, ఎవరికైనా సహాయం చేసేదే కమ్మ వారే అంటూ కమ్మ వారి గురించి గోప్పలు చెప్పేసింది.
యాంకరమ్మ ఒకటి మాత్రం వదిలేసిందే సంక్రాంతి కమ్మ వారిదే అని మాత్రం చెప్పేసింది కానీ, ఇతర కులాల వారు సంక్రాంతి పండగ చేసుకోకూడదు అని మాత్రం చెప్పకుండా వదిలేసింది. లేకపోతే తమ ప్రభుత్వమే కదా, ఎవరైనా ఇతరులు సంక్రాంతి పండగ చేస్తే రోడ్ల మీద తిప్పుతు జైలుకు పంపుతామని చెప్పకపోవడం సంతోషించాల్సిన విషయం.
అయినా సంక్రాంతి పండగ అంటే వేద పండితులు, పురాణాల్లో ఆ పండగకు ఒక చరిత్ర ఉందని చెప్తారు. ఇలా సంక్రాంతి పండగ కమ్మవారి పండగ అని చెప్పి తమ కులాన్ని ఇబ్బందులు పాలు చేయడం తప్ప ఎవరికీ ఉపయోగం. ఇన్ని రోజులు సంక్రాంతి పండగ అంటే రాయలసీమ, ఉత్తరాంధ్రలకు చెందనిది అని, అది కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం అని కొందరు అనడం చూశాం. కానీ ఇప్పుడు మరోసారి అధికారంలోకి రాగానే యాంకమ్మ సంక్రాంతి పండగ కమ్మ వారిదే అని చెప్తోంది. గతంలోనూ ఒక మాజీ ఎంపీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని వెంకయ్య చౌదరి అనడం చూశాం, విన్నాం.. ఇప్పుడు ఇది చూస్తున్నాం.
తమ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీఎం పదవిలో కూర్చున్నాడు. ఇక ఏది మాట్లాడినా, ఎవరి పైనా ఏదైనా విమర్శలు చేసినా మాట్లాడడానికి ఎవ్వరూ సహసించరు. ఒకవేళ వారు మాట్లాడితే తమ మీడియాను, అధికారాన్ని అడ్డుపెట్టుకుని రకరకాలుగా కేసులు, విమర్శలు చేస్తూ అందరినీ నోళ్లు మూయిస్తున్నవారు. ఇప్పుడు సంక్రాంతి మాదే అన్నారు. ఇకపై ఉగాది, దసరా మొదలైన పండగలు కూడా తమవే అని చెప్పినా ఆశ్చర్యపడనవసరం లేదని ప్రజలు అనుమానిస్తున్నారు.


