ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #తిరుమల లడ్డు #పబ్లిక్ టాక్.. 🗣️ *శ్రీవారి ఎఫెక్ట్.. బాబు సర్కార్ ఉక్కిరిబిక్కిరి..❗* JANUARY 30, 2026🎯 కూటమి పాలనపై ఇంటాబయటా తీవ్ర విమర్శలు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విపక్షాలు అప్పుడే పోరాటాల్ని ఉధృతం చేస్తున్నాయి. దీంతో చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్కు దిక్కుతోచని స్థితి. విశాఖలో వేలాది కోట్ల విలువైన భూముల్ని మంత్రి నారా లోకేశ్ తోడల్లుడికి కట్టబెట్టడంపై ఉత్తరాంధ్రలో నిరసనల వెల్లువ. మరోవైపు టీటీడీ లడ్డూ ప్రసాదంలో జంతువుల కలిపారనే సీఎం చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని సీబీఐ నేతృత్వంలోని సిట్ నివేదిక. కోట్లాది మంది హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణుల నిరసన. కొన్నిచోట్ల పోరాటాల బాట. అలాగే కూటమి సర్కార్ తప్పుల్లో తాము సైతం అంటూ జనసేన ప్రజాప్రతినిధి గలీజు పనులు. ఇంకా సగం పాలన కూడా పూర్తి చేసుకోని కూటమి ప్రభుత్వం, రోజురోజుకూ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకోవడంలో మాత్రం దూసుకెళుతోందన్న ప్రచారం. ఓవరాల్గా చూస్తే, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఫీల్ బ్యాడ్. అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? అతి తక్కువ పాలనలో విపరీతమైన నెగిటివిటీ ఎందుకు? అసలు చంద్రబాబు ముద్ర ఎందుకు లేకుండా పోతోంది? పాలనపై సీఎం పట్టు కోల్పోవడానికి కారణాలేంటి? మెజార్టీ కూటమి ప్రజాప్రతినిధుల్లో ఎందుకంత లెక్కలేనితనం? చేతిలో అధికారం దోచుకోడానికి, దాచుకోడానికే అన్న రీతిలో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రులు లోకేశ్, వంగలపూడి అనిత...ఇలా ఎవరి తీరు తీసుకున్నా. వైఎస్ జగన్ను బద్నాం చేయాలన్న ఉద్దేశమే కనిపిస్తుంది. ఆ తర్వాతే ప్రభుత్వానికి సానుకూలత అంశాలపై దృష్టి సారిస్తున్నారనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. వైఎస్ జగన్ ను రాజకీయంగా అప్రతిష్టపాలు చేస్తే, తమ అధికారానికి డోకా వుండదనే ఆలోచన వారి మాటల్లోనూ, చేతల్లోనూ నిత్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి ప్రతికూల ధోరణి కేవలం వైఎస్ జగన్ అంటే భయం నుంచే పుట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కూటమి భవిష్యత్, అధికారం……. జగన్ ను జనం చూసే దృష్టిపై ఆధారపడి వుంటుందని వారు నమ్ముతున్నారు. అంతే తప్ప, తాము మంచి పాలన చేయడం వల్ల ప్రజలు ఆదరిస్తారనే నమ్మకం కూటమి పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. అందుకే కూటమి పాలకులు మంచి పరిపాలన అందించడంపై కంటే, జగన్ను జనంలో చెడ్డ చేయడానికే విపరీత ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. అయితే గత ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిపాలైనా, ఆ పార్టీకి రాజకీయ భవిష్యత్ లేదని కూటమి నేతలు నమ్మకపోవడం ఇక్కడో విచిత్ర పరిస్థితి. కూటమి అధికారంలోకి రావడం మొదలు, గతంలో వైసీపీ చేసిన తప్పులను ఎప్పుడో మించిపోయింది. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలతో కూటమి పాలన మొదలైంది. అప్పుడే కూటమి నేతల్లో భయానికి బీజం కూడా పడింది. 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చీరాగానే ప్రజావేదిక కూల్చివేతతో పాలన మొదలు పెట్టారు. అందుకే ఆ ప్రభుత్వం కూడా ఐదేళ్లు తిరిగే సరికి కూలిపోయిందని ఇదే కూటమి నేతలు అనేక సార్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు వాళ్లు చేస్తున్నదేమీ వైసీపీ కంటే భిన్నమైంది కాదు. వైసీపీ కార్యాలయాల కూల్చివేతలు, ఆ పార్టీ నాయకులపై అక్రమ కేసులు, జైళ్లకు పంపడం. కూటమి పాలకులు అధికారాన్ని ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోడానికే దుర్వినియోగం చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. హామీల అమలు కూటమికి పెద్దగా ప్రాధాన్య అంశం కాదేమో అనే చర్చకు తెరలేచింది. మరోవైపు అయినవాళ్లకు ఇష్టానుసారం భూముల్ని దోచి పెడుతున్నారు. ఇవన్నీ కూడా మళ్లీ అధికారంలోకి వస్తామో, రాలేమో అనే భయంతో చేస్తున్నవే అని పలువురు అంటున్నారు. వైఎస్ జగన్ అంటే భయమే ముఖ్యంగా చంద్రబాబుతో ఎక్కువ తప్పులు చేయిస్తోంది. నిజానికి చంద్రబాబు ఆచితూచి మాట్లాడుతుంటారు. అలాంటి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిసిందంటూ నోరు జారి, సరిదిద్దుకోలేని రీతిలో ముందుకెళ్లారు. ఈ ఒక్క తప్పు టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బహుశా చంద్రబాబు ఊహించి వుండరు. ఈ ఒక్క ఆరోపణతో రాజకీయంగా వైసీపీకి సమాధి కట్టొచ్చని చంద్రబాబు అనుకున్నారు. అయితే కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి అత్యంత శక్తిమంతుడని, చేసిన తప్పులకు వెంటనే శిక్ష విధిస్తారని పసిగట్ట లేకపోయారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీపై సిట్ నివేదికతో ప్రతి ఒక్కరూ చంద్రబాబు, పవన్ను తప్పు పట్టే పరిస్థితి. ఆధారాలు లేకుండా అత్యంత పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై అవాకులు చెవాకులు ఏంటని నిలదీసే పరిస్థితి. కూటమి పాలనను బాగా గమనిస్తే, తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు నోరు జారడం, ఆయన బాటలోనే డిప్యూటీ సీఎం పవన్ నడుస్తూ, అతి చేయడం.. ఆ తర్వాత క్రమంగా ప్రజల్లో నెగెటివిటీ పెరగడం మొదలైంది. ఒకదాని తర్వాత మరొకటి కూటమి సర్కార్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తన పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వుందని స్వయంగా చంద్రబాబే కలెక్టర్ల సమావేశంలో ప్రకటించి, ఆశ్చర్యపరిచారు. చంద్రబాబు పైకి చెప్పలేకపోవచ్చు కానీ, ఇదంతా శ్రీవారి ఎఫెక్టే అనే అభిప్రాయం ప్రజానీకంలో వుంది. జగన్ అంటే భయంతో, లడ్డూ ప్రసాదంపై హిందువుల్లో ఉన్న సెంటిమెంట్ను రాజకీయంగా సొమ్ము చేసుకోడానికి, వైసీపీపై నింద వేశారు. అయితే అది బూమరాంగ్ అయ్యింది. పాపానికి ప్రాయశ్చితం బదులు, ఎదురు దాడి ద్వారా ప్రత్యర్థుల నోళ్లు మూయించాలన్న ఆలోచన మరో తప్పు అని కూటమి పాలకులకు ఎవరు చెప్పాలి? తమ వైపు న్యాయం వుందని భావించిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిట్ నివేదికను చూపుతూ, టీడీపీ, జనసేనలపై ఎక్కడికక్కడ విరుచుకుపడుతున్నారు. ఇక ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్పరం చేయాలన్న కూటమి సర్కార్ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. ఆర్థిక భారం ప్రభుత్వానికి, లాభాలు మాత్రం ప్రైవేటు దోచిపెట్టాలన్న నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత గుప్పుమంది. ఈ తప్పులన్నీ కూడా, మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడేమో అనే భయమే చేయిస్తోంది. అధికారం ఉండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే సీఎం చంద్రబాబు మొదలుకుని కూటమి నేతల దురాశే, వారి దుఃఖానికి కారణమవుతోందని చెప్పక తప్పదు.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat