ShareChat
click to see wallet page
search
॥హరే కృష్ణ హరే కృష్ణ ॥ భగవద్గీత కేవలం గ్రంథం కాదు, మానవ జీవితానికి మార్గదర్శక గురువు. శ్రీకృష్ణుడు కేవలం దేవుడు మాత్రమే కాదు గురువు, మార్గ దర్శి, ఆత్మజ్ఞానాన్ని , భక్తిని ప్రసాదించువాడు మోక్షప్రదాత జగద్గురువు. మన్‌మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు । మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః ॥ మనస్సును నాపై నిలుపు. నన్ను భక్తితో ఆరాధించు. నాకు నమస్కరించు. అలా చేసినచో నన్నే చేరుతావు. (భక్తి సులభమైన మార్గమని గురువు చెప్తాడు.) సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ । అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥ అన్ని ధర్మ భ్రాంతులను విడిచి నన్నే ఏకైక శరణుగా స్వీకరించు. నేనే నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తి చేస్తాను. భయపడవద్దు. (ఇది జగద్గురువు శ్రీకృష్ణుడి ఉపదేశం) ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ నమో నమః ।🙏🌷 #తెలుసుకుందాం #భగవత్ గీత సారాంశం #భగవద్గీత🙏 #🙏🏼భగవద్గీత #🙏కృష్ణం వందే జగద్గురుమ్🙏
తెలుసుకుందాం - Pew Pew - ShareChat