ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #పబ్లిక్ టాక్.. 🗣️ *జగన్, బాబు పాలనలపై మొదలైన పోలిక..❗* JANUARY 29, 2026🎯 కూటమి సర్కార్ పాలన రెండేళ్లకు చేరింది. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. ఎన్నెన్నో ఆశలతో కూటమిని జనం అధికారంలోకి తెచ్చుకున్నారు. ఇంకో ఆరు నెలలు గడిస్తే సగం పాలన పూర్తి కానున్న నేపథ్యంలో, హామీల అమలుపై జనంలో చర్చ మొదలైంది. మరీ ముఖ్యంగా సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో జగన్, చంద్రబాబు పాలనపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కూటమి పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంటుందనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం. వచ్చే నెల చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం వచ్చే నెల ప్రవేశ పెట్టే బడ్జెట్ ముఖ్యం. ఇది మూడో బడ్జెట్ కావడం అత్యంత ప్రధానమైంది. ఈ బడ్జెట్ కాకుండా, మరో రెండు బడ్జెట్లు మాత్రమే ప్రవేశ పెట్టే హక్కు కూటమి సర్కార్కు వుంటుంది. అంటే కూటమి పాలనకు వచ్చే నెల బడ్జెట్తో 60 శాతం పూర్తి అవుతున్నట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కూటమి వచ్చిన తర్వాత ఒనగూరిన ప్రయోజనాలు ఏంటని ప్రజలు వెనుదిరిగి చూసుకుంటున్నారు. ప్స్, అబ్బే ఏమీ లేదనే పెదవి విరుపు. ఒకవైపు ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తూ, రాష్ట్రాన్ని ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. గత తొమ్మిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రూ.85,312 కోట్ల అప్పులు చేసింది. ఆ సొమ్మంతా ఏమైంది? ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ప్రజలకు కలిగిన ప్రయోజనం ఎంత? అనే ప్రశ్నలకు ....ఎలాంటి సమాధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే జగన్, బాబు పాలనలపై జనంలో చర్చ. వైఎస్ జగన్ తన పాలనలో సంక్షేమానికి పెద్దపీట వేశారు. కరోనా మహమ్మారి రెండేళ్లపాటు ఆర్థికంగా వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇలాంటి విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాల అమలుకు జగన్ సాకులు చెప్పలేదు. ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందులతో ప్రజలకు సంబంధం లేదన్నట్టుగా, సంక్షేమ పథకాలను యధావిధిగా చెప్పిన సమయానికి అమలు చేశారు. ఈ విషయంలో జగన్ నిబద్ధత టీడీపీని భయపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు బలమైన ఓటు బ్యాంకు వుంది. అదంతా మళ్లీ జగన్ వెంటే నడిస్తే, ఇక రాజకీయంగా తమకు సమాధి తప్పదని చంద్రబాబు ఆందోళన చెందారు. అందుకే సంక్షేమ పథకాల లబ్ధిదారుల్ని తమవైపు తిప్పుకోవాలని చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ముందుగా వాళ్లతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందామన్నట్టు చంద్రబాబు అడుగులు వేశారు. అందులో భాగంగా సూపర్ సిక్స్ పేరుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రకటించారు. వీటిని అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదనే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటి వాటిని చంద్రబాబు కొట్టి పారేశారు. సంపద సృష్టించి, సంక్షేమ పథకాల్ని అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆశ చెడ్డది. ప్రభుత్వ ఇబ్బందులతో పనేంటని ఎక్కువ మంది అనుకున్నారు. ఎన్నికల్లో కూటమికి బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం హామీల అమలు ఏ రీతిలో సాగుతున్నదో తెలుసు. చాలా వరకు మొక్కుబడిగా సాగుతున్నాయనే నిట్టూర్పు జనంలో కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ప్రతి నెలా ఏదో ఒక వర్గం ప్రజలకు సంక్షేమ లబ్ధి కలిగేది. దీంతో జనం చేతిలో డబ్బు తిరిగాడేది. దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి ఉండేది. ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు పాలనలో అలాంటి వాతావరణం లేదనే చర్చ జనంలో ఉంది. వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ప్రత్యేకంగా క్యాలెండర్ వుండేది. దాన్ని ఆధారంగా సంక్షేమ పథకాల లబ్ధిదారులు కూడా ఆర్థిక ప్రణాళికలు వేసుకునేవారు. చంద్రబాబును సీఎం చేసుకుంటే, అంతకు మించి ఆర్థిక ప్రయోజనాల్ని పొందొచ్చని ఆశించిన వారికి నిరాశ తప్పలేదు. సంక్షేమ పథకాలపై కొండంత రాగం తీసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ………అమలు విషయానికి వస్తే కూనిరాగమా? అని ప్రశ్నించే పరిస్థితి. ఇప్పుడు అప్పుల కోసం కూటమి సర్కార్ ప్రతివారం ఆర్బీఐకి ఇండెంట్ పెట్టడం తప్ప, సంక్షేమ పథకాల క్యాలెండర్ మాటే లేదు. ప్రతినెలా కూటమి సర్కార్ రూ.9 వేల కోట్లకు తక్కువ కాకుండా అప్పులు చేస్తోంది. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద జవాబుదారీతనం లేదు. వైసీపీ హయాంలో ఇలా వుండేది కాదు. అమ్మఒడి, రైతు భరోసా తదితర పథకాల అమలుకు ప్రతి ఏడాది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండానే రూ.20 వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన మాట నిజం కాదా? పోనీ కేంద్ర ప్రభుత్వం కలుపుకుని అయినా, మొదటి ఏడాది నుంచే ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు బాబు సర్కార్ నుంచి సమాధానమే లేదు. సంపద సృష్టించి స్వర్గాన్ని చూపుతానని చంద్రబాబు మాట దేవుడెరుగు, విచ్చలవిడి అప్పులతో ప్రజలకు నరకం చూపుతున్నారన్న విమర్శ వెల్లువెత్తుతోంది. అప్పులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులైనా చేస్తున్నారా? అంటే, అదీ లేదు. కనీసం రోడ్లను కూడా బాగుచేయలేని దుస్థితిలో ప్రభుత్వం వుంది. కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో 2025 సంక్రాంతి నాటికి రాష్ట్రమంతా రోడ్లను పాలు పోసి తిరిగి ఎత్తుకునేలా వేస్తామని బడాయి మాటలు చెప్పారు. 2026 సంక్రాంతి కూడా వెళ్లిపోయింది. కానీ రోడ్ల పరిస్థితి దయనీయంగా వుంది. ఒక్క రోడ్లనే కాదు, అసలు రాష్ట్రంలో ఫలానా అభివృద్ధి జరిగిందని చెప్పడానికి ఒక్కటంటే ఒక్కటి కూడా లేదనే విమర్శకు సమాధానం రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రతినెలా రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైందో ఎవరికీ తెలియదు. దానిపై మహిళలు ఆశ వదులుకున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్న హామీ ఊసేలేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు గుడ్డిలో మెల్ల అన్నటుగా, ఏడాది తర్వాత అమలుకు శ్రీకారం చుటారు. అది కూడా లబ్ధిదారుల్లో భారీ కోత. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కూడా అంతే. మొదటి ఏడాదిలో ఒకే ఒక్క సిలిండర్తో సరిపెట్టారు. మరీ ముఖ్యంగా లబ్ధిదారుల్లో భారీ కోత. ఇక పింఛన్ల విషయానికి వస్తే, ఏ రకంగా కోతలు పెట్టారో, లబ్ధిదారులు రోడ్డెక్కిన తీరు కళ్లెదుటే వుంది. కొత్త పింఛన్దారుల ఎంపిక ఊసే లేదు. అందుకే వైఎస్ జగన్ పాలనతో పోలిక మొదలైందని చెప్పడం. ఇవన్నీ కూడా అసంతృప్తికి కారణమవుతాయి. ప్రతిదీ ఎన్నికల నాటికి లెక్కలోకి వస్తుంది. సంక్షేమ పథకాల అమలుపై జనంలో అసంతృప్తి కనిపిస్తుండగా, పాలకులు మాత్రం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. సంక్షేమ పథకాల అమలుపై పాలకుల అత్యుత్సాహం చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. తమ బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ చేయకుండానే, అంతా చేసేశామనే క్రెడిట్ను పాలకులు ఖాతాలో వేసుకోవడంపై ఆగ్రహిస్తున్నారు. ప్రజల్లో అసంతృప్తిని పరిగణలోకి తీసుకోకుండా, తమకు తామే సూపర్ సిక్స్ హామీల్ని అమలు చేసిన హీరోలుగా భుజాలు తట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే రానున్న రోజుల్లో ప్రజల అసంతృప్తిని సీఎం చంద్రబాబు ఎదుర్కోవాల్సి వుంటుంది. అమలు చేయని హామీల్ని కూడా చేసినట్టు చెప్పి, ప్రజల్ని ఎలా మెప్పిస్తారు? వారిలోని అసంతృప్తిని బాబు ఏ విధంగా అధిగమిస్తారనేదే ఇప్పుడు చర్చ. కాలం ఎలాంటి రాజకీయ మార్పు తీసుకొస్తుందో చూడాలి.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat