Hare Krishna Prabhu dandvat pranam 🙏
Date ; 11 Sunday December 2026
Topic ; మైండ్ డిటాక్స్ హరికృష్ణ జప యజ్ఞం ,బ్రెయిన్ ఫాగ్ మెదడు ఆరోగ్య సూత్రాలు, తిరుప్పావై పాశురాలు, ప్రభుపాదుల వారి జూలై 9 th లెటర్
speaker ; Chaitanya Krishna Prabhu
1 . భక్తి అంటే మూఢనమ్మకం కాదు.భక్తి అంటే ఎవరి మీదనో బాధ్యత నెట్టివేయడం కాదు.కర్మలకు మనం తలవంచకూడదు, కర్మలను గుడ్డిగా అంగీకరించకూడదు. మనుషులుగా జన్మ తీసుకున్నాం కాబట్టి
మన జీవితానికి పూర్తి బాధ్యత మనమే వహించాలి.ప్రతి వ్యక్తి తన జీవితానికి తానే బాధ్యుడు.తన కర్మలను తానే తెలుసుకుని,తన కర్మబంధాలను తానే తొలగించుకోవాలి.ఎవరి కాళ్లపై వాళ్లే నిలబడాలి.కృష్ణుని శక్తి, బలం, కృప తీసుకోవాలి.
2. సంక్రాంతి పర్వదినాన జరిగే జప యజ్ఞాలకు నేనే పూర్తిగా బాధ్యత వహిస్తున్నాను.నేను నన్ను నేను పవిత్రమైన భక్తుడిగా మలచుకోవాలని సంకల్పం తీసుకుంటున్నాను.భక్తి అంటే మూఢనమ్మకం కాదు.భక్తి అంటే తపస్సు ద్వారా అనుభూతి చెందాల్సిన ఆధ్యాత్మికమైన, గోప్యమైన, రహస్యమైన అత్యంత ముఖ్యమైన సాధన.ఇది ఎవరికీ లొంగదు —
కేవలం తపస్సుకే లొంగుతుంది.కాబట్టి నేను తపస్సు చేస్తాను.చలిని తట్టుకుని తపస్సు చేస్తాను.నన్ను నేను ఉద్ధరించుకుంటాను. అని సంకల్పం తీసుకోవాలి
.3. కలియుగంలో భక్తి అంటే వినడం, సంకీర్తన, ప్రసాదం శ్రీల ప్రభుపాదులు, గోదాదేవి తిరుప్పావై సందేశం కలియుగంలో భక్తి అంటే ఏమిటి? అది కఠినమైన తపస్సులా? కష్టమైన నియమాలా?లేదా చాలా సులభమైన, సహజమైన జీవన విధానమా? ఈ ప్రశ్నకు సమాధానం శ్రీల ప్రభుపాదులు, మరియు గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలలో స్పష్టంగా చెప్పారు.
.4 . కలియుగ ధర్మం – వినడం (శ్రవణం)శ్రీల ప్రభుపాదులు పదే పదే చెప్పారు –
“కలియుగంలో కూర్చొని వినడమే చాలును.”గురువు చెప్పిన వాక్యం
చెవుల ద్వారా మన హృదయంలోకి ప్రవేశిస్తే అదే సాధన అవుతుంది.
ఇది భక్తి యొక్క మొదటి మెట్టు శ్రవణం.శరీరంతో కాకుండా, మనస్సుతో వినడం. వినడం ద్వారా చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తం శుద్ధమైతే భక్తి సహజంగా వికసిస్తుంది.
5 . చైతన్య మహాప్రభు కలియుగానికి ఇచ్చిన మార్గం ఒక్కటే: హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన ఆయన ఫోటో ముందు,ఆయన సన్నిధిలో,
అలంకారాల కోసం కాదు –ఆయన సేవ కోసం మాత్రమే సంకీర్తన చేయాలి.
భక్తి అంటే ప్రదర్శన కాదు.భక్తి అంటే వినయం, ఐక్యత, ఆనందం.
6 . తిరుప్పావై 27వ పాశురం – నిజమైన ఆభరణం ఏమిటి? గోదాదేవి 27వ పాశురంలో శుభ్రమైన ఆభరణాలు ధరించేదము” అని చెబుతుంది. ఇక్కడ ఆభరణాలు అంటే బంగారం కాదు.అమ్మవారు చెప్పే ఆభరణం ఏమిటంటే:
భగవంతుడు ఇచ్చిన ప్రాణం భగవంతుడు ఇచ్చిన శ్వాస భగవంతుడు ఇచ్చిన జ్ఞానం భగవంతుడు ఇచ్చిన భక్తి మన శరీరాన్ని అలంకరించేది కాదు నిజమైన ఆభరణం,మనకు జీవం ఇచ్చిన ప్రాణమే అత్యంత గొప్ప ఆభరణం.
7 . అందుకే గోదాదేవి చెబుతుంది:
భగవంతుడికి ఇవ్వాల్సిన గొప్ప బహుమతి – మన ప్రాణమే.నిజమైన జీవితం అంటే ఏమిటి?ఇప్పటి మనిషి తన ప్రాణాన్ని శరీరం కోసం,వ్యక్తుల కోసం,
భౌతిక అవసరాల కోసం వాడుతున్నాడు.కానీ నిజమైన జీవితం అంటే:మన ప్రాణాన్ని పూర్తిగా కృష్ణునికి అర్పించడం.మన శ్వాస, మన మాట, మన తినడం, మన బ్రతకడం –అన్నీ కృష్ణుని కోసం అయితే అదే అందమైన జీవితం (Beautiful Life).
8 . ప్రసాదం – ఆకలి కోసం కాదు, చిత్తశుద్ధి కోసం బయటివాళ్లు ఆహారం తింటారు – ఆకలి తీర్చుకోవడానికి.భక్తులు ఆహారం తింటారు – చిత్తాన్ని మార్చుకోవడానికి. కృష్ణునికి నివేదించిన ఆహారం కేవలం శరీరాన్ని కాదు,
మన చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రసాదం గత జన్మ పాపాలను కరిగిస్తుంది
కామ, క్రోధ, లోభ, మోహాలను శాంతింపజేస్తుంది మనసును పవిత్రం చేస్తుంది
9 అందుకే గోదాదేవి చెబుతుంది –ఆహారం స్వామికి నివేదించి తినాలి. ఆకలి కోసం కాదు.ఒక్కసారి నిజమైన కృష్ణ ప్రసాదం ప్రేమతో తీసుకుంటే
ఒక మనిషి జీవితం సంపూర్ణమవుతుంది.. భక్తి ఒంటరిది కాదు – సాధు సంగత్యం భక్తులు ఎప్పుడూ ఒంటరిగా తినరు.మొదట కృష్ణుడు, తర్వాత మనం.భక్తి ఒంటరిగా కాదు –సాధు సంగత్యంలో చేయాలి.అందుకే గోదాదేవి మొదటి పాశురాల నుంచేఅందరినీ పిలుస్తుంది:రండి… టైం అయింది… అందరూ కలిసి చేయండి.”కమ్యూనిటీలో భక్తి చేస్తే:భక్తి సులభం అవుతుంది
ఆనందం పెరుగుతుంది జీవితం సరళమవుతుంది
10 . భక్తి చాలా సింపుల్ భక్తి అంటే: కలిసి కూర్చోవడం కలిసి వినడం కలిసి సంకీర్తన చేయడం కలిసి ప్రసాదం తీసుకోవడం ఇంతే.ఇది కష్టం కాదు.
ఇది బాధ కాదు.ఇది కలియుగానికి దేవుడు ఇచ్చిన వరం.శ్రీల ప్రభుపాదులను సరైన విధంగా అనుసరిస్తే భక్తి యోగం అత్యంత సులభం అవుతుంది. కృష్ణుడు మనతోనే ఉన్నాడు.మన తలుపు తడుతూ ఉన్నాడు.మన పని ఏమిటంటే:వినడo సంకీర్తన చేయడంప్రసాదం అర్పించి తీసుకోవడం సాధు సంగత్యంలో జీవించడం ఇంతే.ఇదే భక్తి.ఇదే జీవితం.ఇదే కలియుగ ధర్మం.
12. చైతన్య మహాప్రభు కలియుగానికి ఒకే మార్గాన్ని స్పష్టంగా చెప్పారు – సంకీర్తన. కలియుగ లక్షణం ఏమిటంటే, ఏది సులభంగా దొరికితే దానికి విలువ ఇవ్వకపోవడం. అలాగే “ఉచితంగా ఉంది కదా” అని సంకీర్తనను నిర్లక్ష్యం చేయడం కూడా మనం చేసే పెద్ద తప్పు. సంకీర్తన లేకపోతే భగవంతుడు కృష్ణుడు మనకు గుర్తుకే రాడు. మనం ఎంతగా మరిచిపోతామో, అంతగా మన జీవితం అయోమయంలో పడుతుంది.
13. తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఇవి తెలియకుండా జీవితం ప్రారంభిస్తే మనం తెలియకుండానే గందరగోళంలోకి, మాయలోకి, బ్రెయిన్ ఫాగ్‌లోకి వెళ్లిపోతాం.
మొదటి విషయం – మనలో ఇంకా పూర్ణమైన మేచ్యూరిటీ రాలేదు. తల్లి–కూతురు, తండ్రి–కొడుకు, భర్త–భార్య సంబంధాల్లో వచ్చే భావోద్వేగాలు, అసంతృప్తి అన్నీ దీనికి ఉదాహరణలు. రెండో ముఖ్యమైన విషయం – మరణం గురించి మనం పూర్తిగా మర్చిపోతున్నాం. కానీ ఈ ఒక్క క్లాస్‌ని నిజంగా అటెండ్ అయితే, జీవితానికి సంబంధించిన డేటా మొత్తం బయటకు వస్తుంది.
14 .మన మాటలను ఎలా కంట్రోల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎదుటివాళ్ల వల్ల మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, ఇష్టమైన వాళ్ల ఇంట్లో ఎవరో ఒక మాట అంటే మనం ఎందుకు వెంటనే రిటర్న్ రియాక్షన్ ఇస్తాం – ఇవన్నీ బ్రెయిన్ ఫాగ్ వల్లే జరుగుతున్నాయి.ఇప్పుడు పెళ్లిళ్లు, రిలేషన్‌షిప్స్, ఆకర్షణలు – ఇవన్నీ హార్మోన్ల ఆట. కార్టిసాల్, డోపమైన్ వంటి హార్మోన్లు రక్తంలో కలిసినంత వరకూ ఆకర్షణ ఉంటుంది. ఆ హార్మోనల్ రష్ తగ్గగానే సమస్యలు మొదలవుతాయి. ఎందుకిలా జరుగుతుంది అంటే – బ్రెయిన్‌కు అవసరమైన ఆక్సిజన్, గ్లూకోజ్ సరైన మోతాదులో అందకపోవడమే కారణం. ఈ పరిస్థితినే బ్రెయిన్ ఫాగ్ అంటారు. ఇది మనిషిని లోపల నుంచి బాధ పెడుతుంది.
15 . దీనికి ప్రధాన పరిష్కారం ఒక్కటే – హరే కృష్ణ మహా మంత్ర జపం, అది కూడా ఎర్లీ మార్నింగ్. బ్రహ్మ ముహూర్తంలో, ఉదయం 4:00 గంటలకు హరే కృష్ణ మహా మంత్రాన్ని అందించాలి. ఆ సమయానికి జపం చేయకపోతే మనసు డిమాండ్ చేయడం మొదలుపెడుతుంది. ఆ డిమాండ్స్ వల్ల హార్మోన్లు రిలీజ్ అవుతాయి. జపశక్తి లేకపోతే లస్ట్, డిజైర్స్, వాసనలు అన్నీ యాక్టివేట్ అవుతాయి.
16 . అందుకే ఎప్పుడూ హరినామాన్ని అందిస్తూ ఉండాలి. ఇదే నిజమైన మైండ్ డిటాక్స్. మైండ్ డిటాక్స్ అంటే ఏంటంటే – మహా మంత్రాన్ని మొదలుపెట్టడమే. ఒకసారి జపం మొదలుపెడితే ఆక్సిటోసిన్ లెవల్స్ సరిగ్గా బ్యాలెన్స్ అవుతాయి. బ్రెయిన్ ప్రశాంతంగా మారుతుంది.
17 . శ్రీల ప్రభుపాదులు కూడా ఇదే చెప్పారు – ఉదయం జపం విన్న మనసు, రాత్రి వచ్చే వాసనలకు, కోరికలకు అంత తేలికగా లొంగదు. కానీ సాధన లేకపోతే బ్రెయిన్‌లో డోపమైన్ రిలీజ్ అవుతూ “ఇది కావాలి, అది కావాలి” అని రెచ్చగొడుతుంది.? ఇవన్నీ మనసే అడుగుతుంది. మనసు అడిగినప్పుడు బ్రెయిన్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది.
18 . మైండ్ డిటాక్స్ అంటే సమస్యల కోసం బాధపడడం కాదు. సమస్యలను హ్యాండిల్ చేయలేకపోవడమే ప్రాబ్లం. ఒక సిట్యుయేషన్‌ని ఎదుర్కోలేకపోతే అదే బ్రెయిన్ ఫాగ్.ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్పారు – బ్రహ్మ ముహూర్తంలో లేవని వారు నిజమైన హ్యూమన్ బీయింగ్స్ కారు. రాత్రి లేటుగా పడుకుని ఉదయం లేటుగా లేవడం వల్ల ఆక్సిజన్, గ్లూకోజ్ సరైన విధంగా బ్రెయిన్‌కు చేరవు. అప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. వచ్చిన సమస్యలను ఫేస్ చేయలేరు. అదే బ్రెయిన్ ఫాగ్.
19 . ఎర్లీ మార్నింగ్ లేచి సాధన చేస్తే బ్రెయిన్ పవర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇది జీవితానికి సంబంధించిన రూట్ కాజ్‌లను అనాలిసిస్ చేయగల శక్తిని ఇస్తుంది. మనం ఎవరి మీద ఆధారపడకూడదు. కృష్ణుడు ఇచ్చిన సాధన – అదే మనని రక్షిస్తుంది. మనల్ని నడిపించేది కూడా హరే కృష్ణ మహా మంత్ర జపసాధనే.
20 . సాధనలో బలహీనత వస్తే మనుషుల మీద ఆశ పెడతాం. వాళ్లు కాపాడతారని, ఓదారుస్తారని అనుకుంటాం. కానీ నిజం ఏంటంటే – మనుషులందరూ కూడా బ్రెయిన్ ఫాగ్‌లోనే ఉన్నారు. ఒక బ్రెయిన్ ఫాగ్ వ్యక్తి ఇంకొక బ్రెయిన్ ఫాగ్ వ్యక్తిని ఎలా రక్షిస్తాడు? ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపించలేడు కదా మనకు ఒక్కటే ఆశ్రయం – బ్రహ్మ ముహూర్త సాధన.
బ్రెయిన్ పూర్తిగా అలసిపోయి నిద్రపోతే రోగాలు వస్తాయి. అందుకే క్రమశిక్షణ అవసరం. ఒకే టైమ్‌కి నిద్రపోవడం, ఒకే టైమ్‌కి లేవడం – ఇదే డిసిప్లిన్ మెకానిజం. ఎర్లీగా పడుకుంటే ఎర్లీగా లేస్తాం. అప్పుడు బ్రెయిన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎంత పెద్ద పనైనా సులభంగా చేయగల శక్తి వస్తుంది.
అలాంటి స్థితిలో మన మాటల్లో శక్తి ఉంటుంది. ఆ వైబ్రేషన్స్ ఎదుటివాళ్లను కూడా మార్చేస్తాయి. హృదయం నుంచి మాట్లాడే శక్తి వస్తుంది. ఎంత కష్టం వచ్చినా – “ఓకే, నో ప్రాబ్లం” అని స్వీకరించే స్థితి వస్తుంది.
21 . ఇప్పుడైతే స్త్రీ–పురుషులు అందరూ జిమ్‌లకు వెళ్తున్నారు. కానీ బ్రెయిన్ ఫాగ్ నుంచి ఎలా బయటపడాలో తెలియదు. భక్తి అంటే కేవలం ఆనందించడం కాదు. భగవంతుడికి నిజంగా సేవ చేసే వాళ్ల మాటలను భగవంతుడు వింటాడు. ఎందుకంటే సేవకులు భగవంతుడికి చాలా ఇష్టం.
అందుకే – మన ఏకైక దిక్కు సాధనే. హరే కృష్ణ మహా మంత్ర జపసాధనే మన జీవితానికి రక్షణ.
22. Ex ; తల్లి–కూతురు సంబంధం: భగవంతుడితో మన సంబంధానికి ఉదాహరణ ఒక తల్లి తన కూతురు ఇంటికి ఆలస్యంగా వస్తే ఎలా ఆందోళన చెందుతుందో మనకు తెలుసు.“ఎక్కడ ఉంది?”ఏమైంది?ఇంకా రాలేదే?”
ఆ కూతురు ఇంటికి వచ్చే వరకు ఆ తల్లి తినలేరు, నిద్రపోలేరు. ఎందుకు?
ఎందుకంటే ఆ ఇద్దరి మధ్య లోతైన సంబంధం (బాండింగ్) ఉంది.
ఇదే ఉదాహరణను మనం భగవంతుడి దృష్టితో చూడాలి. మనం 84 లక్షల జన్మల నుంచి భగవంతుడి నుండి దూరమయ్యాము. మరి మన తల్లి కూతురి కోసం ఇంత ఆందోళన పడితే, మన కోసం కృష్ణుడు ఎంతగా ఎదురుచూస్తుంటాడో ఊహించండి.
23. మనలో ప్రేమ, ఆందోళన, బంధం అనే భావాలు మనమే సృష్టించలేదు. అవి భగవంతుడి నుంచే మనకు వచ్చాయి. అందుకే మన పిల్లలపై, కుటుంబంపై ఆ భావాలు వ్యక్తమవుతాయి.ఈ భావాలను ఎవరు సృష్టించారు? ఒక తల్లి–కూతురి మధ్య ఉన్న భావోద్వేగాలు,భార్య భర్త కోసం ఎదురుచూపులు,
తల్లిదండ్రుల ప్రేమ —ఇవన్నీ మనుషులు సృష్టించినవి కావు.ఈ భావాలను సృష్టించినవాడు భగవంతుడు.
24. అందుకే మనం వెనక్కి ఆలోచిస్తే –ఈ పిల్ల నా కడుపులో ఎందుకు పుట్టింది?”
“ఇంటికి ఆలస్యంగా వస్టే నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను?”
అలా వెనక్కి వెళ్తే చివరికి మనకు కృష్ణుడు దర్శనమిస్తాడు. అదే లిబరేషన్‌కు ఆరంభం.
25. శరీరం – మనస్సు – ఆత్మ
మన జీవితం మూడు స్థాయిల్లో ఉంటుంది:
శారీరక (Biological)
మానసిక (Psychological)
ఆధ్యాత్మిక (Spiritual)
శరీరం మరియు మనస్సు హార్మోన్లపై ఆధారపడతాయి.
ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా – అవి శాశ్వతంగా ఉండవు.
ఉదాహరణకు:ఎవరో మరణిస్తే ఎంతకాలం ఏడుస్తాము?
ఒక సంవత్సరం తర్వాత అదే బాధ ఉంటుందా?లేదు.
ఎందుకంటే మన శరీరం, మనస్సు దుఃఖాన్ని శాశ్వతంగా మోయలేవు. హార్మోన్లు తగ్గిపోతాయి, భావాలు మారిపోతాయి.
26 . తాత్కాలిక సంబంధాలు – శాశ్వత సంబంధం
ఈ ప్రపంచంలోని సంబంధాలన్నీ:తల్లి తండ్రి భార్య భర్త పిల్లలుశరీరం మరియు మనస్సు వరకే పనిచేస్తాయి.శరీరం ముగిసిన వెంటనే అవి కూడా ముగుస్తాయి.
కానీ మనలో ఒక కోరిక ఉంటుంది:నా సంబంధాలు శాశ్వతంగా ఉండాలి.”
ఆ కోరిక తప్పు కాదు.కానీ తాత్కాలికమైన మనుషులపై శాశ్వతమైన ఆశ పెట్టుకోవడమే తప్పు.శాశ్వత సంబంధం పెట్టుకోవాల్సింది శాశ్వతమైన భగవంతుడితో మాత్రమే. అది మాత్రమే మానవజీవిత లక్ష్యం
27. జంతువులు కూడా కుటుంబాన్ని ప్రేమిస్తాయి.కానీ మానవజన్మ ప్రత్యేకత ఏమిటంటే: శాశ్వతమైన సంబంధాన్ని గుర్తించడం.మనవాళ్లు దూరమైతే బాధ పడాలి – కానీ వాళ్లు కృష్ణభక్తి చేస్తే ఎంత బాగుండేది” అనే భావంతో బాధపడాలి.అలా కాకుండా భగవంతుడిని మరిచిపోయే స్థాయికి వెళ్లిపోతే అది ప్రమాదం.
28. మెదడుపై పొగ కమ్మినట్టు ఉంటుంది — అందుకే దీనికి Fog అని పేరు.
బ్రెయిన్ ఫాగ్ ఎందుకు వస్తుంది? (రూట్ కారణం)
మెదడుకు కావాల్సిన oxygen glucose సరిగా అందకపోతే బ్రెయిన్ ఫర్ వస్తుంది. అవి ఎప్పుడు సరిగా అందమంటే రాత్రి లేటుగా పడుకోవడం ఉదయం లేటుగా లేగడం నిద్ర టైమింగ్ డిస్ప్లే లేకపోవడం ఎప్పుడు ఫోన్ చూడడం కామ క్రోధలో ఆలోచనలు మనసు డిమాండ్ చేసే దారిలో నడవడం అప్పుడే సమస్య మొదలవుతుంది హార్మోన్స్ కంట్రోల్ లో ఉండవు ఎవరు ఒక మాట అన్నా రియాక్ట్ అయిపోతాం వెంటనే సమస్యను హ్యాండిల్ చేయలేక దాన్ని ప్రాబ్లం గా ఫీల్ అవుతాము. సరియైన నిర్ణయాలు తీసుకోలేము శాంతి అనేది ఉండదు. ఇది ఉన్నంతవరకు బయట ప్రపంచాన్ని కాదు తన మనసును తాను కూడా కంట్రోల్ చేసుకోలేడు.
29. బ్రెయిన్ ఫాగ్ – ఆధునిక సమస్య : ఈ కాలంలో 90% మందికి బ్రెయిన్ ఫాగ్ ఉంది.అంటే:స్పష్టమైన ఆలోచనలేకపోవడంనిర్ణయాలు తీసుకోలేకపోవడం
మళ్లీ మళ్లీ అదే తప్పులు చేయడందీనికి కారణం:హార్మోన్ల అసమతుల్యత
నిద్ర లోపం ఓవర్ స్టిమ్యులేషన్ (మొబైల్, రీల్స్, వీడియోలు)చెడు అలవాట్లు
30. .మంత్రజపం ఎందుకు అవసరం? బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే: ఆక్సిజన్
గ్లూకోజ్ సరైన శబ్ద తరంగాలు (Sound waves)హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే: బ్రెయిన్‌కు ఆల్ఫా తరంగాలు తగులుతాయిబ్రెయిన్ ఫాగ్ తగ్గుతుంది
నిర్ణయాలు స్పష్టంగా వస్తాయిఎర్లీ మార్నింగ్ జపం, క్లాస్, ధ్యానం — ఇవి రివర్స్ ఇంజనీరింగ్ లాగా పని చేస్తాయి. చెడు ఆలోచన యాక్షన్‌గా మారకముందే ఆపేస్తాయి.
31. మాయ ఎలా పని చేస్తుంది అంటే చెడు ఆలోచనలు అందరికీ వస్తాయి.
అవి గత వాసనల వల్ల వస్తాయి. కానీ వాటిని యాక్షన్‌గా మార్చితే బంధనం
వాటిని జపంతో ఆపితే విముక్తి భక్తుడు పరమహంస కాదు.కానీ సాధన చేస్తే మనస్సు పవిత్రమవుతుంది ఈ భౌతిక ప్రపంచంలో: ఆనందం తాత్కాలికం
దుఃఖం తాత్కాలికం సంబంధాలు తాత్కాలికం కృష్ణుడితో ఉన్న సంబంధమే శాశ్వతం.చదవండి, ఉద్యోగం చేయండి, కుటుంబం పోషించండి – కానీ
భగవంతుడిని మరిచిపోయి బ్రతకకండి ఇదే మానవజీవిత లక్ష్యం. ఇదే చైతన్య మహాప్రభు సందేశం.ఇదే నిజమైన ఆనంద మార్గం.
32. హరే కృష్ణ మహామంత్రం లేకుండా, భగవంతుడి సేవ లేకుండా మనిషి ఎలా జీవించగలడు? దీనికన్నా గొప్ప ఆనందం ఏదీ లేదు. భగవంతుడి సేవే జీవితం యొక్క పరమ లక్ష్యం. దుఃఖాలయంలో ఉన్న ఈ భౌతిక ప్రపంచంలో నిజమైన రక్షణ ఇచ్చేది కేవలం కృష్ణ సేవ మాత్రమే.
33. కుటుంబానికి 23 గంటలు ఇచ్చి, భగవంతుడికి ఒక్క గంట కూడా ఇవ్వకపోతే మళ్లీ మళ్లీ జన్మలు తప్పవు. మన ముఖాన్ని ఎవరు సృష్టించారు? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది? అని ప్రశ్నించుకోవాలి. గుడ్డిగా భక్తి చేయకూడదు; తత్త్వాన్ని అర్థం చేసుకుని భక్తి చేయాలి.
34. ప్రభుపాదుల వారి వీలునామా మరియు ఆఖరి ఆదేశాల అంశం
1997లో శ్రీల ప్రభుపాదుల వారు శరీరాన్ని విడిచిపెట్టే ముందు ఒక ముఖ్యమైన ఆదేశాన్ని ఇచ్చారు. సాధారణంగా ఒక వ్యక్తి శరీరాన్ని విడిచేటప్పుడు వీలునామా రాస్తాడు. అదే విధంగా ప్రభుపాదుల వారు కూడా ఇస్కాన్ భవిష్యత్తు ఎలా ఉండాలో స్పష్టంగా నిర్దేశించారు.ఆ ఆదేశాన్ని మార్చకూడదు, దాచకూడదు, పక్కకు నెట్టకూడదు. కానీ ఆ వీలునామాని పాటించకుండా, దాన్ని దాచిపెట్టి, తర్వాతి కాలంలో మార్పులు చేశారు.
35 . జూలై 9 లెటర్‌కు ముందు–తరువాత జరిగిన విషయాలు
1977 ఏప్రిల్ 22 నుండి జూలై 9 మధ్యలో ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్పారు:నేను శరీరంతో ఉన్నా లేకపోయినా, దీక్షల విషయంలో గురువు నేనే.”
జూలై 9, 1977 లెటర్‌లో ఋత్విక్ (Ritvik) వ్యవస్థను ప్రకటించారు. కానీ ఆ లెటర్‌ను సరైన విధంగా అమలు చేయలేదు.దాని బదులుగా, కొంతమంది ఇన్‌స్ట్రక్టర్లు తమను తాము “లివింగ్ గురువులు”గా ప్రకటించుకున్నారు. ఇది ప్రభుపాదుల వారి ఆదేశాలకు విరుద్ధం.
36. దీక్ష, గురు తత్త్వం మీద జరిగిన మోసం ప్రభుపాదుల వారు స్పష్టంగా చెప్పారు: ఎవరైనా దీక్ష తీసుకుంటే, వారు నా శిష్యులే.”ఋత్వికులు కేవలం ప్రతినిధులు మాత్రమే, గురువులు కాదు.”కానీ ఈ సత్యాన్ని దాచిపెట్టి, చాలా మంది గురువులుగా మారిపోయారు. సామాన్య భక్తులకు ఈవిషయం
తెలియజేయలేదు.వాళ్లు భగవద్గీత చదువుతారు, భాగవతం చదువుతారు, హరినామం చేస్తారు, కానీ ఈ జూలై 9 లెటర్ గురించి, ప్రభుపాదుల విల్ గురించి వారికి తెలియదు.
37. ప్రభుపాదులు చనిపోయారు” అనే భావనపై విమర్శ ప్రభుపాదుల వారు సాధారణ జీవులలా మరణించలేదు. వారు నిత్య గురు తత్త్వం.
గురు శరీరానికి అతీతుడు. మన కోసమే శరీరాన్ని స్వీకరిస్తారు.
ఈ రోజు కూడా మనం ప్రభుపాదుల శక్తితోనే క్లాసులు వింటున్నాం, పుస్తకాలు చదువుతున్నాం, భక్తి చేస్తున్నాం.
38. నకిలీ గురువుల ఫలితం – మాయలో పతనం
ప్రభుపాదుల ఆదేశాలను ఉల్లంఘించిన కారణంగా చాలా మంది గురువులు మాయలో పడిపోయారు.
60 మందికి పైగా గురువులు స్త్రీలతో వెళ్లిపోయిన ఉదాహరణలు ఉన్నాయి.
వాళ్లు తమ కర్మలను శిష్యుల నుంచి తీసుకోలేకపోయారు, ఎందుకంటే వాళ్లు బోనాఫైడ్ గురువులు కాదు.
39. నిజమైన ఇస్కాన్ (Real ISKCON) మనమే మనము ప్రభుపాదుల వారు ఇచ్చిన విల్ మరియు జూలై 9 లెటర్‌ను యథాతథంగా పాటిస్తున్నాం.
అందుకే మేము “రియల్ ఇస్కాన్” అని అంటున్నాం.
ప్రభుపాదుల వారే ఇప్పటికీ, ఎప్పటికీ మన లివింగ్ గురువు.ఆయన పుస్తకాలే మన ఆరాధ్య గ్రంథాలు.
40 . భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి జూలై 9, 1977 లెటర్ – సారాంశం
జూలై 9, 1977 లెటర్ యొక్క ముఖ్యాంశాలు:
ఇస్కాన్‌లో దీక్షల కోసం ఋత్విక్ ప్రతినిధులు నియమించబడ్డారు.
ఋత్వికులు గురువులు కాదు, కేవలం ప్రభుపాదుల వారి ప్రతినిధులు మాత్రమే.
దీక్ష పొందే ప్రతి వ్యక్తి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుడే.
జపమాల ఇవ్వడం, దీక్ష పేరు ఇవ్వడం ఋత్విక్ బాధ్యత.
“మీ గురువు ఎవరు?” అని అడిగితే శ్రీల ప్రభుపాదుల వారే గురువు అని చెప్పాలి.
41. ప్రభుపాదుల వారు శరీరంతో ఉన్నా లేకపోయినా, గురు తత్త్వం ఆయనదే.
ఈ విధానం భవిష్యత్తులో కూడా కొనసాగాలని స్పష్టమైన ఆదేశం. ఆయన మరణించాడు అనడం మూర్ఖత్వం భగవంతుడు కనిపించకపోతే లేడు అనడం మూర్ఖత్వం. ఇది చాలా డేంజర్ ప్రభుపాదుల వారు మనలాంటి వ్యక్తి కాదు మామూలు మానవుడితో అసలు పోల్చకూడదని భాగవత శాస్త్రం చెప్పింది
42. గురువు అంటే ఏంటి శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పారు ఆచార్యుని గురువుని ఎప్పుడూ కృష్ణుడుగా భావించాలి ఆయన ఎప్పుడూ తక్కువగా చూడకూడదు ఆయన సాధారణ మనిషిగా అనుకోవడం మహా పాపం ఈ మాట ఎవరు చెప్పారు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పారు
43. ప్రభుపాదులు మరణించారు అని కొంతమంది చెప్తున్నారు. కానీ ప్రభుపాదులే ముందుగానే చెప్పారు – శరీరం నశిస్తుంది కానీ గురువు నశించడు. ఇప్పుడు చాలా మంది తమను తాము గురువులుగా ప్రకటించుకుంటున్నారు. కానీ గురువులు కూడా మరణిస్తారు. హరే కృష్ణ మూమెంట్‌కి నిజమైన రక్షకుడు ఒక్కరే – శ్రీల ప్రభుపాదులే.
44. కాబట్టి మనం దీనిని చాలా స్ట్రాంగ్‌గా తీసుకోవాలి. మన హృదయంలో ప్రభుపాదుల వారిని స్థిరంగా పెట్టుకోవాలి. ఆయన సామాన్య మానవుడు కాదు; భగవంతుని ప్రతినిధి. ఆయన అలా ఉన్నారు కాబట్టే మనలో మార్పులు వస్తున్నాయి, భక్తి పెరుగుతోంది, ఫెయిత్ వచ్చింది, సత్యం తెలిసింది. ఇది నిజం.
45. అందుకే మనం అంతా స్ట్రాంగ్‌గా ఉండాలి. మనందరం మంచి భక్తులుగా మారాలి. మాయలో పడకూడదు. ఎక్కడా మోసపోకూడదు. అన్ని ఆధారాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రభుపాదుల శరీరం విడిచే 12 రోజుల ముందు నుంచే చైతన్య మహాప్రభువే తన స్థానం స్వీకరిస్తారని చెప్పారు. ఆ స్థానం ఎవరికీ ఇవ్వలేదు. ప్రభుపాదుల తర్వాత ఎవ్వరూ ఆ స్థానం తీసుకోలేరు. “33 గురువులు” అనే భావన ఎక్కడా లేదు. శ్రీల ప్రభుపాదులే స్పష్టంగా చెప్పారు:
“Only Lord Chaitanya can take my place. He will take care of the movement.” #భగవద్గీత #🙏🏻కృష్ణుడి భజనలు #📙ఆధ్యాత్మిక మాటలు
అంటే – నా స్థానాన్ని తీసుకునేది ఒక్క లార్డ్ చైతన్య మహాప్రభువే. ఆయనే ఈ మూమెంట్‌ను చూసుకుంటారు.


