ShareChat
click to see wallet page
search
🧿🧿🧿🧿🧿 *పంచపునీతాలు* 🧿🧿🧿🧿🧿 🤍🤍 వాక్ శుద్ధి 🤍🤍 వేల కోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ప్రసాదించాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయరాదు. పగ, కసి, ద్వేషాలతో సాటి వారిని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ నిందించకూడదు. మాట మృదువుగా, నెమ్మదిగా, ఆదరణతో ఉండాలి. అమంగళాలు పలికే వారు ఎదురైతే వాదం కాదు… ఒక నమస్కారం పెట్టి నిశ్శబ్దంగా పక్కకు జరగడమే జ్ఞానం. 🧡🧡 దేహ శుద్ధి 🧡🧡 మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం భక్తి లక్షణం. రెండు పూటలా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. అపరిశుభ్రత ఆత్మవిశ్వాసాన్నీ, ఆరోగ్యాన్నీ రెండింటినీ దూరం చేస్తుంది. 🤎🤎 భాండ శుద్ధి 🤎🤎 శరీరానికి శక్తినిచ్చేది ఆహారం. అటువంటి ఆహారాన్ని మోసే పాత్ర కూడా పవిత్రంగా ఉండాలి. స్నానం చేసి, శుభ్రమైన పాత్రలో వండిన ఆహారం అమృతతుల్యమవుతుంది. అశ్రద్ధతో వండిన అన్నం ఆకలిని తీర్చినా… మనస్సుకు శాంతి ఇవ్వదు. 🖤🖤 కర్మ శుద్ధి 🖤🖤 తలపెట్టిన పనిని మధ్యలో వదిలేవాడు అధముడు. పని ప్రారంభించడానికే భయపడేవాడు అధమాధముడు. అయితే— తలపెట్టిన పనిని నిబద్ధతతో, నిజాయితీతో, పూర్తిచేసేవాడే నిజమైన ఉన్నతుడు. 💛💛 మనశ్శుద్ధి 💛💛 మనస్సును ఎల్లప్పుడూ ధర్మం, న్యాయం వైపు మళ్ళించాలి. మనస్సు సహజంగా చంచలమైనది— వక్రమార్గాల వైపు లాక్కెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అదే అన్ని సమస్యలకు మూలం. ఎవరికీ హాని తలపెట్టని మనస్తత్వమే నిజమైన మనఃశుద్ధి. 🙏🙏 భక్తి యొక్క మహిమ 🙏🙏 ఆహారంలో భక్తి ప్రవేశిస్తే — ప్రసాదమౌతుంది ఆకలికి భక్తి తోడైతే — ఉపవాసమౌతుంది నీటిలో భక్తి కలిస్తే — తీర్థమౌతుంది యాత్రకి భక్తి తోడైతే — తీర్థయాత్ర అవుతుంది సంగీతానికి భక్తి జతైతే — కీర్తనమౌతుంది గృహంలో భక్తి ప్రవేశిస్తే — దేవాలయమౌతుంది సహాయంలో భక్తి ఉంటే — సేవ అవుతుంది పనిలో భక్తి ఉంటే — పుణ్యకర్మ అవుతుంది 👉 భక్తి మనిషిలో ప్రవేశిస్తే మనిషి… మనీషి అవుతాడు. #🙆 Feel Good Status #😃మంచి మాటలు #తెలుసుకుందాం
🙆 Feel Good Status - ShareChat