ShareChat
click to see wallet page
search
*🙏\|/ శ్రీకృష్ణుడు భక్త సులభుడు \|/🙏* *🙏\|/🙏కేరళ రాష్ట్రంలోని గురువాయూరు లో శ్రీకృష్ణుని దర్శనం మనకి లభిస్తున్నదంటే దానికి కారణం పరమ భాగవ తోత్తముడైన ఉద్ధవుని వలననే. అది మన పూర్వపుణ్యఫలం.* *🙏\|/🙏శ్రీకృష్ణుడు పూజించిన నారాయణ విగ్రహాన్ని గురుభగవానుని వద్దకు వాయుభగవానుని వద్దకు చేర్చినది ఉద్ధవుడు.* *🙏\|/🙏గురువు, వాయువులు కలసి యీ నారాయణ విగ్రహాన్ని ప్రతిష్టించిన స్థలమైనందునే 'గురువాయూరు' అనే పేరు వచ్చినదని పురాణం వివరించింది.* *🙏\|/🙏శ్రీమద్భాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునికి చేసిన ఉపదేశం 'ఉద్ధవ గీత' అని పిలువబడుతున్నది.* *🙏\|/🙏శ్రీ కృష్ణుని ఆదేశానుసారం ఉద్ధవుడు పండరీపురంలో 'నామదేవుడు' అనే పేరుతో మరోజన్మ ఎత్తి దేశంలో భక్తిని ప్రచారం చేశాడు, అని పురాణ కధ.* *🙏\|/🙏కలియుగంలోని ప్రజలను సన్మార్గంలో పెట్టగలది నామసంకీర్తన అని భావించి నామదేవుడు భగవన్నామ సంకీర్తనల ద్వారా ప్రజలలో భక్తి యొక్క ఆవశ్యకతను ప్రచారం చేశాడు.* *🙏\|/🙏అదే పండరీపురానికి చెందిన మరో మహాభక్తుడు పాండురంగని అనుగ్రహం పొందాడు. ఆ భక్తుడే పుండరీకుడు.* *🙏\|/🙏తల్లి తండ్రులే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ వారి సేవ చేసుకుంటూ జీవించినవాడు పుండరీకుడు.* *🙏\|/🙏పుండరీకుని అచంచల భక్తి లోకానికి తెలియచేయాలని భగవంతుడు సంకల్పించాడు. పండరీపురంలోని తన భక్తుని ఇంటికి వచ్చాడు. తల్లి తండ్రుల సేవలోనున్న పుండరీకుని శోధించదలచాడు.* *🙏\|/🙏ఇంటి బయట నిలబడి పుండరీకుని పిలిచాడు పాండురంగ కృష్ణుడు. కాని పుండరీకుడు వెంటనే బయటకు రాలేదు. "నా తల్లి తండ్రులు నిదురించిన పిదపే నేను బయటకు వస్తాను.” అని అన్నాడు పుండరీకుడు.* *🙏\|/🙏ఆ సమయంలో పుండరీకుని గురువు అతని ఇంటికి వచ్చారు. గుమ్మంలో నిలబడి ఎదురుచూస్తూ నిలబడిన శ్రీకృష్ణుని చూసి విస్మయంచెందారు. భక్తితో కృష్ణునికి వందనమాచరించి కంగారుపడుతూ ఇంట్లోకి వెళ్ళారు గురువు.* *🙏\|/🙏పుండరీకుని తో " పుండరీకా!కృష్ణపరమాత్మ నిన్ను చూడడానికి వస్తే లోపలకు ఆహ్వానించవా?" అని అడిగారు.* *🙏\|/🙏అప్పుడు కూడా కొంచెం కూడా కదలలేదు పుండరీకుడు.* *🙏\|/🙏"నా తల్లి తండ్రులు కూడా నాకు దేవుళ్ళే. వారి సేవానంతరమే ఇతరుల సేవ!" అని చెప్పి గురువుగారిని ఆశ్చర్య పరిచాడు.* *🙏\|/🙏పుండరీకుని పితృభక్తికి శ్రీ కృష్ణుడు ఆనందించి, ‘నన్ను చూడాలనే కోరిక నీకు లేదా? ‘ అని అడిగాడు.* *🙏\|/🙏"ఏదైనా సరే నా తల్లి తండ్రులు నిదురించిన పిదపే వచ్చి మాటాడుతాను." అని చెప్పాడు పుండరీకుడు.* *🙏\|/🙏తల్లితండ్రుల యందు పుండరీకునికి గల గౌరవానికి, భక్తి, మర్యాదలకి కృష్ణుడు ముగ్ధుడైనాడు. తన చేతులను నడుము వద్దపెట్టుకొని పుండరీకుని కోసం చూస్తూ నిలబడ్డాడు. కొంతసేపటికి పుండరీకుని తల్లి తండ్రులు పూర్తిగా నిదురపోయారు.* *🙏\|/🙏ఆ తరువాత పుండరీకుడు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి సకలోపచార మర్యాదలు చేశాడు.* *🙏\|/🙏"స్వామీ..మీరు భీమానది ఒడ్డున ఇదే భంగిమలో కొలువై భక్తులను అనుగ్రహించాలి." ఆని వేడుకున్నాడు.* *🙏\|/🙏శ్రీకృష్ణుడు పుండరీకుని కోరికను నెరవేర్చారు.* *🙏\|/🙏పుండరీకుని కోరిక ప్రకారం పండరీపురంలో భీమానది పశ్చిమ ఒడ్డున శ్రీకృష్ణుడు పాండురంగనిగా, రుక్మిణీసతి రఘుమాయిగా వెలిసి భక్త సులభుడనని లోకానికి చాటిచెప్పాడు.* *🙏\|/🙏జన్మనిచ్చిన తల్లిదండ్రుల అడుగుజాడలలో నడుచుకోవడం, వారికి వయసైన కాలంలో వారిని అతి జాగ్రత్తగా కాపాడుకోవడం భగవంతుని సేవకి సమానం. పుత్రుల వలన ఆ తల్లి తండ్రులు సంతోషిస్తే భగవంతుని ఆశీర్వాదాలు సదా లభిస్తాయి.* 🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯🔯 #పాండురంగ స్వామి.. #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #🙏🏻🌹ఓం నమో నారాయణాయ నమః #ఓం నమో భగవతే వాసుదేవాయ
పాండురంగ స్వామి.. - ShareChat