ShareChat
click to see wallet page
search
మనమందరం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాము అంటే వ్యవసాయం చేసినప్పుడు భూమాత మనలని అనుగ్రహించి పంటని ఇస్తోంది. ఆ పంట మనకి దక్కటానికి అసలు ఆ భూమి దున్నటంలో ఎంతో మనకి సహకరిస్తున్న జంతువు ఎద్దు. అందులో వేదంలో చెప్పబడినట్లుగా ఎద్దు యొక్క డెక్కల నుంచి జాలువారినటువంటి అమృతపుబిందువులు భూమిలో పడినటువంటి కారణం చేత ఆ భూమి నుంచి పైకి పెరిగినటువంటి సశ్యముల నుంచి వచ్చినటువంటి పంట కంటి సంబంధమైనటువంటి రోగములు రాకుండా మనిషిని కాపాడుతుంది. ఇంతగా మనల్ని రక్షించి బండిలో అనేకమైనటువంటి ఫలసాయములని ఇంటికి తీసుకొని రావటమే కాకుండా తన మెడ మీద నాగలిని పెట్టుకొని భూమిని దున్నటానికి మనల్ని అనుగ్రహిస్తోంది ఎద్దు. అందుకే ఆ ఎద్దు పట్ల ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతని ఆవిష్కరిస్తారు. ఆ ఎద్దు పట్ల కృతజ్ఞతని ఆవిష్కరించే పండుగకే కనుమ పండుగ అని పేరు. భోగినాటికి ఇంటికి పంట అంతా వచ్చింది. సంక్రాంతి పండుగ నాడు కొత్త అల్లుళ్లతో కలిసి సంతోషంగా భోజనం చేశాడు. దీనికంతటికీ కారణం అయిన తనతో పాటు శ్రమించిన ప్రాణి ఒకటి ఉంది ఎద్దు. అది ఇంటి పెరటిలోనే ఉంది. మరి ఆ ఎద్దుని కూడా సత్కరించకపోతే మనిషి జీవితానికి పూర్ణత్వం ఎక్కడ ఉంది. ఇది భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పదనం. -- పూజ్య గురుదేవులు, ‘ప్రవచన చక్రవర్తి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వర రావు గారు #🐄కనుమ శుభాకాంక్షలు🌾 #✨సంక్రాంతి స్టేటస్🌾 #🙏🏻భక్తి సమాచారం😲 #🌅శుభోదయం #🔱హిందూ దేవుళ్ళు🙏🏻
🐄కనుమ శుభాకాంక్షలు🌾 - I| '೧೦೦೦೦೦೫} 4963 మీకు మీ కుటుంబసభ్యులకు కనుమ నభక్ెః్ను శునొనయం I| '೧೦೦೦೦೦೫} 4963 మీకు మీ కుటుంబసభ్యులకు కనుమ నభక్ెః్ను శునొనయం - ShareChat