ShareChat
click to see wallet page
search
రైతు అన్నదాత సుఖీభవలా కాకుండా దుఖీభవలా మిగిలిపోతున్న వైనం! లేదా రైతు తన వ్యవసాయ రంగంలో మాత్రం ఎల్లవేళలా ఏటికి ఎదురీదుతూనే వున్నాడు! రైతే రాజు కానీ రైతు అనే వారు ఓ అలుపెరుగని శ్రామిక శక్తి,అనంత కష్టజీవి అనే పదానికి నిదర్శనం! రైతులకు వ్యవసాయరంగం అనేది ఆడింది ఆట పాడింది పాట కాదు వారికి ఆ రంగం అనేది ఒడుదిడుగుల నిత్య సంగ్రామమే! రాత్రనక,పగలనక,ఎండనక,వాననక తన కాయకష్టమే పెట్టుబడిగా తన పొలానికి పెడుతుంటాడు అన్నదాత! నానా యాతన పడి ఎంత పడించిన,ఎంత పరిశ్రమించిన చివరకు తాను పడించిన పంటకు గిట్టుబాటు ధర విషయంలో రైతుకు మిగిలేది ఓ కన్నీటి దారలే!అతివృష్టి,అనావృష్టి వంటి ప్రతికూల పరిస్థితులు రైతుల పాలిట ఓ శాపం వంటిది! ఎన్ని సాధకబాధలు ఎదురయిన వెనుకడుగు వేయకుండా తన కాయకష్టాన్ని నమ్ముకొని నిత్యం తన పొలంలోనే తడిసి ముద్దయిపోయే ధన్యజీవి రైతన్న! యావత్ దేశానికే పట్టేడు అన్నం పెట్టే వాడు రైతన్న, అయితే నిత్యం తన వ్యవసాయ రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఏటికి ఎదురీదుతూనే ఉంటాడు!కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు ఉన్నట్లు దేశంలోని చిన్న, సన్నకారు రైతులు అంతగా రాణించలేకపోవడానికి అనేక కారణాలు వున్నాయి. అందులో ప్రధానమైనవి,వ్యవసాయ కూలీల రోజు వేతనాలు రోజు రోజుకు అంతకంతకు పెరిగిపోవడం,ఎన్నో వ్యయప్రయాసనోలార్చి తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం,పేదరికం మూలాన తమ పొలంపై పెట్టుబడులు పెట్టలేకపోవడం,తాము పంటలకు వేసే మందులు,తమ పొలంలో విత్తనాలు విత్తే సమయంలో వాటి ధరలు విపరీతంగా ఉండటం,విత్తనాలు కొనడానికి పోతే కొరివి అమ్మడానికి పోతే అడవి లేక మూడు గాసులే,అకాల వర్షాలు,అసలే వర్షాలు లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు తమ వ్యవసాయ రంగంలో విజయవంతమైన వ్యక్తులుగా నిలువలేకపోతున్నారు అనే మాట సత్యదూరం కాదు! ఏదిఏమైన మనల్ని పాలించే పాలకులు వ్యవసాయరంగానికి పూర్వపు వైభవం తీసుకువచ్చి రైతుల జీవితాలలో వెలుగులు తీసుకురావాలంటే మాత్రం మరిన్ని సంస్కరణలు వారి రంగంలో తీసుకురావాల్సిన ఆవశ్యకత వారి భుజస్కందాలపై ఎంతైనా వుంది.ఏమైనా వ్యవసాయం అనేది శుద్ధ దండుగ అనే విసుగు తెప్పించే మాట రైతు సోదరుల నోటి వెంట రాకుండా వ్యవసాయం అనేది ఒక గొప్ప పండుగ వంటిది అనే మాట వారి నోళ్లలో నానే రోజులు మన దేశంలో,రాష్ట్రంలో సంప్రాప్తించాలి.వ్యవసాయ రంగంలో మంచి రోజులు రావాలి!మున్ముందు వ్యవసాయరంగం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లే అత్యంత శుభకర,శుభ ప్రదమైన రోజులు రైతులకు సంప్రాప్తించి తీరాలి.రైతు రాజ్యం వర్ధిల్లాలి! అన్నదాత సుఖీభవ!జై కిసాన్!👩‍🌾👩‍🌾👩‍🌾 - బుగ్గన మధుసూదనరెడ్డి,వైస్సార్సీపీ పార్టీ నాయకుడు & సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అన్నదాత💐🎂
అన్నదాత💐🎂 - 6   6  వసాయంఠినివదింలో ~0~0~ ೧೦ a ಅ35೮5೦ನನಾಟರನ 835 ೧೦೦ 06 6p ವಿಎಿಯಂದ್ సెర్చిన ೮ನಂದಾನ3 8೪5ನ ನೂಯಂ ಎನ೧ಡನ್ಿ ఓగోనా గింట ఏసూరిగిరింా ೂ536 ~98@59 143 P ^ocobo "నగుకుందారా Pinterest Whats app Sharing Tel_ Pinterest Pin by sreevenireddy 0.. వ్యవసాయం ೨auroನಗನನಕ ೭೮5೦ వ్రపందానికి సాయం చయదానికి ೨um೦ನ೦ರನು೦೦ ^ ಅ೦nತ ೦೦೦ಮತ೦ ಅ೦೦೦೦ ೭3ನ ೦೦೦೦ Play Google Vyavasayam Telugu Fa వ్యవసాయంలనే పదంఠో Raಊ3 o2c రగ్రి8రరినేమాటరో ge6८० (ನ೦ನ ప్రసంచానికి కర్టంని సాయం చేసిగుగాన్ని /0 49ಯ2 02 6   6  వసాయంఠినివదింలో ~0~0~ ೧೦ a ಅ35೮5೦ನನಾಟರನ 835 ೧೦೦ 06 6p ವಿಎಿಯಂದ್ సెర్చిన ೮ನಂದಾನ3 8೪5ನ ನೂಯಂ ಎನ೧ಡನ್ಿ ఓగోనా గింట ఏసూరిగిరింా ೂ536 ~98@59 143 P ^ocobo "నగుకుందారా Pinterest Whats app Sharing Tel_ Pinterest Pin by sreevenireddy 0.. వ్యవసాయం ೨auroನಗನನಕ ೭೮5೦ వ్రపందానికి సాయం చయదానికి ೨um೦ನ೦ರನು೦೦ ^ ಅ೦nತ ೦೦೦ಮತ೦ ಅ೦೦೦೦ ೭3ನ ೦೦೦೦ Play Google Vyavasayam Telugu Fa వ్యవసాయంలనే పదంఠో Raಊ3 o2c రగ్రి8రరినేమాటరో ge6८० (ನ೦ನ ప్రసంచానికి కర్టంని సాయం చేసిగుగాన్ని /0 49ಯ2 02 - ShareChat