ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #తిరుమల లడ్డు *టీడీపీ మీడియాకు సంచలన సవాల్..⁉️* JANUARY 26, 2026🎯 టీటీడీ లడ్డూ ప్రసాదంపై సిట్ తుది చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో టీడీపీ టీవీ చానెల్స్ డిబేట్లు పెట్టాలని ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇవాళ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పెద్దలు లడ్డూ ప్రసాదంపై చేసిన కామెంట్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఏమీ లేకపోయినా కల్తీ జరిగిందని ఆరోపించారని జడ శ్రవణ్కుమార్ తీవ్రంగా ఆక్షేపించారు. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలా దారుణంగా మాట్లాడారని ఆయన తప్పు పట్టారు. కానీ సిట్ చార్జిషీట్ వచ్చిన తర్వాత ఒక్కరు కూడా మాట్లాడలేదన్నారు. టీవీ5 మూర్తి సిట్ చార్జిషీట్పై అయిపోయిందేదో అయిపోయిందని అంటున్నాడన్నారు. ఎందుకు అయిపోతుందని జడ శ్రవణ్ ప్రశ్నించారు. ఇప్పుడు డిబేట్ పెట్టాల్సిందే, తాను రావాల్సిందే అని జడ శ్రవణ్ అన్నారు. టీవీ5, ఏబీఎన్, మహాటీవీ ప్రతినిధులందరూ డిబేట్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. లడ్డూలో పందికొవ్వు, ఎద్దు కొవ్వు ఎక్కడ కలిశాయో, ఏ వైసీపీ నాయకుడు నిందితుడో ప్రజలకు తెలియాలని జడ శ్రవణ్ కుమార్ అన్నారు. మీరు (ప్రభుత్వం) తప్పు చేసి వుంటే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నేలకు ముక్కురాసి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వేంకటేశ్వరస్వామీ… తప్పెందని, ఇలాంటి రాజకీయ క్రీడ మరొకసారి ఆడమని, తేలుకుట్టిన దొంగల్లా తమ పరిస్థితి తయారైందని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు చెప్పేంత వరకూ వీళ్లు ఆగలేదన్నారు. ముఖ్యమంత్రిని సుప్రీంకోర్టు మందలించిందని ఆయన గుర్తు చేశారు. ఏ ఆధారాలతో కల్తీ జరిగినట్టు ఆరోపించారని సీఎంను సుప్రీంకోర్టు నిలదీసిందన్నారు. విచారణ కోసం సిట్ వేశామని, నివేదిక వచ్చే వరకూ ఆగాలని అన్నంత వరకూ... ఈ దుర్మార్గులు మాట్లాడుతూనే ఉన్నారని జడ శ్రవణ్ తీవ్రంగా తప్పు పట్టారు. నీ వల్ల సనాతన ధర్మం అభాసుపాలు కాలేదా? అని పవన్ను ఆయన ప్రశ్నించారు. పవన్ను సనాతన అధర్మాధికారిగా ఆయన అభివర్ణించారు. డిబేట్లు పెట్టాల్సిందే, రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిందే అని జడ శ్రవణ్ గట్టిగా డిమాండ్ చేశారు. ఏ పార్టీ అధికారంలో ఉండగా కల్తీ జరిగిందో ప్రజలు తెలుసుకోవాల్సిందే అన్నారు. వాస్తవాలేంటో ప్రజలకు తెలియాలన్నారు. టీడీపీ, జనసేనకు తిరుపతి వేంకటేశ్వరస్వామి శాపం తగిలిందన్నారు. ఈ రెండు పార్టీలను చివరి వరకూ స్వామికి చేసిన పాపం వెంటాడుతుందన్నారు. ఏపీలో నిలువ నీడ లేకుండా చేస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలు ఎన్నిచేసినా ప్రజలు క్షమిస్తారన్నారు. కానీ భక్తుల మనోభావాలతో ఆడుకోవడాన్ని ఎప్పటికీ క్షమించరన్నారు. వైసీపీని బద్నాం చేయాలని అనుకుని, మీ గోతిని మీరే తవ్వుకున్నారని ఆయన అన్నారు.
ఏపీ అప్ డేట్స్..📖 - 5$@ రి స్దాపక లధ్య 5$@ రి స్దాపక లధ్య - ShareChat