అలసినవానిని ఊరడించు మాటలు
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
DAILY MEDITATIONS FROM THE MINISTRY OF Bro. BAKTH SINGH
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
🌷🌷🌷 Friday, January 9 🌷🌷🌷
*''ప్రభువా,... మాకును ప్రార్థన చేయ నేర్పుము'' (లూకా 11:1).*
''నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక'' (కీర్తనలు 20:4). ఇది ఎంతో అద్భుతమైన వాగ్ధానము. మన అక్కరలు, సమస్యలు ఏమైనను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు. దేవుడు మనము అడిగిన దాని కంటె అత్యధికముగా ఇవ్వగలడని మనము నమ్మవలెను. అటువంటి విశ్వాసముతో మనము ఆయన యొద్దకు వెళ్ళవలెను. చాలా సంవత్సరముల క్రిందట నాకు ఒక టైపు మిషన్ కావలెనని కోరితిని. నేను క్రొత్తదాని కొరకు ప్రార్థించిన యెడల దేవుడు ఇవ్వడని తలంచితిని గనుక పాత దాని కొరకు ఇట్లు ప్రార్థించితిని, ''ప్రభువా, నాకు ఒక టైపు మిషను కావలెను. నాకు ఒక పాతది ఎక్కడ నుండియైనను పంపిస్తారా?'' నేను పాత దాని కొకు ఎదురుచూచితిని గాని దాదాపు ఒక వారము పిమ్మట ఎవరో ఒకరు సరిక్రొత్త టైపు మిషన్ తీసికొని నా యొద్దకు వచ్చిరి. ఒక క్రొత్తది పొందుట అసాధ్యమని తలంచితిని. ఆ రీతిగా మన మనవుల ద్వారా దేవునికి హద్దు పెట్టుదుము. అయితే మన హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు వాగ్ధానము చేయుచున్నాడు. ''నీ ఆలోచన యావత్తు సఫలపరచును'', అనగా మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్లచేయును. మనము ఆయనకు ఇచ్చునది మరియు అర్పించునది హృదయపూర్వకముగా అర్పించవలెను. నీ ప్రార్థన సమయమును ఏ మాత్రమును తగ్గించకుము.
''యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నియు యెహోవా సఫలపరచునుగాక'' (కీర్తన 20:5). ఈ వచనములో మూడు అద్భుతమైన వాగ్ధానములు కలవు. మొదటిది, మనము ఆయన రక్షణయందు ఉత్సహించుచున్నాము. మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాక పోయినప్పటికిని, ఆయన మనలను రక్షించి, గొప్ప సంతోషమును ఇచ్చుచున్నాడు. రెండవది, యెహోవా నామమున మన ధ్వజములను ఎత్తుచున్నాము. ధ్వజము విజయమును గురించి మాటలాడుచున్నది. మనము జయించిన ప్రతి పాపము మరియు జవాబివ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తము మనము ధ్వజము ఎత్తవలెను. మనము చాలినంతగా ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించనప్పుడు మన ధ్వజములను ఎత్తలేము. మనము ప్రభువునందు, ఆయన విశ్వాస్యత యందు నమ్మకము గలిగియుండవలెను. మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క బల్యర్పణ యందు విశ్వాసముంచుట ద్వారా అత్యధిక విజయశాలురమగుదుము. మన ప్రతి యొక్క శోధనను ఆయన విజయము ద్వారానే జయించుదము. మన ప్రభువు విజయశాలి ఆయెను గనుక విశ్వాసము ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలెను. ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలెను. మూడవదిగా, ''నీ ప్రార్థనలన్నియు సఫలపరచును''. మనము జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచు వచ్చిన యెడల దానికి అంతమే ఉండదు. మన ప్రార్థన ఏమైనప్పటికిని మన విశ్వాము చొప్పున సంపూర్ణముగా దానికి జవాబు పొందుదుము.
''యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును తన పరిశుద్ధాకాశములో నుండి అతని కుత్తరమిచ్చును'' (6వ). ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధముగా ఉంచుకొనవలెను. అప్పుడు ఆయన తన పరిశుద్ధాకాశములో నుండి మన కుత్తరమిచ్చును. అందుచేతనే మనలను పరిశుద్ధముగా ఉంచుకొనుటకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెగక కోరుకొనవలెను. అప్పుడు మనము ధైర్యముగా, స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలము.
''కొందరు రథములను బట్టియు కొందరు గుఱ్ఱములను బట్టియు అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము'' (7వ). కొందరు తమ ధనముపై, స్నేహితులపై ఆధారపడుదురు. ఇవన్నియు మానవ వనరులు, ఏదైతే మనుష్యుల ద్వారా పొందుదుమో అది కేవలము స్వల్పకాలము వరకే. ''వారు క్రుంగి నేల మీద పడియున్నారు. మనము లేచి చక్కగా నిలుచుచున్నాము'' (8వ). సంఘము యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవును
Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status
Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm
Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World
To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com