#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party పాలమూరు మురిపాలు మాయం❗
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయింది. కనీసం ఒక్క సమావేశమైనా పెట్టుకున్నారా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో కీలకమైన పనులన్నీ కేసీఆర్ హయాంలోనే పూర్తిచేశాం. కేవలం 10 శాతం పనులు చేస్తే ప్రాజెక్టు పూర్తయి రిజర్వాయర్లలో నీళ్లు నింపవచ్చు. కోర్టులో కేసులు వేసి పాలమూరు ప్రాజెక్టును అడ్డుకుంటే అన్ని కేసులను అధిగమించి కాలువలకు టెండర్లు పిలిచాం.
కానీ, రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. కనీసం టెండర్లను రద్దు కూడా చేయలేదు. చిత్తశుద్ధి ఉంటే కాలువలను కేవలం ఒక ఏడాదిలో పూర్తిచేయవచ్చు కదా? పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపి దాదాపు అన్ని అనుమతులను సాధించుకున్నాం. కేవలం నీటి కేటాయింపుతో ముడిపడి ఉన్న అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉన్నందున హైడ్రాలజీ అంశంలో అనుమతి రాలేదు. మిగతా అన్ని అనుమతులున్న పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ అంశాన్ని కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఒప్పించాలి. రేవంత్ గురువు చంద్రబాబు తన పరపతి ఉపయోగించి డీపీఆర్‌ను వెనక్కిపంపారు.
రేవంత్ రెడ్డి నల్గొండ మంత్రులకు దాసోహమయ్యాడనటానికి ఇటీవల జరుగుతున్న సంఘటనలే ఉదాహరణ. ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో పాలమూరు రైతాంగానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరు మార్చుకోకుంటే పాలమూరు రైతాంగాన్ని ఏకం చేసి తగిన బుద్ధిచెప్తాం. పాలమూరుకు, తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాం
వ్యాసకర్త: మాజీ మంత్రి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.


