ShareChat
click to see wallet page
search
శనివారం వేంకటేశ్వరుణ్ణి పూజిస్తే శనిదేవుడు మనల్ని పట్టడా............!! శనివారం వచ్చిందంటే చాలు వేంకటేశ్వర స్వామి భక్తులు పూజా పునస్కారాలలో నిమగ్నమై ఉంటారు. తిరుమల తిరుపతి ప్రాంతంలోని కొందరైతే అసలు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోరు. వేంకటేశ్వర స్వామి నచ్చిన, వేంకటేశ్వర మెచ్చిన రోజు కావున, తాము ఆ రోజున ఉపవాసం ఉంటామనేవారు ఎందరో… శనివారానికి అంత ప్రాధాన్యత ఉంది మరి. ఆ శనివారానికి ఎందుకంత ప్రాధాన్యత. వేంకటేశ్వర స్వామికి ఆ వారం ఎందుకు అంతగా నచ్చిందంటే, కొన్ని కారణాలు తెలుస్తున్నాయి. ఓంకారం ప్రభవించిన రోజు శనివారమేనట. శనీశ్వరుడికి, వేంకటేశ్వర స్వామికి మధ్యన జరిగిన ఒప్పందంలో శనివారం నాడు ఎవరైతే శ్రీనివాసుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారిని పీడించనని శనిశ్వరుడు వేంకటేశ్వర స్వామికి వాగ్దానం చేశాడట. వాగ్దానం చేసిన రోజు కూడా శనివారమే. శ్రీ వేంకటేశ్వరుడు శ్రీ మహాలక్ష్మిని తన వక్షస్థలాన నిలిపిన రోజు శనివారం. శ్రీనివాసుని భక్తులు మొట్ట మొదట సారి దర్శించిన రోజు శనివారమేనట. ఆలయ నిర్మాణం చేపట్టమని శ్రీ వేంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తికి చెప్పిన రోజు శనివారమే. శ్రీ శ్రీనివాసుని సుదర్శనం పుట్టినరోజు శనివారమే. శ్రీనివాసుడు ఆలయ ప్రవేశం చేసిన రోజు శనివారం. శ్రీనివాసుడు పద్మావతి దేవిని వివాహ మాడిన రోజు శనివారమే. ఇలా శ్రీనివాసునికి శనివారమంటే అంత ప్రీతిపాత్రమయ్యింది. అదే భక్తులకు కూడా మార్గం అయ్యింది. _________________________________________ HARI BABU.G _________________________________________ #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #గోవిందా గోవిందా #🕉️ ఓం నమో వేంకటేశాయ నమః 🕉️ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🕉️ ఓం నమో నారయణాయ నమః 🕉️🙏 #🙏🌺ఓం నమో భగవతే వాసుదేవాయ నమః🌺🙏
🌅శుభోదయం - 8 శుభ శనివారం ನಿವಾರಿ ವಚಾತಾಂತ ಕನಿವೌರಖು ವೆಳ.. ~ತರಿ గోవింద నామాలతో మొదలయ్యే ದಯಂ.. ಮನಲ್ ಅಂತುಲೆನ ವಅನ್ಯಾನ್ನಿ ಏಶಿಗಿಂದಿ అధ్యాత్శిక భావన వైపు నడిపిస్తూ 0 8 శుభ శనివారం ನಿವಾರಿ ವಚಾತಾಂತ ಕನಿವೌರಖು ವೆಳ.. ~ತರಿ గోవింద నామాలతో మొదలయ్యే ದಯಂ.. ಮನಲ್ ಅಂತುಲೆನ ವಅನ್ಯಾನ್ನಿ ಏಶಿಗಿಂದಿ అధ్యాత్శిక భావన వైపు నడిపిస్తూ 0 - ShareChat