#☸🙏సూర్యనారాయణ స్వామి వేకువ ఝామున నదీ తీరం చేరుకుని శిరస్సు పై లేత చిక్కుడు ఆకులో రేగి పండు ఉంచి అది దేవా నమస్తుభ్యం అంటూ సూర్య నారాయణడుని స్మరిస్తూ స్నానమాచరించి
ఇంటివద్ద పెరట్లో తులసి మొక్క ప్రక్కన ఆవు పేడ పిడకలతో మంట రాజేసి ఆవు పాలతో క్షీరాన్నం వండి
లేత చిక్కుడు ఆకులు, కాయలు, పువ్వులతో , పచ్చని కొబ్బరి ఈనులతో రథం తయారు చేసి.. సూర్య ఆరాధన అనంతం శుచిగా పట్టు వస్త్రాలలో ఆ ప్రసాదం ఆరగిస్తే అదేంటో ఎపుడూ లేని రుచి, మాధుర్యం.. ఆ క్షీరాన్నం!


