ShareChat
click to see wallet page
search
పితృదేవతల కోసం మొక్కలు నాటండి.......!! ఇదేంటి ఇలా అంటున్నాడు అనుకోకండి. మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు. ఎవరైతే మొక్కలు నాటి, వాటిని పెంచి పోషించినవారికి అవి సంతానంతో సమానం. వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు, ఆ ఆకుల మీద నుంచి జాలువారిని ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పడతాయో, ఆ వ్యక్తికి అన్నివేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. మరణానంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతరలోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా, ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది. సనాతనధర్మాన్ని అనుసరించి సుఖదుఃఖలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి, రోజు నీరు పోయిస్తే, ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధికి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్టించలేదు అనుకుంటే, వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పేరిగే కొన్ని మొక్కలు నాటి వాటికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడా పుణ్యం వారిని చేరి, మీరు ఉన్నా లేకున్నా, ఆ చెట్టు ఆకుల మీది నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహరం అందిస్తుంది. మనం వంశం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి కొన్ని మొక్కలు నాటండి. #తెలుసుకుందాం
తెలుసుకుందాం - 0 0 - ShareChat