మనం దేవుడికి నైవేద్యం (#ప్రసాదం) పెడతాం కదా!
అప్పుడు ఒక చిన్న పిల్లాడు ఇలా అడిగాడు:
దేవుడు ఆ ప్రసాదాన్ని తినడని మనకు తెలుసు,
మరి మనం తినడానికే దేవుడి ముందు పెడతామా ?
మనం దేవుడికి ఇస్తాం, మళ్ళీ మనమే తినేస్తాం."
ఈ సందేహం చాలా సహజమైంది.
సరిగ్గా ఇలాంటి ప్రశ్ననే ఒక భక్తుడు కంచి మఠానికి చెందిన మహాపెరియవ గారిని ( నడిచేదేవుడిని) అడిగారు.
అప్పుడు ఆయన నవ్వుతూ ఆ భక్తుడికి ఒక పుస్తకం ఇచ్చి అందులో ఉన్న ఒక శ్లోకాన్ని చదవమని చెప్పారు.
ఆ భక్తుడు ఆ శ్లోకాన్ని కొన్ని సార్లు చదివాడు.
అప్పుడు మహాపెరియవ గారు ఇలా అడిగారు:
"నీకు ఆ శ్లోకం అర్థమైందా? అది ఇప్పుడు నీ మనసులో ఉందా?" అని.
ఆ భక్తుడు గర్వంగా, పుస్తకం వైపు చూడకుండానే ఆ శ్లోకాన్ని చదివి వినిపించాడు.
అప్పుడు మహాపెరియవ గారు ఇలా అన్నారు: "ఆ శ్లోకం ఇప్పుడు నీ మనసులోకి వచ్చేసింది కదా, మరి అది పుస్తకంలో ఉండకూడదు కదా?"
ఆ భక్తుడు ఆశ్చర్యపోయి, "అదెలా కుదురుతుంది? అది పుస్తకంలో అచ్చయ్యి (print) ఉంది కదా. నేను నేర్చుకున్నంత మాత్రాన అది పుస్తకం నుండి వెళ్ళిపోదు కదా" అని అన్నాడు.
అప్పుడు మహాపెరియవ గారు ఇలా వివరించారు:
"సరిగ్గా అలాగే! ఒక శ్లోకాన్ని ఎంతమంది నేర్చుకున్నా అది పుస్తకంలో ఎలా ఉంటుందో, నైవేద్యం కూడా అలాగే. దాని సారాంశం, భావం మరియు పరిమళాన్ని దేవుడు స్వీకరిస్తాడు,
కానీ ఆ పదార్థం మాత్రం అలాగే ఉంటుంది.
దేవుడు దాన్ని స్వీకరించిన తర్వాత, ఆ ఆహారం దైవిక శక్తితో నిండిన ప్రసాదంగా మారుతుంది, దానిని మనం భక్తితో తింటాం."
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
#😃మంచి మాటలు #తెలుసుకుందాం #🗣️జీవిత సత్యం #మన ఆధ్యాత్మికత #📙ఆధ్యాత్మిక మాటలు


