ShareChat
click to see wallet page
search
యుగపురుషుడు,కారణజన్ముడు,విశ్వ విఖ్యాత నట సార్వభౌమ,ఎవర్ గ్రీన్ నటుడు,మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అయిన నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతిని పురస్కరించుకొని ఆ మహానుభావునికి ఆత్మీయ,అభిమాన,గౌరవ పూర్వక శతకోటి ఘన, గొప్ప నివాళులు! ( 18 - 1 - 2026)! అటు తెలుగు సినిమా పరిశ్రమలోను,ఇటు రాజకీయ రంగంలోను ఉన్నత శిఖరాలు అధిరోహించిన మేరుగరణధీరుడు,తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని,కీర్తిని, ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన మహా నాయకుడు,తాను ముఖ్యమంత్రి మంత్రి పదవి చేపట్టిన తరువాత రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదల కడుపు నింపిన మహానుభావుడు,జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ స్థాయికి ఎదిగిన మహోన్నతుడు,గొప్ప కార్యదీక్ష పరుడు, ఎంతో ఘన చరిత్ర వున్న,అతిరథ మహారతులతో,కాకలు తీరిన నాయకులతో కూడిన కాంగ్రెస్ పార్టీనే తనకున్న ఎనలేని ప్రజాకర్షణతో,సమ్మోహన శక్తితో,తెలుగు ప్రజల ఆధరాభిమానలతో మట్టికరిపించి మరీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించి అందరి చేత శెభాష్ అనిపించుకున్న ఓక నిఖార్సైన అచ్చ తెలుగు ముద్దుబిడ్డ,అశేష ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం చేత ఎన్టోడుగా ఇప్పటికి పిలువబడుతున్న కీర్తిశేషులు దివంగత నందమూరి తారకరామారావు గారి 30వ వర్ధంతి నేడు.ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఆ మహా నాయకుడు,కోట్లాదిమంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు,అశేష తెలుగు సినిమా ప్రేక్షకులు పది కాలాల పాటు గుర్తుపెట్టుకోనే తెలుగు సినిమా కళామతల్లి ముద్దుబిడ్డ ఈ దివంగత ఎన్టీఆర్ అనడంలో ఎలాంటి సందేహనికి తావులేదు.ముఖ్యంగా ఆయన 300 పైగా సాంఘిక,జానపద,పౌరాణిక చిత్రాల్లో నటించి కోట్లాది మంది తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికి చెరిగిపోని ముద్ర వేశారు ఈ అల్ టైం గ్రేట్,ఎవర్ గ్రీన్ స్టార్ దివంగత ఎన్టీఆర్ గారు.బొబ్బిలిపులి,సర్ధార్ పాపారాయుడు,కొండవీటి సింహం,జస్టిస్ చౌదరి,నా దేశం,చండశాసనుడు,మేజర్ చంద్రకాంత్ వంటి అనేక సూపర్ డూపర్ హిట్ కొట్టిన సాంఘిక చిత్రాలు మరియు పాతాళ భైరవి,జగదేకవీరుని కథ,మంగమ్మ శపథం,అలీబాబా 40 దొంగలు వంటి అనేక జానపద చిత్రాలలో కూడా నటించడంతో పాటు లవకుశ,నర్తనశాల,శ్రీ కృష్ణార్జున యుద్ధం,దానవీరశురకర్ణ,శ్రీ పోతులూరి వీర బ్రహ్మం గారి చరిత్ర, వీరాభిమన్యు, శ్రీ కృష్ణపాండవీయం,శ్రీ వేంకటేశ్వర మహత్యం వంటి అనేక పౌరాణిక చిత్రాల్లో సైతం తన నటనా కౌసల్యాన్ని ప్రదర్శించి,తన అద్భుతమైన నటనా హవభావాలతో తెలుగు ప్రేక్షక మహాశయులను మైమరిపింప చేయడంలో కృతకృత్యులు కాగలిగాడు ఈ తారకరాముడు అయిన దివంగత ఎన్టీఆర్ గారు.ముఖ్యంగా పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణునిగా, దుర్యోదనుడిగా,అర్జునుడుగా,కర్ణుడిగా తన నటనా విశ్వరూపాన్ని ప్రదర్శించి తెలుగు సినిమా ప్రేక్షక హృదయాల్లో ఓక ఆరాధ్యనటుడుగా కొలువు దీరాడు ఈ దివంగత నందమూరి తారకరామారావు గారు అనే మాట సత్య దూరం కాదు.అంతేగాకుండా 1983 లో రాజకీయరంగ ప్రవేశం చేయడంతో పాటు అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సుడిగాలి పర్యటనలు చేసి తనకున్న అమోఘమైన ప్రజాకర్షణ,చరిష్మా తో కేవలం 9 నెలల్లో తాను స్థాపించిన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఓక అవిశ్రాంత పోరాట యోధుడు,సామాన్యులు సైతం రాజకీయ అధికారాన్ని పొందవచ్చు,పదవులను చేపట్టవచ్చు అని నిరూపించిన ఓక చరితాత్మికుడు,ఓక గొప్ప చరిత్ర సృష్టికర్త మన స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు అనే మాట అక్షర సత్యం. ఏదిఏమైన తెలుగు వారి సత్తా,పౌరుషాన్ని దశ దిశలా,ప్రపంచ వ్యాప్తంగా కూడా చాటిచెప్పిన అచ్చ తెలుగు ముద్దు బిడ్డ,ఓక మహా నటుడు,మంచి పరిపాలన దక్షకుడు,క్రమశిక్షణకు,అంకితభావానికి పెట్టింది పేరు,అన్నింటికి మించి పేదల పాలిటి పెన్నిధి, బడుగు,బలహీనవర్గాల ఆశాజ్యోతి అయిన మన దివంగత నందమూరి తారకరాముని 30వ వర్ధంతిని పురస్కరించుకొని ప్రతి తెలుగు వారు ఆయనకు ఈ ప్రత్యేక సందర్బంగా చాలా గొప్పగా,ఘనంగా నివాళులు అర్పించాల్సిన గురుతర బాధ్యత తెలుగు వారమైన మనందరి భుజస్కంధాలపై ఎంతైనా ఉంది.ఏమైనా తెలుగు వారందరికీ అత్యంత సుపరిచితుడు,అటు సినిమా రంగంలో,ఇటు రాజకీయ రంగంలో ఎవరి అండదండలు లేకుండా స్వయంకృషితో ఎదిగిన దీశాలి,నాయకుడు అనే మాటకు నిజమైన సార్థకత చేకూర్చడమే కాదు కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాలను గెలుచుకొని మరీ వారి మనస్సుల్లో వెలకట్టలేని ముద్ర వేసుకొని,తల ఎత్తుకొని మరీ నింగికి పయనమై వెళ్లిన ఓ కారణజన్ముడు,దివంగత నందమూరి తారకరామారావు గారికి ఈ ప్రత్యేక సందర్బంగా మనమంతా ఒక్కసారి లాల్ సలాం చేద్దాం!అమర్ రహే,అమర్ రహే దివంగత ఎన్టీఆర్! - బుగ్గన మధుసూదనరెడ్డి,సామజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #నందమూరి తారకరామారావు.. సీనియర్ ఎన్టీఆర్💐🎂
నందమూరి తారకరామారావు.. సీనియర్ ఎన్టీఆర్💐🎂 - ShareChat