ShareChat
click to see wallet page
search
#ఏపీ అప్ డేట్స్..📖 #ఏపీ న్యూస్ ఏపీ పాలిటిక్స్ 🎯 *చంద్రబాబుతో ఇదే ప్రాబ్లం.. ఒకేచోట డంపింగ్❗* JANUARY 30, 2026🎯 రాజధాని అమరావతిలో మాత్రమే కాదు.. విస్తరించబోతున్న రాజధాని స్పోర్ట్స్ సిటీ ప్రాంతంలో కూడా అభివృద్ధి పనులకు అడుగులు పడుతున్నాయి. రాజధాని స్పోర్ట్స్ సిటీ పరిధిలోని పిచుకలపాలెంలో న్యాయ అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం 165.33 కోట్ల రూపాయల వ్యయంతో పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ అధికారులు ప్రపంచ స్థాయి శిక్షణ పొందేలా సదుపాయాలు కల్పిస్తారు. ఈ విషయాన్ని సిఈర్డీయే తాజాగా ప్రకటించింది. విస్తరిస్తున్న రాజధానిలో కూడా ఒక నిర్మాణం మొదలు కాబోతున్నదంటే.. లీగల్ అకాడమీ ఏర్పాటుకాబోతున్నదంటే.. సంతోషమే కదా.. మంచి పరిణామమే కదా.. అని అందరికీ అనిపించవచ్చు. నిజమే మంచి అడుగు అనే చెప్పాలి. కానీ ప్రతిదీ అమరావతిలోనే ఎందుకు? చంద్రబాబుతో వచ్చిన అసలు సమస్య ఇదే. ఆయన ఒక నగరం మీద మోజుపడ్డారంటే.. ఇక ఆయన కళ్లకు తతిమ్మా రాష్ట్రం ఏమాత్రం కనిపించదు. తాను చేయదగిన అభివృద్ధి మొత్తం ఆ ఒక్కచోటనే డంప్ చేసేయాలని, కుమ్మరించేయాలని అనుకుంటారు. గతంలో తొలి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండగా.. చేసిన తప్పు కూడా అదే. హైదరాబాదు నగరం రాజధాని కాగా.. ఐటీ పరిశ్రమను సమస్తం అక్కడే వేళ్లూనుకునేలా దుర్మార్గమైన ప్రోత్సాహం అందించారు. ఆ ప్రభావం.. తతిమ్మా రాష్ట్రం మొత్తం అసూయ పడే వాతావరణం వచ్చింది. ఓడిపోయిన తర్వాత.. తాను మారాను.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాని అని చెప్పుకున్న చంద్రబాబు తీరులో ఏమాత్రం మార్పు రాలేదని అనడానికి ఈ లీగల్ అకాడమీ ఒక ఉదాహరణ. ఇప్పుడు అమరావతి రాజధాని గనుక.. సమస్తం రాజధానిలోనే ఉండాలన్నట్టుగా అన్నింటికీ అక్కడే స్థలాలు కేటాయిస్తూ చేస్తున్నారు. అలాగే విశాఖ ఐటీ హబ్ అని చెప్పి.. అన్ని రకాల ఐటీ కంపెనీలను విశాఖకే తరలిస్తున్నారు. మిగిలిన రాష్ట్రం ఈ పరిపాలన గురించి ఏం అనుకోవాలి? కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తాం అనేది కూటమి పార్టీలు కూడా చేసిన వాగ్దానం. ఇప్పటికీ.. అక్కడ హైకోర్టు బెంచ్ వస్తుందనే అంటున్నారు. జగన్ గతంలో కర్నూలును న్యాయ రాజధాని చేస్తూ, చీఫ్ జస్టిస్ తో కూడిన హైకోర్టు బెంచ్ అక్కడకు తెస్తానని అన్నారు. చంద్రబాబు కేవలం బెంచ్ పెడుతున్నారు. కానీ.. రాయలసీమకు మరింత న్యాయం జరిగేలా, కర్నూలుకు మరింత శోభ దక్కేలా.. ఇదే లీగల్ అకాడమీని హైకోర్టు బెంచ్ ఉండే కర్నూలులోనే ఏర్పాటుచేస్తే ఇంకా బాగుంటుంది కదా? అనేది ప్రజల ఆవేదన. అన్ని ప్రాంతాల మీద రాష్ట్ర అధినేతకు అభిమానం ఉండాలి గానీ.. ఒకటి రెండు ఊర్లను మాత్రం డెవలప్ చేసి.. మిగిలిన రాష్ట్రానికి కేవలం పథకాలు విదిలిస్తానంటే తప్పు కదా అని అంటున్నారు.
ఏపీ అప్ డేట్స్..📖 - ShareChat