🌼 1 వ పాశురము : 🌼
#మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱై దరువాన్
పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్.. !
*🌼 భావము : 🌼*
సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా.. మార్గశీర్ష మాసం ఎంతో మంచిది.. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరమును, చంద్రుని వలె ఆహ్లాదకరుడును, సూర్యుని వలె తేజోమయుడును యైన నారాయణునే తప్ప, ఇతరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవి ఇచ్చుటకు సిద్ధపడినాడు...
కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరిక గల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.*
#ధనుర్మాసం #ధనుర్మాసం శుభాకాంక్షలు 🙏 #ధనుర్మాసం శుభాకాంక్షలు #ధనుర్మాసం-గోదాదేవి పాశురాలు #goda devi


