ShareChat
click to see wallet page
search
శ్రీ మహాలక్ష్మీ (అంబాబాయి) దేవాలయం,  భారతదేశం లోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన కొల్హాపూర్ లోని ఒక శక్తి పీఠం. ఇది హిందూ పురాణాల ప్రకారం శక్తి పీఠాలలో ఒకటిగా భాసిల్లుతోంది. అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు. ఏటా కాశీ వెళ్లి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు. అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి, శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని, కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే, అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తానని కోరాడు. కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని, అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట. శివుని ఆనతిమేరకు అగస్త్యుడు కొల్హాపూర్‌లో మహాలక్ష్మిని, అతిబలేశ్వరస్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది. అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది. ఈ నగరాన్ని కోల్‌పూర్ అని కోల్‌గిరి అని, కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు. ‘కొల్లా’ అంటే ‘లోయ’అని, ‘పూర్’ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది. ఆ సమయంలో శివాజీ మహారాజ్ గారి గురువుగారైన సమర్థ రామదాసు గారు మరాఠా సామ్రాజ్య రక్షణ కొరకు ఒక ప్రత్యేకమైన క్రతువు జరిపించి  శ్రీ చక్ర యంత్ర నిర్మితమైన ఎనిమిది మహాలక్ష్మి ముద్ర నాణాలను చత్రపతి శివాజీ మహారాజ్ గారి అష్ట ప్రధానమండలికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నానాన్ని అందించి జాగ్రత్తగా వీటిని కాపాడుకోమని  ఇవి ఎవరి వద్ద ఉంటే వారికి రాజయోగం కలుగుతుంది అని ఒకవేళ వీటిని చేజార్చుకున్నట్టయితే  మరాఠీ సామ్రాజ్యం  మొత్తం భవిష్యత్తులో కష్టాల పాలవుతుంది అని చత్రపతి శివాజీ మహారాజ్ గారికి  మరియు వారి అష్ట ప్రధానమండలికి  హెచ్చరించడం జరిగింది. #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారు🕉️ #🛕కొల్హాపూర్ శ్రీమహాలక్ష్మి అమ్మవారు🕉️
☀️శుభ మధ్యాహ్నం - SHRr[ W +880 HLH Kೊ31 KOLYೊLVR 032 SHRr[ W +880 HLH Kೊ31 KOLYೊLVR 032 - ShareChat