ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🪴పంచాంగం🪴 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 29 - 01 - 2026, వారం ... బృహస్పతివాసరే ( గురువారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి విశేషం_* *భీష్మ ఏకాదశి* _భీష్మ ఏకాదశి నాడు అందరూ చదవ వలసిన కథ_ శ్రీ మన్మహా భారతాన్ని ఎన్ని సార్లు విన్నా, ఎన్ని సార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనీ, వినాలని అనిపిస్తుంది. ఎందుకంటే అదొక ధర్మ, జ్ఞాన భాండాగారం, భారతం అనగానే మొదటగా మనసుకు స్ఫురించేది భీష్మపితామహుడు, విష్ణు సహస్రనామాలు. ఆయన కురువంశ పితామహుడు (తాతగారు), హస్తినాపురం కురువంశ జన్మభూమి, దుష్యంతుని పుత్రుడైన భరతుడు పాలించిన భూమి ఈ భరత భూమి. భరతుని కొడుకు సహోత్రుడు , అతని కొడుకు హస్తి, ఆ హస్తి చేత నిర్మిమైనదే హస్తినాపురం, హస్తి కొడుకు వికుందుడు. వికుందుడి కొడుకు అజమీనుడు, అజమీనుడి కొడుకు సంవర్ణుడికీ సూర్య పుత్రిక తపతికీ పుట్టిన వాడే కురు, అ కురు రాజు పేరే పరంపరగా కురువంశానికి వచ్చింది. కురు రాజు తరువాత ప్రదీపుడు ప్రముఖుడు ( రాజైనా ఋషి వంటి వాడు) రాజ ఋషి. ఒకనాడు ఆయన గంగాతీరంలో తపస్సు చేసుకుంటున్నాడు, మహా తేజశ్శాలి అయిన ఒక స్త్రీ గంగానదిలో నుండి వచ్చి ప్రదీపుని ఒడిలో కూర్చుని ఆయన భుజం మీద చేయి వేసింది. ఆయన హఠాత్తుగా కళ్ళు తెరచి ఆశ్చర్యంలో ఆమెను ఎవరు నీవని అడిగాడు. ఆమె చాలా మురిపెంగా రాజా నేను నీమీద ప్రేమతో నిన్ను కోరి వచ్చాను, నాపేరు గంగ అన్నది... ప్రదీపుడు చిరునవ్వు నవ్వాడు, చూడమ్మ! నీవు నాకుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ పుత్రికాస్థానం, అలా కుడి తొడ మీద కూర్చుని నన్ను కోరడం ధర్మ పద్దతి కాదు కానీ నీ కోరిక ననుసరించి నాకు కోడలివి అవుతావు అప్పుడు నాకు కూతురు సమానమవుతావు అన్నాడు. అప్పుడు గంగ కూడా పకపకా నవ్వి రాజా ఆ మాటనీనోట అనిపించడానికే ముందు చూపు తోనే వచ్చాను అన్నది. కానీ రాజా నాదోక నియమం విను, నన్ను నీ కొడుకు వివాహం చేసుకున్న తరువాత నేను ఏం చేసినా నీవు ఒక్క మాట కూడా మాట్లాడరాదు అన్నది. ప్రదీప మహరాజు సరే అన్నాడు, ఏకపత్నీవ్రతుడైన ప్రదీపునికి మనస్సు అతి ప్రశాంత సమయంలో ఉండగా ఒక పుత్రుడు జన్మించాడు. శిశువుకి అర్థవంతమైన శంతనుడు అని పేరు పెట్టారు, అలా కొంత కాలం గడిచింది ఆ శంతనుడు దేవతలకు కూడా సహాయం చేయగలిగిన అమిత శక్తివంతుడు, కురు పితామహుని పుట్టుకకూ శంతనుని పుట్టుకకూ పూర్వ జన్మ సంబంధాలున్నాయని మనకు మహాభారతం చెబుతోంది. మహాభిషుడు అనే ఒక చక్రవర్తి ఉండేవాడు, మహాశక్తి సంపన్నుడాయన, తపశ్శక్తితో ఇంద్రలోకంలో ఉండగా దేవతలు బ్రహ్మలోకానికి వెళ్తూ ఆయనను కూడా రమ్మన్నారు. అప్పుడే గంగాదేవి కూడా దివ్యకాంత రూపంలో అక్కడికి వచ్చింది. అక్కడ గాలి కొంచెం గట్టిగా వీచి గంగాదేవి దుకూలం పలుచని వస్త్రం కాంచెం తొలగింది. అందరూ తలలు వంచుకున్నారు, కాని మహాభిషుడు తలదించుకోలేదు. అందుకు ఫలితంగా బ్రహ్మదేవుడు మహాభిషుని భూలోకంలో పుట్టి అక్కడే ఉండిపొమ్మని అన్నాడు, ఆ మహాభిషుడే ఈ శంతనుడు. దేవతలలో అష్ట వసువులు ఎనమిది మంది. వారిలో ద్యువు అనే వసువు భార్య వసిష్ఠమహర్షి వద్దవున్న కామధేనువు పాలు కావాలని భర్తను ఎలాగైనా తెచ్చిపెట్టమని కోరింది. భార్య కోరిక తీర్చాలనే ఉత్సాహంతో వసువులందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి కామధేనువును అపహరించాడు ద్యువు. అపహరించడం మానవ నైజం కనుక మీరు మానవ(భూ) లోకంలో పుట్టమనీ శపించాడు మహర్షి. మానవులుగా పుట్టాలంటే తల్లిగర్భంలో యాతన అనుభవంచాలి. ఎప్పుడు మళ్ళీ ఉత్తమ గతి కలుగుతుందో తెలియదు, అందుకని మంచి మాతృమూర్తి కోసం వసువులు వెదికారు, అప్పుడు గంగమ్మ కనిపించింది, అప్పటికీ ఆమె తాను ఏమి చేసినా కాదనకూడదు అనే షరతు మీద శంతనుని పెళ్ళాడింది. వసువులు గంగాదేవిని తల్లీ మమ్ములను నీ గర్భంలో ధరించు మేము భూమి మీద ఎక్కువ కాలం ఉండలేము. మేము పుట్టీ పుట్టగానే మళ్ళీ మా లోకానికి గంగాజ్వలం ద్వారా పంపించు తల్లీ అని వేడుకున్నారు... అప్పుడు గంగమ్మ వసువులారా! మీ కోసం నేను ఎనిమిది సార్లు గర్భం ధరిస్తే నాకు ఒక్క కొడుకు కూడా మిగలడా అన్నది. అప్పుడు ద్యువు నీ కొడుకుగా ఉండిపోతాడు. మేము ఏడుగురం మా తేజస్సులో 8వ భాగం ఈ ద్యువులో ఉంచుతామన్నారు, గంగమ్మ ఒప్పుకున్నది ... పుట్టీపుట్టగానే ఏడుగురు వసువులనూ గంగలో వదిలి వేసింది. ఎనిమిదవ వాడిని వద్దని వారించాడు శంతనుడు. వెంటనే మన నిర్ణయం ప్రకారం నేను నిన్ను విడిచి వెళ్ళిపోతానన్నది. మహారాజా నేను వెళ్తూ నీకొక నిజాన్ని చెప్పి వెళ్తాను, నేను గంగపాలు చేసిన ఏడుగురూ వసువులు. శాపకారణాన భూమి మీద పుట్టారు, వారి తేజస్సును నీ తపఃశ్శక్తి తప్పమరేదీ భరించలేదు, అందుకే మానవకాంతగా నిన్ను పెళ్లాడాను. ఈ ఎనిమిదవ వసువు మన కొడుకు, వీడిని మహనీయుడిగా తీర్చిదిద్ది తిరిగి నీకు అప్పగిస్తానని తీసుకుని వెళ్లిపోయింది, అతని పేరు దేవవ్రతుడు. ఆ పిల్లవాడికి వసిష్ఠుడు, పరశురాముల వద్ద శస్త్రాస్త్ర సమగ్ర విద్యలను, బృహస్పతి, శుక్రాచార్యుల వద్ద సమస్త ధర్మ నీతి శాస్త్రాలను బోధింపచేసి సర్వ విద్యా శ్రేష్ఠుడిగా పెంచింది. ఒకనాడు శంతన మహారాజు గంగా తీరాన విహరిస్తూ ఉండగా తేజశ్శాలి, మహాప్రజ్ఞశాలి, మహాయోధ లక్షణాలు కలిగిన దేవవ్రతుని చూచి ఆశ్చర్యపోయాడు. అప్పుడు గంగాదేవి ప్రత్యక్షమై మహారాజా! మన పుత్రుడు దేవవ్రతుడని అప్పగించి అంతర్ధానం అయింది. ఆజన్మ శుద్ధమైన దైవశక్తి మహర్షులు, దేవగురువుల శస్త్రాస్త్ర సంపదతో ఎదురులేని మహావీరుడైనాడు దేవవ్రతుడు. శంతనుడు కొడుకుకి యౌవరాజ్యాభిషేకం చేశాడు. ఆ రోజులలో రాజులకు ఏకపత్నీ వ్రతం లేదు, శంతనుడు గంగాతీరాన దాశ రాజు పెంపుడు కూతురు సత్యవతిని వివాహామాడాలని భావించాడు, కాని దాశర్యులు అంగీకరించలేదు. రాజా నీకు జ్యేష్ఠుడైన మహావీరుడైన యువకుడు కొడుకు దేవీవ్రతుడున్నాడు. అతనికే నీరాజ్యాధికారం వారసత్వం కూడా ఉత్తమ కులసంజాత అయిన నా పెంపుడు కూతురు సంతానానికే రాజ్యాధికారం అభిస్తేనే నేను అంగీకరాస్తానన్నాడు. అందుకు శంతనుడు ఒప్పుకోలేదు, కాని దేవీవ్రతుడు తాను ఎప్పటికీ బ్రహ్మచారిగానే ఉంటానని వివాహం చేసుకోను కనుక వారసత్వ రాజ్య సింహాసనం కోరే వారుండరనీ, జీవితమంతా కురువంశ రక్షికుడిగా, హస్తినాపుర ప్రతిష్ట ధ్యేయంగా మనుగడ సాగిస్తూ జీవితాంతం ఉండగలననీ సకల దేవతల, పంచభూతాల సాక్షిగా భీషణ ప్రతిజ్ఞ చేశాడు. అప్పటినుండి గాంగేయుడు దేవవ్రతుడు భీష్ముడుగా సార్ధక నామధేయుడైనాడు. తండ్రి శంతన మహారాజు స్వచ్ఛంద మరణాన్ని తానుగా కోరుకుంటేనే మరణం వరంగా ప్రసాదించాడు. ఆ భీష్ముడినే యుగాలు గడిచినా కురుపితామహుడిగా లోకం కీర్తిస్తున్నది. లోకాలకు విష్ణు సహస్రనామాలను, తిరుగులేని రాజనీతి ధర్మాలను, కాల నియమం లేని ధర్మ సూక్ష్మాలను శాశ్వతం చేసిన మహామహితాత్ముడు. తన తప్పిదాలకు తానే అంపశయ్యను శిక్షగా విధించుకున్న జ్ఞాని. అందుకే ఇప్పటికీ ఆమాట తప్పని వ్యక్తిని భీష్మ ప్రతిజ్ఞ చేశాడు అంటాం. ఎవరినైనా స్వార్థమెరుగని మనిషిగా చెప్పాలంటే నిస్వార్ధగుణంలో భీష్మా చార్యుడండీ, కురువంశానికి భీష్మాచార్యుడిలా పాటు బడ్డాడు అంటారు. దేవతలైనా సరే మానవ, పశు, పక్షి, క్రిమి కీటుక రూపాలైనా సరే చేసిన కర్మ కారణంగానే జన్మలు పొందవలసి ఉంటుందనే విషయం గ్రహించమని అటువంటి మహత్ముల జ్ఞాన, శీల సంపదలను ఆదర్శంగా జీవించాలనే విషయం విస్మరించకుండా మన కర్త్యవ్యాలను, జీవితపు విలువలను చక్కదిద్దుకోమని తెలుసుకోమని మహనీయుల చరిత్రలు చెపుతాయి. అటువంటి పుణ్య పురుషలని స్మరించడం, భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పారాయణ చేయడంద్వారా శ్రీకృష్ణ పరమాత్మకు ప్రీతిపాత్రులమవుదాం. *_🪴శుభమస్తు🪴_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - పంచాంగం 29 జనవరి 2026 పంచాంగం విశ్వావసు నామసంవతరం . మాషమాసం . శుక్షపకం . P ನಣ ಬುಲುವ . ದಲಿಂೆಯಡಂ 08 `59 సూర్వోదయం ಡ06 53 29-01-26 0 అసమయం - సా06 06 3ಯ ಬುನ చందోదయం -  మ01 25 అస్తమయం: తె03-13 . తెలుగు వారం -బృహస్పతివాసరే . ೧ೆಯುನ್ ೦೦' ಎ೦೦ ರ5ಣ4ಎನದಂ తీధి:- శుఏకాదశిమ01.55 వరకు . ದ0732 ಏಂ5 మగనిర  చపాచరా ఆపైద్వాదశి . ১০101 ১০৫  36 రోహిణ ఉ07-32 వరకు . నకషతం తదుపరి మగశి తె05-20 వరక ~ 06 31 ~05 {తెలవారితే30) ఆపై ఆరుద  3ಎ<ಎ೦ 012 00 ~05 యోగం:- ఇంద్రరా08-28 వరక 45~0 ಅನನದ)ತ ஒ05-29 565 కరణం - విషీమ04-35 వరకూ (ತಲವಂತ30) తదుపరి బవ 8ె03-17 వరక ೨೦ ೧೧ ದೀಯ೦ @ 03"08 ద్వాదశి ` (తెల్లవారితే 30) ఆపై బాలవ  @ಭಯಯನಂ೦ శుభసమయాలు 4ಭce అబీజితలగ్సం - మ12-07 నుంచిమ 12-52 వరకు  ஒைபை 09-26 ನುಂವಿ೭ 10-54 ಎಂಟ 0 విజయమూహూర్తం:-మ0?-22 నుంచిమ03-07 వరక పదోషకాలం - నా06-06 నుంచిరా07.23 వరక బ్రహ్మముహూర్తం: త05-10 నుంచి తె06 01 వరకు ಅಏುಭನಿಮಯೇಲು ১০২০:- ১১12-40 ১১০১ ১১ 02-08 ১6৫ దుర్ుహూర్తం:- 610-37 నుంచిఉ 11-22 వరక Co Seo 06 53 నుంచఉ08 17 వరకు గుణికసమయం . 09 40 ১০১ ৪11-04 ১০s మ01 53 నుంచిమ0చి 17 వరకు రాహ్ుకాలం . ఈ రోజు వినేషం தவ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజా పఠించవలసిన ముంతం ఓంనమో నారాయణాయ నమ  ರಜಾಏರಿ ಯಾಗಲು ్ ৫ 07-32 ১০s১ ೦ವ ಯೌ೧೦ಿ ప్రపంచ , అంతర్జాతీయ జాతీయ దినోత్సవాలు భాగతవారాపత్రిక పజల్ కార్చేసన్ కార్స్ చిప్ Indlad ఆలోచనాపరుల నాసాస్కారక కోవిషీదినోత్సవం . 0 పంచాంగం 29 జనవరి 2026 పంచాంగం విశ్వావసు నామసంవతరం . మాషమాసం . శుక్షపకం . P ನಣ ಬುಲುವ . ದಲಿಂೆಯಡಂ 08 `59 సూర్వోదయం ಡ06 53 29-01-26 0 అసమయం - సా06 06 3ಯ ಬುನ చందోదయం -  మ01 25 అస్తమయం: తె03-13 . తెలుగు వారం -బృహస్పతివాసరే . ೧ೆಯುನ್ ೦೦' ಎ೦೦ ರ5ಣ4ಎನದಂ తీధి:- శుఏకాదశిమ01.55 వరకు . ದ0732 ಏಂ5 మగనిర  చపాచరా ఆపైద్వాదశి . ১০101 ১০৫  36 రోహిణ ఉ07-32 వరకు . నకషతం తదుపరి మగశి తె05-20 వరక ~ 06 31 ~05 {తెలవారితే30) ఆపై ఆరుద  3ಎ<ಎ೦ 012 00 ~05 యోగం:- ఇంద్రరా08-28 వరక 45~0 ಅನನದ)ತ ஒ05-29 565 కరణం - విషీమ04-35 వరకూ (ತಲವಂತ30) తదుపరి బవ 8ె03-17 వరక ೨೦ ೧೧ ದೀಯ೦ @ 03"08 ద్వాదశి ` (తెల్లవారితే 30) ఆపై బాలవ  @ಭಯಯನಂ೦ శుభసమయాలు 4ಭce అబీజితలగ్సం - మ12-07 నుంచిమ 12-52 వరకు  ஒைபை 09-26 ನುಂವಿ೭ 10-54 ಎಂಟ 0 విజయమూహూర్తం:-మ0?-22 నుంచిమ03-07 వరక పదోషకాలం - నా06-06 నుంచిరా07.23 వరక బ్రహ్మముహూర్తం: త05-10 నుంచి తె06 01 వరకు ಅಏುಭನಿಮಯೇಲು ১০২০:- ১১12-40 ১১০১ ১১ 02-08 ১6৫ దుర్ుహూర్తం:- 610-37 నుంచిఉ 11-22 వరక Co Seo 06 53 నుంచఉ08 17 వరకు గుణికసమయం . 09 40 ১০১ ৪11-04 ১০s మ01 53 నుంచిమ0చి 17 వరకు రాహ్ుకాలం . ఈ రోజు వినేషం தவ ఏకాదశి శుభాకాంక్షలు ఈ రోజా పఠించవలసిన ముంతం ఓంనమో నారాయణాయ నమ  ರಜಾಏರಿ ಯಾಗಲು ్ ৫ 07-32 ১০s১ ೦ವ ಯೌ೧೦ಿ ప్రపంచ , అంతర్జాతీయ జాతీయ దినోత్సవాలు భాగతవారాపత్రిక పజల్ కార్చేసన్ కార్స్ చిప్ Indlad ఆలోచనాపరుల నాసాస్కారక కోవిషీదినోత్సవం . 0 - ShareChat