ShareChat
click to see wallet page
search
విద్యాభ్యాసానికి ప్రారంభం - అక్షరాభ్యాసం ! అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. "అక్షరం " అంటే క్షయము లేనిది, నాశనం లేనిది అని అర్ధం. మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ....అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమేసదా..." అని చదువుల తల్లి అయిన శ్రీ సరస్వతీ దేవిని ప్రార్ధించడం ఆచారం! చదువుల తల్లి...అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణిని, జ్ఞానప్రదాయిని అయిన శ్రీ సరస్వతిజన్మదినo - మాఘ మాసం శుక్ల పక్ష పంచమి. ఈ సంధర్భంగా జరుపుకునే పండుగే - శ్రీ పంచమి . దీనికే వసంత పంచమి అని కుడా పేరు. విద్యలకు అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకములను చేతులందు ధరించి ఉంటుందని శ్రీ సరస్వతీ దేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీ దేవి అహింసా దేవత! చల్లని తల్లి! బ్రహ్మవైవర్త పురాణం లో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీ మహాలక్ష్మి, సరస్వతి, శ్రీ రాధాదేవి...అనే ఐదుగురు ప్రకృతి శక్తులనీ..వీరిలో మూడో శక్తులని, వీరిలో సరస్వతి పరమాత్మనుంచి వచ్చిన ఉద్భవించిన వాణికి, విద్య, ఙ్ఞాన ,బుద్ధులనీ చెప్తోంది. అటువంటి ఙ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, ఙ్ఞానప్రాప్తి కలుగుతుంది అని పురాణ వచనం. శ్రీ సరస్వతీ దేవి జన్మదినమైన శ్రీ పంచమి పండుగకు దక్షిణభారతం లో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. శ్రీ పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చెస్తే అపారమైన ఙ్ఞానం లభిస్తుంది ..నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అనే శాస్త్ర వచనం. ఈ రోజున ఉదయాన్నే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మ వారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న...అలాంటి మొదలైన పదార్ధాలు నివేదన చేసి, ఆ తరువాయి చిన్న పిల్లలకు విద్య ని ఆరంభం చేసినచో ఆ చిన్నారులకు ఆ సరస్వతీ దేవి విద్యను ప్రసాదిస్తుంది. ఈ రోజున, శ్రీ సరస్వతి దేవితో పాటు, వినాయకుడు, శ్రీ మహా విష్ణువు,, పరమ శివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. యా కుందేందు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా!! #వసంత పంచమి శుభాకాంక్షలు #వసంత పంచమి శుభాకాంక్షలు💐 #శ్రీ పంచమి శుభాకాంక్షలు #🙏🏻భక్తి సమాచారం😲 #దేవుళ్ళ స్టేటస్
వసంత పంచమి శుభాకాంక్షలు - Mahesh M M Mahesho సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా వసంత పంచమి "ಶಜSಂ್ವ M Maheslo Mahesh M M Mahesho సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా వసంత పంచమి "ಶಜSಂ್ವ M Maheslo - ShareChat