🌷🌷🌷దైవ మర్మములు - Bro. Bakht Singh🌷🌷🌷
🛐 Daily Devotional 🛐
Theme of the Month: దైవ మర్మములు
Thursday, January 8
*''ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని యెంచబడినందున వారు సంతోషించుచు... వెళ్లిపోయిరి'' (అపొ.కా. 5:41).*
ప్రభువైన యేసుక్రీస్తు నామము కొరకు అవమానము పొందవలసి వచ్చినప్పుడు కృంగిపోయి, నిరుత్సాహపడుటకు బదులుగా మనము ఆనందించవలెను. ఆ విధానములోనే మనము ఆయన మహిమను నూతన విధానములో చూడగలము. ఆ ఆనందములోనే మనము నూతనమైన, అద్భుతమైన బలమును కనుగొనగలము. ఆయన నామము నిమిత్తము అవమానము పొందుటచే ఆయనను సేవించి, ఘనపరచుటకై మనము ఉన్నత పదవికి తేబడి అధిక బాధ్యతను వహించగలము. ''క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మీరు ధన్యులు'' (1పేతురు 4:14).
ఆయన నామము నిమిత్తము నిందను భరించుట అను దైవిక ఆధిక్యత నీకు ఇవ్వబడుటకు నీవు తగిన వ్యక్తివని ఎంచబడినందుకై ఆనందించుము. అదే నిజమైన హెచ్చింపు. నీ ఆధిక్యతను నీవు గ్రహించినప్పుడే నీవు బలమొందుదువు. మనకు బలమైయున్న దేవుని యొక్క ఆనందములోనికి ప్రవేశించుట ఎట్లో మనలో ప్రతి ఒక్కరము నేర్చుకొనెదము గాక!
Download Daily Devotions by Brother Bakht Singh Mobile App, using link: https://rb.gy/iv32b1 #📀యేసయ్య కీర్తనలు🎙 #😇My Status
Download Songs Book Songs of Zion Mobile App, using link: https://rb.gy/ua3tlm
Listen to Songs of Zion by visiting Hebron World Youtube Channel: https://www.youtube.com/@Hebron_World
To Read Books written by Brother Bakht Singh, visit: https://hebronworld.com