ShareChat
click to see wallet page
search
పూజ్య గురుదేవులు, వాచస్పతి బ్రహ్మశ్రీ డా|| చాగంటి కోటేశ్వరరావు గారు అనేక సందర్భములలో ప్రాతఃస్మరణీయులు, ఋషితుల్యులైన శ్రీ వివేకానంద స్వామి గురించీ, వారు చేసిన ఎన్నో ఉపన్యాసములలోని అద్భుతమైన అంశముల గురించీ అనేక ప్రవచనములలో చెప్పియున్నారు. వాటిలోని కొన్ని విశేషములు శ్రీ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా… నీ వలన పది మందికి ప్రయోజనము కలగాలి. అది ఎప్పుడు సాధ్యము అంటే, ఆ లక్ష్యం వైపు కి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలవు. స్వామి వివేకానంద ఒక మాట చెబుతూ ఉండేవారు. తిత్తిభము అని ఒక పిట్ట, అది చాలా చిన్న పిట్ట, లకుముకి పిట్ట లాగ. ఆ తిత్తిభ పిట్ట ఒక మగ పిట్ట తో కలిసి సముద్రపుటొడ్డున కాపురం చేస్తూ ఉండేది. అది సముద్రపు ఒడ్డున ఇసుకలో గుడ్లు పెడుతూ ఉండేది. సముద్రపు తరంగములు వచ్చి ఇసుక లో పెట్టిన గుడ్లు పట్టుకెళిపోతూ ఉండేవి. పోనీ అది మార్చవచ్చు కదా ,అది కూడా పెంకితనంగా అక్కడే గుడ్లు పెట్టేది, సముద్రము పట్టుకెళ్ళి పోయేది. రెండు మూడు మార్లు చూసింది. “ఏమిటి నీ తెంపరితనము? నేను గుడ్లు పెడతాను నువ్వు పట్టుకెళ్ళి పోతావు, ఏమి నా గుడ్ల ని వదిలి పెట్టలేవా? సముద్రము లేకుండా చేస్తాను" అనుకొని, నువ్వూ నేనూ కలిసి సముద్రమును కప్పి పెట్టెద్దాము అని చెప్పి ఆ రెండు పిట్టలు కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడిచేసుకోవడం, కాస్త ఇసుకను తెచ్చి సముద్రములో చల్లుతూ ఉండటం మొదలుపెట్టాయి. మిగిలిన తిత్తిభాలు చూసి "ఏమిటి ఆ పని?" అని అడిగాయి. "అది నా గుడ్లు ఎత్తుకు పోయింది కాబట్టి సముద్రమును కప్పెట్టేస్తాను,సముద్రమును రూపు లేకుండా చేస్తాను" అంది ఆ తిత్తిభ పిట్ట . మిగిలిన పక్షుల ముందు నవ్వాయి కానీ అది పడుతున్న కష్టం, దాని లక్ష్యశుద్ధి చూసి, మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరాయి."అరే మన పక్షిజాతి రా" అని మిగిలిన జాతుల పక్షులు కూడా బయలుదేరాయి. పక్షులన్నీ ఇసుకతో సముద్రాన్ని కప్పెడుతున్నాయి అని గరుత్మంతుడికి తెలిసింది. ఆయన కూడా బయలుదేరి వచ్చాడు. "ఆతతపక్షమారుత రయ ప్రవికంపిత ఘూర్ణితాచల వ్రాత మహార్ణవుండు" అని కదూ నన్నయ్యగారి వర్ణన. ఆయన తన రెక్కలు అల్లారుస్తూ పెద్ద పెద్ద పర్వతాలు తెచ్చి పారెయ్యడం మొదలు పెట్టాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువుకి ఏదో అవసరము వచ్చి "వాహనం ఏది?" అన్నారు. "ఏమో! ఈ మధ్య ఆయన సముద్రం దగ్గరికి వెళ్లి కొండలు అవీ ముద్రంలోపారెస్తున్నాడు" అన్నారు ఆయన పరివారం. శ్రీమహావిష్ణువే బయలుదేరి వచ్చారు. "ఏమి గరుత్మంతుండా, ఏమిటి ఈ పని?ఎందుకు పక్షి జాతి అంతా సముద్రము మీద అలా పడి కప్పెట్టెస్తున్నారు?" అని అన్నారు. "ఈ తిత్తిభము యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు. దానితో కోపము వచ్చి మేమందరము సముద్రాన్ని కప్పెట్టెస్తున్నాము" అన్నాయి. "ఎప్పటికి కప్పెడతారు?" అంటే "ఎప్పటికి కప్పెడతామో కానీ మా ప్రయత్నము మాత్రము ఆపము" అన్నాయి. ఎప్పటికో అప్పటికి సముద్రము కప్పడిపోతుంది. Drops of Water make a Big Ocean అన్నట్లు నీటి బిందువులు కలిస్తే మహాసముద్రము. మేమందరమూ ప్రయత్నాలు చేస్తాము అన్నాయి. శ్రీమహావిష్ణువు ఆశ్చర్యపోయారు. మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది. ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు! అని సముద్రుడిని పిలిచి "ఆ తిత్తిభము యొక్క గ్రుడ్లు ఇచ్చేసెయ్య"మన్నారు. దాని గ్రుడ్లు ఇచ్చేసాడు సముద్రుడు. "ఇక్కడ ఉంచకు, అది సముద్ర లక్షణము.తీసుకెళ్లి చక్కగా వేరే చోట పెట్టుకుని పొదిగి పిల్లలను చేసుకో" అని తిత్తిభానికి చెప్పి, సముద్రుడికీ తిత్తిభానికీ శ్రీ మహావిష్ణువు సంధి చేశారు. పక్షులన్నీ సంతోషముగా వెళ్లిపోయాయి.ఏదైనా సముద్రుడిని పిలిపించి సముద్రంలోకి వెళ్లిపోయిన గుడ్లని తెచ్చుకుందా లేదా! ఒక తిత్తిభము? లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పని చేయాలి. లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలిక. ఇలాంటి ప్రవచనము ఏదైనా విన్నప్పుడు లేదా ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఒక సంకల్పము కలుగుతుంది. ఏమి చేయాలి అన్నదాంట్లోనే స్పష్టత కష్టము. ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయము చేసుకున్నా రేపే నిలబడదు. "రేపు అనుకున్నాను కానీ కుదరలేదు ఎల్లుండి నుంచి చేస్తాను" అనుకోకూడదు ఎట్టిపరిస్థితుల్లోనూ నువ్వు సమయాన్ని కేటాయించాలి అంతే. దానికి తగినట్లుగా సమయపాలన చేయగలగాలి. దాని కోసము ఏమీ ఉద్వేగము పడిపోక్కర్లేదు. దానికి తగినట్లుగా నువ్వు సమయాన్ని విభాగము చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించే ప్రయత్నముతో సమున్నతమైన స్థానానికి ఎదగగలగాలి అంతే. అది తిత్తిభ పక్షి నేర్పింది. #స్వామి వివేకానంద జయంతి #స్వామి వివేకానంద #👋విషెస్ స్టేటస్ #శుభాకాంక్షలు #🙏🏻భక్తి సమాచారం😲
స్వామి వివేకానంద జయంతి - దినోత్సవం ఊతీయ యువజన అసత్యం కంటే ೯ಣೆರಲ್ಲು సత్యం శక్తివంతమైంది మంచితనమూ అంతే ನ್ಷಾಖಿ ನಿನಕಾನಂದ ಜಯೆಂತಿ జనవరి 12 దినోత్సవం ఊతీయ యువజన అసత్యం కంటే ೯ಣೆರಲ್ಲು సత్యం శక్తివంతమైంది మంచితనమూ అంతే ನ್ಷಾಖಿ ನಿನಕಾನಂದ ಜಯೆಂತಿ జనవరి 12 - ShareChat