ShareChat
click to see wallet page
search
మాతంగ కన్యని ప్రార్ధించడం వలన సాహిత్యం , చదువు , తెలివి, జ్ఞానం ప్రాప్తిస్తాయి. మాతంగ మాత వీణాపాణి, శ్యామలా రూపంగా, సరస్వతీ స్వరూపమై అనుగ్రహించే ఈ దేవి బ్రహ్మగారి పక్కనుండే ఆయన అర్థాంగి కాదు . ఈ మాతంగ కన్య అమ్మవారి శక్తి . దశమహావిద్యల్లో ఒక స్వరూపం . మాతంగియే రాజ శ్యామల, లలితా పరాభట్టారికా స్వరూపం కొలువు తీరినప్పుడు మహా మంత్రిగా కుడిపక్కన ఉండే తల్లి ఈ శ్యామల. శాక్తేయంలో బుద్ధికి, విద్యకి ఆమెను సేవిస్తారు. ఆమెను సేవించడం ద్వారా అనితర సాధ్యమైన సాహిత్యము, తెలివి, జ్ఞాన సముపార్జన సిద్ధిస్తాయి. తంత్రసారం మాతంగి మాతని నీలిరంగులో (శ్యామల వర్ణంలో ) ఉన్నట్టుగా వివరిస్తుంది . శ్యామల వర్ణం అనేది పూర్ణమైన జ్ఞానానికి ప్రతీక . శివశక్తి - జ్ఞానాంబిక గ , విష్ణుస్వరూపము - రాముడు, కృష్ణుడు ,వేంకటేశ్వరుడు ఇలా ఆ విష్ణు స్వరూపాలన్నీ కూడా ఇదే వర్ణం లో ఉండడము ఇక్కడ గమనించదగిన విషయము. ఇంకా ఆమె చంద్రవంకని శిరస్సున ధరించి , త్రినేత్రాలతో, చక్కని వెన్నెల వంటి నవ్వుతో విరాజిల్లే తల్లి ఈ మాతంగ మాత . 64 కళలకూ అధినేత్రి ఆమె . శారదాతిలకం అమ్మ రాజమాతంగి కూడా సరస్వతీ దేవిలాగానే వీణని చేతిలో ధరించి ఉంటుంది . కానీ ఈమెని మాతంగ శివుని భార్యగా కాళిదాసుని శ్యామలదండకం వర్ణిస్తుంది . మాణిక్యవీణాం. ముఫలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్ మాహేంద్రనీలద్యుతి కోమలాంగీమ్ మాతంగకన్యామ్ మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే. కుచోన్నతే కుంకుమరాగశోణే. పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే... నమస్తే... నమస్తే... జగదేకమాతః ఈ అమ్మని కన్నులారా దర్శించుకొని, ఆ దేవీ స్వరూపాన్ని మనసు నిండా నిలుపుకొని , ఈ శ్యామలా దండకాన్ని రోజూ చదువుకుంటే, ఆ అమ్మ అనుగ్రహం సంప్రాప్తిస్తుంది . పిల్లలకి ఈ దండకాన్ని నేర్పించి రోజూ చదువుకునేలా చేస్తే, వారు అమ్మ అనుగ్రహంతో మంచి విజ్ఞానవంతులవుతారు . కాళిదాసు కూడా అలా విజ్ఞానవంతులైనవారే కదా ! ఈ దేవి మాతంగ మాతగా ఆవిర్భవించడం వెనుక ఒక కథ ఉంది . మహా తపస్సంపన్నుడు , విజ్ఞానఘని అయిన మతంగ మహర్షి కుమార్తెగా ఆ గౌరమ్మ ఆవిర్భవించింది. అందువలన ఆమె మాతంగ కన్యగా , మాతంగ మాతగా పేరొందింది . #తెలుసుకుందాం #🕉Sri Mathre Namaha 🕉 #om sri mathre namaha🙏🙏 #🕉 Sri Mathre Namaha 🕉
తెలుసుకుందాం - ShareChat