ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 ☘️పంచాంగం☘️ శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 26 - 01 - 2026, వారం ... ఇందువాసరే ( సోమవారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, తిథి : *అష్టమి* రా7.06 వరకు, నక్షత్రం : *అశ్విని* ఉ10.58 వరకు, యోగం : *సాధ్యం* సా8.06 వరకు, తదుపరి *శుభం* తె5.05 వరకు, కరణం : *భద్ర* ఉ8.09 వరకు తదుపరి *బవ* రా7.06 వరకు, ఆ తదుపరి *బాలువ* తె6.00 వరకు, వర్జ్యం : *ఉ7.11 - 8.42* మరల *రా7.58 - 9.28* దుర్ముహూర్తము : *మ12.35 - 1.20* మరల *మ2.49 - 3.39* అమృతకాలం : *తె4.58 - 6.28* మరల *తె4.09 - 5.40* రాహుకాలం : *ఉ7.30 - 9.00* యమగండం : *మ10.30 - 12.00* సూర్యరాశి : *మకరం* చంద్రరాశి : *మేషం* సూర్యోదయం : 6.38, సూర్యాస్తమయం : 5.48, *_నేటి విశేషం_* *రిపబ్లిక్ డే / గణతంత్ర దినోత్సవo* *భీష్మాష్టమి / భీష్మతర్పణ విధి* ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి ఇవ్వవలసి వుంటుంది. భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా జీవించి కడపట మహావిష్ణు సన్నిధిలో అతనిని కన్నుల పండువుగా కాంక్షించుచు ముక్తిని పొందిన గొప్ప జీవి. ఈ ప్రక్రియను అందరు భీష్మ తర్పణం అని అందురు... ఇక్కడ అందరికి ఒక సంశయం వచ్చును, తర్పణాదులు తండ్రి బతికి వున్నవాళ్ళు ఇవ్వవచ్చునా? అని ... !! కానీ ధర్మ శాస్త్రం చెప్పింది - భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి వున్నవాళ్ళు కూడా చేయవలసిందే, అది ప్రతి ఒక్కరి కర్తవ్యం. రథ సప్తమి నాడు స్నానం ఆచరించడం వల్ల మనకు ఏడేడు జన్మలలో చేసిన పాపములు త్యజింపబడుతుంది. ఆ శుద్ధమైన ఆత్మతో మనము భీష్మ పితామహునికి అర్ఘ్యం ఇవ్వవలసి వుంటుంది. *భీష్మతర్పణ విధి* భీష్ముడు ఆజన్మాంతం నైష్టిక బ్రహ్మచారిగా సత్యధర్మములకు కట్టుబడి జీవించి చివర శ్రీకృష్ణుని సన్నిధిలో ముక్తినిబడసినవాడు, మూడు దోసిళ్ళ అర్ఘ్యం భీష్మ ప్రీతికి కింద ఇచ్చిన శ్లోకములను చెప్పి ఇవ్వవలసి వుంటుంది. అలాగే తర్పయామి అని చెప్పినచోట్ల నీటితో భీష్మునికి తర్పణలు కూడా వదలవలసి ఉంటుంది. పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కద్దు, కానీ స్మృతికారులు ఒక్క భీష్ముని విషయంలో మాత్రం తర్పణ తండ్రి జీవించి ఉన్నవారుకూడా తర్పణలు చేయవలెనని నిర్దేశించారు. నరకచతుర్దశి, దీపావళి సమయంలో యమ తర్పణం ఎలాఐగే తండ్రి జీవించి వున్నవాళ్ళు కూడా చేస్తారో. అదే విధిన భీష్మ తర్పణం కూడా నిర్వహించాలి, ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం అని శాస్త్రం చెబుతోంది... శుక్లాష్టమ్యాం తు మాఘస్య దద్యాత్ భీష్మాయ యో జలమ్ ! సంవత్సరకృతం పాపం తత్‌క్షణా దేవనశ్యతి !! అని వ్యాసోక్తి నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!" *🌻తర్పణము🌻* 1. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! గంగాపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 2. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! భీష్మవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 3. వైయాఘ్రపాదగోత్రం ! సాంకృతి ప్రవరం ! అపుత్రపుత్రవర్మాణం తర్పయామి !! (3 సార్లు) 1. భీష్మః శాన్తనవో వీరః: సత్యవాది జితేంద్రియః! ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాo క్రియామ్!! (దోసిలితో నీరు విడువవలెను) 2. వైయాఘ్ర పద గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ! అపుత్రాయ దదామ్యేతత్ ఉదక భీష్మ వర్మణే!! (దోసిలితో నీరు విడువవలెను) 3. వసూనామవతారాయ శంతనోరాత్మజాయచ! అర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల బ్రహ్మచారిణే!! (దోసిలితో నీరు విడువవలెను) *పునరాచమ్య ! సవ్యేన అర్ఘ్యం దద్యాత్ !!* (తిరిగి ఆచమించి తూర్పుముఖంగా సవ్యముతో దేవతీర్థంగా అర్ఘ్యమీయాలి) *1. వసూనామవతారాయ అర్ఘ్యం దదామి* !! (దోసిలితో నీరు విడువవలెను) *2. శంతనోరాత్మజాయ అర్ఘ్యం దదామి* !! (దోసిలితో నీరు విడువవలెను) 3. *భీష్మాయ అర్ఘ్యం దదామి* !!(దోసిలితో నీరు విడువవలెను) *4. ఆబాల్య బ్రహ్మచారిణే అర్ఘ్యం దదామి* !! (దోసిలితో నీరు విడువవలెను) *అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతాం – ఓం తత్ సత్!!* 🍃🌹ఏకారణంచేతనైనా పై విధానంలో తర్పణలీయడం కుదరకపోతే, కనీసం ఈ క్రింది శ్లోకమ్ చెప్పి మూడు సార్లు దోసిలితో నీటిని వదలవలెను 🍃🌹నిత్యకర్మ, పూజాదికాల అనంతరము, ఆచమనము తదుపరి ప్రాణాయామము చేసి ఈ విధిగా సంకల్పం చెప్పవలె " *పూర్వోక్త ఏవంగుణ విషేషణ విషిష్ఠయాం శుభతిధౌ శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మాఘ శుక్లాష్టమ్యాం భీష్మ తర్పణార్ఘ్హ్యం కరిష్యే!"* *వైయాఘ్ర పద్య గోత్రాయ సాంకృత్య ప్రవరాయచ !* *గంగా పుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే!* *అపుత్రాయ దదామ్యేతత్ ఉదకం భీష్మ వర్మణే!* *అనేన భీష్మ అర్ఘ్యప్రదానేన సర్వాత్మకో భగవాన్ శ్రీ హరి జనార్దనః ప్రీయతా* *_☘️శుభమస్తు☘️_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - శుభోదయం శుభ సోమవారం 26/01/2026 గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు శుభోదయం శుభ సోమవారం 26/01/2026 గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు - ShareChat