ShareChat
click to see wallet page
search
తను ఎదురుపడితే పలకరించా మేము చెప్పినట్టు నడుచుకో కన్నవాళ్లకు తెలియదా పిల్లలకు ఏది మంచి ఏది చెడు అని నీకేమీ తెలియదు అని శాశించడంతో తలవంచుకున్నాను వ్యాపారం గురించి నీకేం తెలుసు నష్టలాభాలు మాకు తెలుసు నీ జోక్యం ఇక్కడేంటి వంటిట్లో వంటలు రుచిగా వండితే చాలని ఓ అధికారం వినబడింది అమ్మా ఆపేయావమ్మా సలహాలు మాకు తెలుసు నేటి ప్రపంచంలో ఎలా పోటీ పడాలో పెరిగిన విజ్ఞానం నీకేం తెలుసని హేళన మాటలకు చిరునవ్వును విసిరి వచ్చేసాను కాళ్ళు ఏటో లాగుతుంటే కళ్ళు కన్నీళ్లు ఆపుకుంటుంటే అప్పుడు తను ఎదురుపడితే పలకరించా బాధను మనసులోనే దాచేసి మాటను మాత్రం పంచుకున్నా ఏం చేయాలో చెప్పవా అని ఓ సలహా అడిగింది ఎలా గెలవాలో గెలుపు సూత్రం ఒకటి చెప్పమన్నది ఏం చేస్తున్నావు అని ఓ ప్రశ్న అడిగింది ఆ క్షణం నేను ఎక్కడ ఆగిపోయానో గుర్తువచ్చింది నేను ఏమీ చేయాలో తెలిసొచ్చింది నీకేం తెలియదు అనేవాళ్ళు నువ్వు లేకపోతే మాకు ఏమీ తెలియలేదు అనేలా ఎధిగిచూపాను #🙆 Feel Good Status #💪Never Give Up #😎ఆటిట్యూడ్ స్టేటస్ #సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడూ కోల్పోవద్దు #self respect
🙆 Feel Good Status - ShareChat