#🆕Current అప్‌డేట్స్📢 #📰జాతీయం/అంతర్జాతీయం #🗞ప్రభుత్వ సమాచారం📻 #📰ఈరోజు అప్‌డేట్స్
అల్లవరం పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేసిన
అమలాపురం డి ఎస్ పి టి.ఎస్ ఆర్ కే ప్రసాద్
అల్లవరం పోలీస్ స్టేషన్ రికార్డులను వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం అమలాపురం డి ఎస్ పి టి.ఎస్.ఆర్ కె ప్రసాద్ రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.వాహనాలు నడిపే వారు హెల్మెట్ ఉపయోగించేలా వాహన దారులకు అవగాహన కల్పించాలని,ఆటో డ్రైవర్లు అధిక సంఖ్యలో పాసింజర్లను ఎక్కించకుండా,వాహన ప్రమాదాలు జరగకుండా చర్యలు తెలుసుకోవాలని,గంజాయి,సైబర్ నేరాలు,డ్రగ్స్ వంటి వాటిపై ఉక్కుపదం మోపాలని ఎస్ ఐ డి.సంపత్ కుమార్ కు పలు సూచనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్,పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


