ShareChat
click to see wallet page
search
*_మహాభారతంలో మొత్తం మీద అత్యంత అదృష్టవంతుడు #ధృతరాష్ట్రుడు.._* *పుట్టిన దగ్గర నుండి రాజభోగాలు అనుభవించాడు*. *రాజుగా అర్హత లేకపోయినా తమ్ముడైన పాండురాజు వల్ల రాజపీఠం దక్కింది*. *పాండురాజు ప్రపంచాన్ని జయించి సంపదలు తెస్తే వాటిని అనుభవించాడు*. *గాంధారి ద్వారా నూట ఒక్కమంది సంతానాన్ని పొందాడు.* *దాసి ద్వారా సంతానాన్ని పొందాడు. మొత్తం 100మంది భార్యలు*.. *"గుఱ్ఱం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదు " ఇందుకే వచ్చింది ఈ సామెత..* *పాండురాజు అనంతరం పాండవులు రాజ్యాలు గెలిచి సంపదలు తెచ్చిచ్చారు*.. *ధర్మరాజు ధృతరాష్ట్రుడి మాట శాసనంగా భావించేవాడు*. *కొడుకు పాండవుల మీద ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా మందలించేవాడు కాదు. పైగా రాజ్యకాంక్ష బాగా ఉంది. తదనంతరం అంతా కొడుక్కి ఇవ్వాలని తీవ్రమైన కోరిక వల్ల* *దుర్యోధనుడు ఏమి చేసినా ఏమి అనేవాడు కాదు*. *భాగం పంచాల్సిన సమయంలో కొడుక్కి రాజ్యం ఇచ్చి,* *ఎందుకు పనికిరాని బీడు భూమిని, అరణ్యాన్ని భాగంగా ధర్మరాజుకి ఇచ్చాడు.* *పెదనాన్న ఇచ్చాడు కనుక కిమ్మనకుండా సరేనన్నాడు ధర్మరాజు.. తనభాగం తీసుకొని ఆ ప్రదేశానికి వెళుతుండగా అప్పటికే పాండవులు మహాత్ములుగా జనంలో పేరు రావడంతో సగంమంది పైగా ఆ రాజ్య జనం పాండవుల వెంట వచ్చేశారు. ఆ బీడు భూమిని శ్రీకృష్ణుడి సాయంతో మయుడి ద్వారా 8నెలల కాలంలో ఈ భూమిమీద ఎవరు నిర్మించలేని అద్భుత నిర్మాణం నిర్మింపజేశాడు. అందులో మయసభ ఒకటి..* *యుధిష్ఠిరుడు తన తమ్ముళ్ళ ప్రతాపం ద్వారా ప్రపంచాన్ని గెలిచి, లెక్కలేనంత సంపదలు పొంది, రాజసూయయాగం చేశాడు. ఆ సంపదలు, వచ్చిన బహుమతులు లెక్కపెట్టడానికి దుర్యోధనుడికి చేతులు పడిపోయాయి*. *నీరసం కమ్మేసింది. ఇంత సంపదలు ఈర్ష్యద్వేషాలు ఉన్నవారికి నిద్రపట్టనిస్తాయా?* *కుట్రపన్ని జూదం ద్వారా మొత్తం లాగేసారు. ద్రౌపతి ఏకవస్త్రగా ఉన్నా కూడా పట్టించుకోకుండా చీరలు ఊడదీయడానికి వెనుకాడలేదు. ఇన్ని జరుగుతున్నా నోరుమెదపలేదు దృతరాష్ట్రుడు.* *భీమసేనుడి శపథం విన్నాక భయపడి ద్రౌపతి వంకతో రాజ్యం ఇచ్చినట్లు ఇచ్చి పునః జూదం ఆడించి మళ్ళీ లాగేశారు. అన్ని భోగాలు పోయి చివరికి అడవులపాలయ్యారు. అయినా దృతరాష్ట్రుడు దుర్యోధనాదులకు శాంతి లేదు. ఆజ్యం పోయడానికి కర్ణుడు, శకుని ఉండనే ఉన్నారు. అడవుల్లో వాళ్ళ మానాన వాళ్లంటే వెళ్ళి రెచ్చగొట్టబోయారు. గంధర్వులు వచ్చి కర్ణుడిని సైన్యాన్ని చితక్కొట్టి దుర్యోధనుడిని జుట్టుపట్టి కట్టి బంధించి తీసుకుపోతుంటే, దుర్యోధనుడి భార్యల ద్వారా విషయం తెలిసిన ధర్మరాజు భీముడిని అర్జునుడిని పంపించి విడిపించి "అన్నిసార్లు తెగింపు మంచిది కాదు" ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళు అంటే దుర్యోధనుడికిచచ్చినంత పనైంది..* *ప్రాయోపవేశం చేయబోతే పాతాళ లోక వాసులు వచ్చి దుర్యోధనుడి జీవుడిని తీసుకెళ్లి "నాయనా! మేమంతా ఎంతో తపస్సు చేసి నిన్ను కనుగొన్నాం. శ్రీకృష్ణుడి చేతిలో నరకాసురుడు మరణిస్తే ఆయన ఆత్మని నీలో అవహింపజేశాము. భూలోకాన్ని అల్లకల్లోలం చేయడానికి నిన్నే నమ్ముకుని ఉంటే నువ్వు ప్రాయోపవేశానికి పూనుకుంటే మేమంతా ఏమైపోవాలి. ఆనాడు మాయాజూదంలో దైవశక్తులైన వారు భీష్మద్రోణాదులను దుష్టశక్తులమైన మేము అవహించి ఉండటం వలన వారు నీకు ఎదురు చెప్పలేకపోయారు. వారు నీతో కలిసే యుద్ధం చేసేలా రంగాన్ని సిద్ధం చేశాం. కాబట్టి దిగులు చెందకుండా రాజ్యానికి తిరిగి వెళ్ళు. అంటే తిరిగి వచ్చాడు.* *వచ్చిన దగ్గర నుండి అనేక విధాలుగా పాండవుల్ని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అయినా నియమానికి కట్టిబడి ఉన్నారు తప్ప అతిక్రమించలేదు.* *ఉత్తర గ్రహణం లో అర్జునుడు కర్ణుడిని వెంటపడి మరీ కొట్టాడు.. కర్ణుడి తమ్ముడి తల నరికేశాడు. భీష్మాదులను ఓడించాడు. దుర్యోధనుడిని చితక్కొట్టాడు.. అనవసరంగా వెళ్ళి తన్నించుకొని వచ్చాడు*.. *(రాయబార ఘట్టాల్లో సంజయ్ రాజభారం ఒక అద్భుతమని చెప్పాలి.)* *రాయబారిగా వచ్చిన శ్రీకృష్ణుడిని బంధిస్తున్నారని తెలిసి ఊరుకున్నాడు*. *కృష్ణుడు విశ్వరూపం చూపిస్తే దృతరాష్ట్రుడు కోరిక మేరకు కళ్ళు ఇచ్చి తన దివ్యమంగళ స్వరూపాన్ని చూపించాడు. ఎంత దుర్మార్గుడైన శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనం చేసుకోగలిగిన అదృష్టవంతుడు. అయినా దృతరాష్ట్రుడు యుద్ధాన్ని నివారించలేదు.* *సరికదా సంజయుడి ద్వారా భగవద్గీత విని కూడా నాకొడుకులు గెలిచారా అని అడిగిన మహాపాపి*. *యుద్ధంలో పుత్రలందరూ చనిపోయినా పాండవుల వల్ల రాజ్యభోగాలు తక్కువ కాలేదు*. *చివరికి వృద్దాప్యంలో కుంతి గాంధారి తో కలిసి తపోవనానికి వెళ్ళి తీవ్ర తపస్సు చేశారు. వ్యాసుడి దయతో మానవ శరీరాలు ధరించిన చనిపోయిన 100మంది కొడుకుల్ని తిరిగి ఒకరోజంతా గడిపాడు...* *చూశారా ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా చివరి వరకు కాలు కదపకుండా రాజ్యం వదలకుండా యుద్ధం చేయకుండా భోగాలు అనుభవించిన ఘనత ధృతరాష్ట్రుడికి దక్కింది...* *మహాభారతంలో అత్యంత అదృష్టవంతుడు ఈయన ఒక్కడే*.. *కాదంటారా! సంజయ రాయభారం లో చూడాలి ధృతరాష్ట్రుడి విశ్వరూపం. ఆయన మాటలు వింటే ఎంత నీచుడో అర్థమవుతుంది*. *కాకపోతే ప్రస్తుత లోకంలో దృతరాష్ట్ర దుర్యోధనుడు వంటి వారే ఎక్కువ ఉన్నారు. వారు సంపాదించని సొమ్ముకోసం ఆరాటపడేవారు ఈరోజుల్లో కోకొల్లలు..* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat