Ravi  Talluri
ShareChat
click to see wallet page
@91775
91775
Ravi Talluri
@91775
feelgood
*_చీనాబ్ బ్రిడ్జ్ గురించి చెప్పాలంటే నిజంగా గర్వపడే ప్రాజెక్ట్ ఇది_* *_చెనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge)_* *ప్రాంతం: జమ్మూ & కాశ్మీర్‌లోని రేయాసి జిల్లాలో చెనాబ్ నదిపై నిర్మించారు.* *ప్రాజెక్ట్: భారతదేశ రైల్వేలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉధంపూర్-శ్రీనగర్-బరాముల్లా రైల్వే లైన్ (USBRL) లో భాగం*. *ఎత్తు: ఈ బ్రిడ్జ్ 359 మీటర్లు (1,178 అడుగులు) ఎత్తులో ఉంది – అంటే ఎఫిల్ టవర్ కన్నా కూడా ఎత్తు!* *పొడవు: మొత్తం పొడవు సుమారు 1315 మీటర్లు*. *విశేషం: ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన.* *రూపకల్పన: ఆర్చ్ బ్రిడ్జ్ (Arch Bridge) రూపంలో ఉంది*. *ఉపయోగం: కాశ్మీర్ లోయను దేశంలోని మిగతా ప్రాంతాలతో కనెక్ట్ చేసే రైల్వే మార్గంలో కీలక భాగం.* *_నిర్మాణం:_* *నిర్మాణం 2004లో ప్రారంభమై, చాలా కఠినమైన పరిస్థితుల్లో (భూకంపాలు, గాలులు, వాతావరణం) నిర్మించారు*. *జర్మనీ, ఫ్రాన్స్ సహా అనేక దేశాల టెక్నాలజీ ఉపయోగించారు*. *ప్రత్యేకమైన స్టీల్ & కాంక్రీట్ మిశ్రమం ఉపయోగించారు.* *_ప్రాముఖ్యత:_* *కాశ్మీర్‌లో రవాణా సౌకర్యాలను విప్లవాత్మకంగా మార్చబోతుంది.* *పర్యాటకానికి, ఆర్థికాభివృద్ధికి బలమైన మద్దతు*. *ఒక మాటలో చెప్పాలంటే, చీనాబ్ బ్రిడ్జ్ మన దేశానికి గర్వకారణం* *ఇది ప్రపంచానికి భారతీయ ఇంజనీరింగ్ శక్తిని చూపించింది* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - చెనాబ్ ఎత్తులను దాటిన భారతదేశం ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన 2 చెనాబ్ను మొదటిరైలు దాటింది: చెనాబ్ ఎత్తులను దాటిన భారతదేశం ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన 2 చెనాబ్ను మొదటిరైలు దాటింది: - ShareChat
*_06/10/2025 - ఆశ్వయుజ పౌర్ణిమ - శరద్ పౌర్ణిమ - కోజాగరి పౌర్ణిమ_* *_శరద్ పూర్ణిమ విశిష్టత_* *ఆశ్వయుజ పూర్ణిమకే శరద్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు.* *మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు*. *ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ శరత్ పూర్ణిమ రోజున చంద్ర కిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్ర కిరణాలలో ఉన్న ఔషధీ తత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ ప్రసాదంగా స్వీకరిస్తారు*. *శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్నుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట.* *ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది.* *కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు*. *_కోజాగరి పౌర్ణమి_* *_లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం ఈ "కోజాగరి వ్రతం''."కోజాగిరి వ్రతం'' గురించి తెలుసుకొందాము_?* *సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీ లక్ష్మీదేవి ని పూజిస్తాము. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం, దారిద్ర్య వినాశక వ్రతం* *"కోజాగరి వ్రతం''*. *దారిద్ర్యం తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలిఖిల్య మహర్షిని కోరగా, వాలిఖిల్య కోజాగరి వ్రతాన్ని వివరించినట్లు పురాణాలలో ఆధారం ఉంది*. *పూర్వం మగధదేశంలో *"వలితుడు'' అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడట , అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమ గయ్యాళి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ప్రవర్తించేది*. *వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి ఆలోచించి* *" నీవు ఏ పని చేయించుకోవాలనుకుంటున్నావో దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది కాబట్టి నీ పని జరుగుతుంది''* *అని సలహా ఇచ్చాడు*. *కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు* *"రేపు మా తండ్రిగారి ఆబ్ధికం.అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు''* *అని భార్య చండితో అన్నాడు*. *భర్త మాటలు విన్న చండి మామ గారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో* *"పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి''* *రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది.* *ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు*. *కొంతకాలం తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయింది. నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు*. *పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కలా గాలించారు. వారికి వలితుడు కనిపించాడు* *వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వారికీ వివరించాడు. ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు* *లక్ష్మీ సమేతుడైన విష్ణువు భూలోకంలో ఎవరు మేలుకొని వున్నారో చూడడానికి రాగా, వారికి ఈ ముగ్గురు నాగకన్యలు మరియు వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు*. *దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలిఖిల్య మహర్షి వివరించాడట*. *కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి, ఆ రాత్రి జాగరణ చేస్తూ, పాచికలు ఆడేవారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలూ చెబుతున్నాయి* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ShareChat
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* *_సోమవారం అక్టోబర్ 06 2025_* *_శ్రీ విశ్వావసు నామ సంవత్సరం_* *_దక్షిణాయనం శరదృతువు_* *_ఆశ్వయుజ మాసం శుక్లపక్షం_* *_తిథి: చతుర్దశి ఉ 11.24వరకు తదుపరి పౌర్ణిమ_* *_వారం:సోమవారం (ఇందువాసరే)_* *_నక్షత్రం:ఉత్తరాభాద్ర తె 04.59వరకు తదుపరి రేవతి_* *_యోగం:వృద్ది మ 02.20వరకు తదుపరి ధృవ_* *_కరణం:వణిజ ఉ 11.24వరకు తదుపరి విష్ఠి రా 10.30వరకు ఆ తదుపరి బవ_* *_వర్జ్యం;మ 03.13-04.44వరకు_* *_దుర్ముహూర్తము:మ 12.12-01.00 మరల మ 02.34-03.22వరకు_* *_అమృతకాలం:రా 12.24-01.55_* *_రాహుకాలం:ఉ 07.30-09.00_* *_యమగండం/కేతుకాలం; ఉ 10.30-12.00_* *_సూర్యరాశి:కన్య_* *_చంద్రరాశి:మీనం సూర్యోదయం:05.47సూర్యాస్తమయం: 05.45_* *_ఓం నమఃశివాయ సర్వేజనాః సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భవతు_. _ఓం శాంతి శాంతి శాంతిః_* *_శుభమస్తు సంతోషమస్తు_* #మన సంప్రదాయాలు సమాచారం
మన సంప్రదాయాలు  సమాచారం - ) 8 ) 8 - ShareChat
*ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం టెండర్లకు స్పందన కరువు* *294 మద్యం దుకాణాలకు కేవలం 8 దరఖాస్తులే రావడంతో అవాక్కయిన అబ్కారీ శాఖ అధికారులు* *తెలంగాణ రాష్ట్రంలో గత నెల 26వ తేదీ నుండి మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తులను ఆహ్వానించడం ప్రారంభించిన ఎక్సైజ్ శాఖ* *ఉమ్మడి వరంగల్ జిల్లాలో 294 మద్యం దుకాణాలు ఉండగా, కేవలం 8 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి* *వరంగల్ జిల్లాలో 57 షాపులకు 3* *దరఖాస్తులు* *హన్మకొండ జిల్లాలో 67 షాపులకు ఒకటి* *జనగామ జిల్లాలో 50 షాపులకు 2* *మహబూబాబాద్ జిల్లాలో 61 షాపులకు 2 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యాపారులు* *ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో 59 షాపులకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం* #😁Hello🙋‍♂️
*మీరు కూడా అరట్టై యాప్‌కు మారాలనుకుంటున్నారా?* *అయితే ఈ కథనం మీకు చాలా సహాయపడుతుంది ?* *వాట్సాప్ నుండి అరట్టై యాప్‌కు మారడం* *ఇటీవలి కాలంలో మెటా (Meta)కు చెందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. దాన్ని వదిలి కొత్త యాప్‌కు మారడం అంత సులభం కాదు. కానీ, ఎవరూ ఊహించని విధంగా చాలా మంది వేగంగా అరట్టై యాప్‌కు మారుతున్నారు*. *భారతదేశంలో రూపొందించబడిన జోహో (Zoho) సంస్థకు చెందిన అరట్టై యాప్, ఈ మార్పును కొంచెం సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ యాప్ ఇప్పుడు మీ వాట్సాప్ సంభాషణలను (Chats) నేరుగా దిగుమతి చేసుకోవడాన్ని (Import) అనుమతిస్తోంది. అంటే, మీరు మీ చాట్‌లను కొత్తగా మొదలుపెట్టాల్సిన అవసరం లేదు*. *చాలా మంది వినియోగదారులకు, పాత సంభాషణలను కోల్పోతామనే ఆందోళన ఉంటుంది. ఈ భయమే కొత్త మెసేజింగ్ యాప్‌ను ప్రయత్నించడానికి అతిపెద్ద అడ్డంకిగా ఉంది. అరట్టై యాప్ అందించే ఇంపోర్ట్ ఆప్షన్ ఈ లోపాన్ని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది. ఇది వ్యక్తిగత మరియు గ్రూప్ చాట్‌లను తన ప్లాట్‌ఫామ్‌కు తరలించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీని ద్వారా వినియోగదారుల సంభాషణలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయి*. *వాట్సాప్ చాట్‌లను అరట్టై యాప్‌కు ఎలా మార్చాలి?* *చాట్‌లను మార్చే ముందు, మీరు ఎవరితో సంభాషణలను మార్చాలనుకుంటున్నారో ఆ వ్యక్తి లేదా గ్రూప్ సభ్యులు ఇప్పటికే వారి ఫోన్‌లో అరట్టై యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నారని నిర్ధారించుకోండి. కాంటాక్టులను సింక్ చేయడానికి యాప్‌కు అనుమతి అవసరం. ఒకవేళ మీ స్నేహితుడి నంబర్ అరట్టైలో కనిపించకపోతే, వారికి ఒక సాధారణ "hi" మెసేజ్ పంపి థ్రెడ్‌ను యాక్టివేట్ చేయండి. ఆ తర్వాత, బదిలీ ప్రక్రియ (Transfer Process) నేరుగా వాట్సాప్ నుండి ప్రారంభమవుతుంది*. *దీనికి సంబంధించిన పూర్తి ప్రక్రియ ఇక్కడ ఉంది:* *వాట్సాప్‌ను తెరిచి, మీరు* *తరలించాలనుకుంటున్న చాట్ యొక్క సెట్టింగ్‌లకు వెళ్లండి.* *దీని కోసం, కుడి ఎగువన ఉన్న మూడు చుక్కలపై (Three dots) నొక్కండి.* *మెనూ నుండి "More" (మరిన్ని) ఎంపికను ఎంచుకోండి*. *"Export Chats" (చాట్‌లను ఎగుమతి చేయండి)ను ఎంచుకోండి*. *ఈ దశలో, ఫోటోలు మరియు వీడియోల వంటి 'మీడియా'ను కూడా చేర్చాలా లేదా చాట్‌లను మాత్రమే తరలించాలా అని మిమ్మల్ని అడుగుతుంది. దానికి సమాధానం ఇవ్వండి*. *ఎంచుకున్న తర్వాత, చాట్‌లను ఎగుమతి చేయగల యాప్‌ల జాబితాను వాట్సాప్ మీకు చూపుతుంది*. *ఆ జాబితా నుండి అరట్టై యాప్‌ను ఎంచుకోండి*. *అరట్టై చిహ్నంపై నొక్కిన తర్వాత, ఇప్పటికే అరట్టైని ఉపయోగిస్తున్న కాంటాక్టులు కనిపిస్తాయి.* *కాంటాక్ట్ లేదా గ్రూప్‌ను ఎంచుకుని, Import (దిగుమతి) బటన్‌ను నొక్కండి*. *చాట్‌లను అరట్టై యాప్‌కు బదిలీ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది*. *ఈ ప్రక్రియ చాలా సూటిగా ఉంటుంది. అయితే, దీనికి ఒక నిబంధన ఉంది: మీరు చాట్‌లను మార్చాలనుకుంటున్న వ్యక్తి లేదా గ్రూప్ సభ్యులు అరట్టై యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఉంటేనే ఈ ఫీచర్ పనిచేస్తుంది. వారు అరట్టై యాప్‌లో లేకపోతే, మీరు వారి చాట్‌ను దిగుమతి చేసుకోలేరు*. *_అరట్టై యాప్ ఎందుకు ముఖ్యం?_* *చాలా* *సంవత్సరాలుగా, మెసేజింగ్, వ్యాపార గ్రూప్‌లు, కుటుంబ అప్‌డేట్‌లు మరియు పెళ్లి ప్లానింగ్‌ల వంటి అనేక పనులకు వాట్సాప్ అందరికీ ఇష్టమైన యాప్‌గా ఉంది. దీని నుండి మరొక యాప్‌కు మారడం దాదాపు ఇళ్లు మారిన అనుభూతిని ఇస్తుంది*. *చాట్ ఇంపోర్ట్ సపోర్ట్ ద్వారా, అరట్టై యాప్ ఆ అడ్డంకిని తగ్గించి, వినియోగదారులకు ఒక కొనసాగింపును అందించడానికి ప్రయత్నిస్తోంది. అంతేకాకుండా, భారతదేశంలో ఒక భారతీయుడు తయారుచేసిన యాప్ కావడం దీనికి మరింత ప్రాధాన్యత ఇస్తుంది*. *పాత మెసేజ్‌లు ముఖ్యమైన సంభాషణలలో కూడా ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక చిన్న వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లయితే మరియు వాట్సాప్‌లో కస్టమర్ ఆర్డర్‌ల రికార్డులను కలిగి ఉన్నట్లయితే, ఆ చాట్‌లను కోల్పోకుండా అరట్టైకి మారడం ఒక పెద్ద ఉపశమనం కావచ్చు*. *వినియోగదారులు గుర్తుంచుకోవాల్సినవి* *వాయిస్ మరియు వీడియో కాల్స్ ఎన్‌క్రిప్ట్ చేయబడినప్పటికీ, అరట్టై యాప్‌లో చాట్‌లకు పూర్తి స్థాయి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ ఇంకా పూర్తిగా అందించబడలేదు. అరట్టై యాప్ వాట్సాప్ యొక్క భద్రతా ప్రమాణాలను అనుసరించాలనుకుంటే, జోహో దీన్ని బలోపేతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు*. *అయినప్పటికీ, వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న యాప్‌ల మధ్య, చాట్‌లను ఎగుమతి చేయగల సామర్థ్యం అరట్టై యాప్‌లో ఉన్న ఒక అరుదైన ఫీచర్. ఇది మరింత ఎక్కువ మంది వినియోగదారులను అరట్టై యాప్‌ను ప్రయత్నించడానికి ప్రేరేపించవచ్చు. ప్రస్తుతానికి, మారాలనుకునే వినియోగదారులు, తమ డిజిటల్ జీవితాన్ని రీసెట్ చేయకుండానే కొత్త యాప్‌లో చాట్‌లను ఉపయోగించడం ప్రారంభించవచ్చు.* #మన సంప్రదాయాలు సమాచారం
*_మన ఆరోగ్యం…!_* *_ఖ‌ర్జూరపండు_* *_Dates : చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను రోజూ తినాలి.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే 4 ఖ‌ర్జూరాల‌ను తింటే చాలు..!_* *కాలం మారుతున్న కొద్దీ మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. కాలానికి అనుగుణంగా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి, కనుక ఆహారం విషయంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి*. *ముఖ్యంగా చలి కాలంలో మన ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చలికాలంలో వాతావరణంలో ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవటం వల్ల వీలైనంతవరకు మన శరీరాన్ని వెచ్చగా ఉంచటం కోసం ప్రయత్నం చేయాలి. ఈ క్రమంలోనే చలికాలంలో ఖర్జూరాలు మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి*. *ఖర్జూరాలను తీసుకోవటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...* *1. ఖర్జూరాలను పోషక విలువల రారాజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి ఖర్జూరాలు ఒక వరం. ఇందులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఖర్జూరాలు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తింటే రక్తం బాగా తయారవుతుంది* *2. ముందు రోజు రాత్రి ఖర్జూరాలను నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరగడుపున ప్రతి రోజూ రెండు ఖర్జూరాలను తినడం వల్ల గుండె సమస్యలు మీ దరిచేరవు*. *3. చాలా మంది మలబద్ధకం, జీర్ణక్రియ సమస్యలతో సతమతం అవుతుంటారు. చలికాలంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక అలాంటి వారు ప్రతి రోజూ రాత్రి రెండు లేదా మూడు ఖర్జూరాలను తిని పడుకోవడం ద్వారా ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు లేకుండా జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరుసటి రోజు ఉదయం వరకు ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. సుఖ విరేచనం అవుతుంది.* *4. చలికాలంలో ప్రతి ఒక్కరినీ దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారు ఒక గ్లాస్ నీటిలో రెండు ఖర్జూరాలు, 5 నల్ల మిరియాలు వేసి బాగా మరిగించి ఆ తర్వాత ఆ నీటిని వడబోసి తాగటం ద్వారా.. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు*. *5. ఆస్తమా సమస్యతో సతమతమయ్యే వారికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. బాలింతలు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల పిల్లలకు సరిపడా పాలు ఉత్పత్తి అవుతాయి* *_-సేకరణ_*. #మన సంప్రదాయాలు సమాచారం
4️⃣ *_ఆది పర్వము_* *_ప్రథమాశ్వాసము -1_* *_4 వ రోజు_* *తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం* *అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు*.  *ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు.* *“జనమేజయ మహారాజా! నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు*. *నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడు*. *నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడు*. *శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు*  *మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు*. *మహా బలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా చంపాడు కదా! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి" అని జనమేజయుని రెచ్చకొట్టాడు.* ``` *నాగులకు కద్రువ శాపం* *ఈ కథ వింటున్న శౌనకాది మునులు “మహాత్మా! నాగలోకం యాగాగ్నిలో పడి భస్మం కావడానికి వేరు కారణం ఏదైనా ఉందా?” అని అడిగారు.* *అందుకు సూతుడు... “మహామహులారా! పూర్వం కద్రువ తన కుమారులైన నాగులకు ఇచ్చిన శాపం కూడా ఇందుకు ఒక కారణం*. *జనమేజయుడు చేయబోతున్న యాగంలో కద్రువ శాపకారణంగా సర్పకులమంతా నశిస్తున్న సమయంలో పూర్వం రూరుడు సర్పకులాన్ని అంతా నాశనం చేస్తున్న తరుణంలో సహస్రపాదుడు ఆపిన చందంగా సర్పయాగంలో పడి మరణిస్తున్న నాగులను జరత్కారుని కుమారుడైన ఆస్తీకుడు ఆపివేసాడు. ఆ వృత్తాంతం వివరిస్తాను వినండి" అని చెప్పాడు.* #మన సంప్రదాయాలు సమాచారం