#🌍నా తెలంగాణ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🏛️రాజకీయాలు సింగరేణి బొగ్గు గనుల స్కాంలో రింగ్‌మాస్టర్ రేవంత్ బావమరిదే❗
📢 సింగరేణి కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పిందే వేదం
💰 ధరల పెంపు, పెనాల్టీల మాఫీల్లోనూ ఆయనదే హవా
📣 ఎదురుతిరిగిన అధికారులపై అడ్డగోలుగా చర్యలు
🆘 ఒత్తిడి భరించలేక పారిపోతున్న ఉన్నతాధికారులు
సిరులగని సింగరేణిలో ఏం జరుగుతున్నది? సంస్థను ఒక అదృశ్య శక్తి శాసిస్తున్నదా? అంతా తాను చెప్పినట్టే, తన కనుసన్నల్లోనే జరగాలని హుకుం జారీ చేస్తున్నదా? కాంట్రాక్ట్ ఏదైనా ఆయన చెప్పినవారికే దక్కుతున్నదా? ఆ వ్యక్తి చెప్పినట్టే ధరలు పెరుగుతున్నాయా? ఆయన ఆదేశించినట్టే పోస్టింగ్‌లు మారుతున్నాయా? ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక డైరెక్టర్ల స్థాయి వ్యక్తులు కూడా పరారవుతున్నారా? అంటే ‘అవును’ అనే అంటున్నాయి సింగరేణి వర్గాలు.
ఇప్పటికే ముఖ్యనేత సన్నిహితుడు ఒకరు పోలీస్ శాఖను తన అదుపులో పెట్టుకున్నారు. మరోవ్యక్తి సాగునీటిపారుదల శాఖను గుప్పిట్లోకి తీసుకున్నారు. ఇంకొకరు పరిశ్రమల శాఖలో పాతుకుపోయారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో ఇప్పుడు ముఖ్యనేత బంధువు సింగరేణి సంస్థను హస్తగతం చేసుకునేందుకు పన్నాగం పన్నినట్టు చర్చ జరుగుతున్నది. ఇందుకు తాజాగా జరుగుతున్న పరిణామాలే ప్రత్యక్ష సాక్ష్యమని సింగరేణి వర్గాలు స్పష్టంచేస్తున్నాయి.


