ఈ రోజు నేను వ్రాసిన వ్యాసం ' కృషితో నాస్తి దుర్భిక్ష్యం అనే పదానికి మరో పర్యాయ పదం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎన్. హరినాథరెడ్డి ' క్యాపిటల్ వాయిస్ పత్రికలో ప్రచురితమైంది. ఈ ప్రత్యేక సందర్బంగా ఒక సాధారణ వకీలుగా,అడ్వకేట్ గా తన జీవితాన్ని ఆరంభించి తన స్వయం కృషి తో,అవిరళ కృషితో న్యాయశాస్ర విద్యలో మంచి పట్టు, నైపుణ్యం సంపాదించి ఆ రంగంలో అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఏకంగా ఒక అత్యున్నత హోదా, ఎవరెస్ట్ శిఖరం వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి పదవికి ఎదిగిన గౌరవనీయులు అయిన జస్టిస్ ఎన్. హరినాథరెడ్డి గారి కథాకమిషు, ఆయన ఒక మహోన్నత స్థానానికి ఎదిగిన తీరుతెన్నులు వంటి అంశాలను విశ్లేషిస్తూ నేను వ్రాసిన ఈ వ్యాసాన్ని తన సొంత దినపత్రిక ' క్యాపిటల్ వాయిస్ ' లో ప్రచురించిన ఆ పత్రిక ఎడిటర్ పంగులూరి బుచ్చిబాబు గారికి & డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ వీరన్న గారికి ఇవే నా ఆత్మీయ,సహృదయ పూర్వక కృతజ్ఞతలు!
- మధుసూదనరెడ్డి బుగ్గన,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #justice


