ఒక్క ఆకుతో పూజించినా కోటి కోర్కెలనైనా తీర్చే దేవుడు శివుడు. ఆదిదేవుడు నిర్వికారుడు, నిరాండంబరుడు. ఆ పార్వతీపతిని పూజించాలంటే భక్తులు కూడా ఆర్భాటాలకు, ఆడంబరాలకు పోనక్కరలేదు.పుష్పం, పత్రం, తోయం...ఇందులో పువ్వులు లేకపోయినా ఆకులు, నీళ్లూ ఉంటే చాలు శివుడు సంతృప్తి చెందుతాడు. బిల్వం.. అంటే మారేడు పత్రాలంటే శంకరుడికి ఎంతో ప్రీతి. అలాగే జలాభిషేకంతోనే ఆయన కరుణపొందవచ్చు.
బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసంహారం-ఏకబిల్వం శివార్పణం!!
బిల్వ పత్రం దర్శించుకుంటే పుణ్యం వస్తుంది. తాకితే సర్వపాపాలు దూరమవుతాయి. అదే పత్రాన్ని శివుడికి భక్తితో సమర్పిస్తే మనం ఈ జన్మలో చేసిన ఘోరాతిఘోరమైన పాపాలకు ప్రాయశ్చిత్యం కలుగుతుంది.
#తెలుసుకుందాం #om Arunachala siva🙏 #🕉️హర హర మహాదేవ 🔱 #చిదానంద రూప శివోహం శివోహం #🙏ఓం నమః శివాయ🙏ૐ


