#తెలుసుకుందాం #Inspiration #inspirational people #inspirational people around the globe #good job
ఈ పిల్లల పేర్లు ఇందు, మౌనిక ఇద్దరి వయసు 8 ఏళ్ల లోపే..☺️🤗 ఇద్దరు ఒకే ఊరిలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు. మా గ్రామంలో పెట్టిన సంక్రాంతి ముగ్గుల పోటీల్లో పాల్గొని మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేశారు.
పెద్దలు పాల్గొనే పోటీల్లో తాము కూడా పోటీ పడగలమని ముందుకు రావడం వారిలోని ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. గెలుపు ఓటముల కంటే, కళ మీద వారిమీద వారికీ ఉన్న విశ్వాసం చాలా గొప్పది.
నేటి ఆధునిక కాలంలో పిల్లలు ఫోన్లు, వీడియో గేమ్స్ కే పరిమితమవుతున్నారు. కానీ ఊరిలోని ఈ చిచ్చరపిడుగులు నేల మీద రంగులతో అద్భుతాలు చేస్తూ పోటీ తత్త్వాన్ని కలిగి ఉండాలని, మన సంస్కృతి సాంప్రదాయలను, తెలుగువారి వారసత్వాన్ని కాపాడాలని తెలిజేసారు.
వీళ్ళ ముగ్గుల్లో కేవలం చుక్కలు, గీతలే కాకుండా.. గాలిపటాలు, పువ్వులు, భారత జెండా వంటి చిత్రాలను వారు వేసిన తీరు వారి సృజనాత్మకతను (Creativity) బట్టి వారికున్న సామాజిక, దేశభక్తి తెలియజేస్తోంది.
ముగ్గు వేయడం అంటే అంత సులభం కాదు. వంగి కూర్చుని, రంగులను పొదుపుగా వాడుతూ, ఆకృతులను తీర్చిదిద్దడం కోసం ఎంతో ఏకాగ్రత, ఓర్పు కావాలి. ఇంత చిన్న వయసులోనే వారు ఆ పట్టుదలని ప్రదర్శించారు.
ఇంత చిన్న వయసులోనే మన సంప్రదాయ కళ అయిన ముగ్గుల పట్ల ఆ పిల్లలు చూపిస్తున్న ఆసక్తి నిజంగా అభినందనీయం.
ఆ చిన్నారుల చిరునవ్వులు, వారి చేతి ముగ్గులు ఈసారి మా పోటీలకు మాత్రమే కాదు ఊరికే ఒక కొత్త స్పూర్తి, వెలుగును ఇచ్చాయి. ఇలాంటి పిల్లలని మనం ప్రోత్సహిస్తే, రేపటి తరం కూడా మన కళలను మరచిపోకుండా ముందుకు తీసుకెళ్తుంది.
మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలంటే మనం అందరం మన పిల్లలకు ఆచార వ్యవహారాలను బాగా అలవాటు చేయాల్సిన బాధ్యత పూర్తిగా మనపై ఉందనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి.
ఆ చిన్నారులకు మా ఆశీస్సులు అందజేస్తూ..
మీ అందరికీ..
మకర సంక్రాంతి పండుగ
శుభాకాంక్షలు..💐☀️💐
జై శ్రీ కృష్ణ 🙏
#MakaraSankranti #sankrantifestival #Muggulu


