నిన్నంతా కొంతమంది
❌ “మకర సంక్రాంతి దేశం అంతా జరగదు”
❌ “ఇది కేవలం harvest festival మాత్రమే”, అన్ని మతాల వారు జరుపుకుంటారు అని అందరికీ రుద్దే ప్రయత్నం చేశారు.
ఒక పెద్ద మనిషి అయితే ఇది కేవలం హిందువుల పండగ కాదు, మొత్తము రైతుల పండుగ, అన్ని మతాల పండుగ అని చెప్పే ప్రయత్నం చేశారు. సరే అయవ సెక్యులర్ తిప్పలు ఆయనవి.
సంక్రాంతి భారతదేశంలో ఒక క్యాలెండర్ ఫెస్టివల్. దేశం అంతా ఒకే సమయంలో వచ్చే పంట ఎప్పుడూ లేదు. కానీ దేశం అంతా ఒకే రోజున జరుపుకునే హిందూ పండగ మాత్రం మకర సంక్రాంతి. ఇది మాత్రమే నిజం. మిగతావన్నీ అర్థసత్యాలు.
🔱 అసలు మకర సంక్రాంతి అంటే ఏమిటి?
మకర సంక్రాంతి అంటే
🌞 సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజు.
అంటే దక్షిణాయనం ముగిసి ఉత్తరాయనం ప్రారంభమయ్యే పుణ్యకాలం.
ఇలాంటి రోజుకు ఏడాదిలో 12 సార్లు వస్తాయి. సూర్యుడు ఒకొక్క రాశిలో ప్రవేశించే రోజును ఆ రాశికి సంభందించిన సంక్రాంతి గా పిలుస్తారు. కానీ మకర రాశి, సూర్యారాధన సనాతన ధర్మానికి ముఖ్యము. అందుకే ఈ సంక్రాంతికి ఇంకా ప్రాధాన్యం.
అందుకే దీనిని
✔️ ఉత్తరాయణ పుణ్యారంభం
✔️ దేవతలకు ప్రీతికరమైన కాలం
అని హిందూ శాస్త్రాలు చెబుతాయి.
ఇది చంద్ర క్యాలెండర్ మీద కాదు, పూర్తిగా సౌర క్యాలెండర్ మీద ఆధారపడిన పండగ.
అందుకే ప్రతి సంవత్సరం జనవరి 14 లేదా 15న ఖచ్చితంగా వస్తుంది. ఇది మారదు.. ఇది ప్రత్యేకం. అందుకే ఇది హిందూ క్యాలెండర్ ఫెస్టివల్.
🌾 మరి హార్వెస్ట్ ఫెస్టివల్ ఎందుకు అంటారు?
భారతదేశం ఒక వ్యవసాయ దేశం. ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో పంట కోతలు పూర్తవుతాయి. అందుకే పంటతో పాటు సూర్యుడికి కృతజ్ఞత చెప్పుకునే పండగగా మారింది.
కానీ గుర్తుంచుకోండి. దేశం అంతా ఒకే పంత, ఒకే రోజున, ఒకే విధంగా ఎప్పుడూ రాదు. అయినా సూర్యుడు మకరంలో ప్రవేశించేది మాత్రం దేశం అంతా ఒకేసారి , అందుకే దేశం అంతా సంక్రాంతి.
🇮🇳 భారతదేశంలో మకర సంక్రాంతి – ప్రాంతాల వారీగా
🔸 కర్ణాటక
ఇక్కడ “ఎళ్ళు బిరోధు” అనే సంప్రదాయం ఉంటుంది.
స్త్రీలు కనీసం 10 కుటుంబాలకు ఎళ్ళు బెల్ల (నువ్వులు, బెల్లం, చెరకు) పంచుకుంటారు.
రైతులు దీనిని Suggiగా జరుపుకుంటారు.
ఎద్దులు, ఆవులను అలంకరిస్తారు.
🔸 కేరళ
ఇక్కడ వేలాది మంది Sabarimala దగ్గర
మకర జ్యోతి దర్శనం కోసం వస్తారు. పొన్నంబల మేడ కొండపై కనిపించే మకర విలక్కు పవిత్రతకు ప్రతీక.
🔸 గుజరాత్
ఇక్కడ దీనిని ఉత్తరాయణ్ అంటారు.
రెండు రోజులు జరుపుకుంటారు. పతంగ్ (గాలిపటాలు), ఉంధియూ చక్కీలు ఇవి ప్రత్యేకత.
🔸 మహారాష్ట్ర
ఇక్కడ తిల్గుళ్ పంచుకుంటారు. “తిల్గుళ్ ఘ్యా, గోడ్ గోడ్ బోలా” అంటే తీపి తీసుకుని తీపిగా మాట్లాడండి.
🔸 ఒడిశా
ఇక్కడ మకర బస్మ అనే సంప్రదాయం ఉంది.
ఒక సంవత్సరం పాటు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎంచుకుంటారు. ఇది స్నేహానికి ప్రతీక.
🔸 ఉత్తరాఖండ్
ఇక్కడ వలస పక్షుల పండగగా భావిస్తారు.
పక్షులు తమ ప్రయాణాన్ని ముగించే కాలమని నమ్మకం. ఖిచ్డీ దానం, మేళాలు జరుగుతాయి.
🔸 తమిళనాడు
ఇక్కడ పొంగల్గా నాలుగు రోజుల పాటు ప్రకృతి, సూర్యుడు, పశువులకు కృతజ్ఞతగా జరుపుకుంటారు.
🔸 ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ
ఇక్కడ భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పండగ. గ్రామీణ సంస్కృతి, పశుపూజ, కుటుంబ కలయిక ప్రధానమైనవి.
🕉️ అయితే ఇది హిందువుల పండగ ఎలా అయింది?
ఎందుకంటే
✔️ సూర్యారాధన హిందూ ధర్మంలో మూలం
✔️ ఉత్తరాయణానికి శాస్త్రీయ & ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
✔️ పుణ్యకాలం, దానధర్మాలు
✔️ వేదాలు, పురాణాల్లో స్పష్టమైన ప్రస్తావన
ఇవన్నీ కలిసేమకర సంక్రాంతిని హిందూ పండగగా నిలిపాయి.
ఇది కేవలం పంట పండగ కాదు, కేవలం ప్రాంతీయ పండగ కాదు, ఇది భారతదేశం అంతా జరుపుకునే హిందూ క్యాలెండర్ ఫెస్టివల్. అది మాత్రమే నిజం.
ఏ విధంగా జరుపుకున్నా మీకు, మీ కుటుంబానికి శుభ మకర సంక్రాంతి 🌞✨
🚀 మీ సెక్యులర్ పైత్యాలకు పండగల వైశిష్ట్యాన్ని మార్చకండి.
🙏🙏🙏
-- ఉపద్రష్ట పార్ధసారధి
#😴శుభరాత్రి #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #🐄కనుమ శుభాకాంక్షలు🌾


