*ఆ‘మనీ’... హాయిగా సాగనీ!*
* ఒకప్పుడు స్థిరమైన ఉద్యోగమున్నా... సొంత ఇల్లున్నా... పిల్లలు బాగా చదువుతున్నా... జీవితం సాఫీగా సాగుతుందనే భరోసా! కానీ ఇప్పుడు... ఉద్యోగాలున్నా... అవి శాశ్వతం కాదు... ఆదాయం పెరిగినా... అది సరిపోదు... ఆధునిక వైద్యం ముందు... లక్షల పొదుపు అంగుష్ఠమాత్రం చదువుల ఖర్చు... ఆదాయాన్ని తూచ్ అంటోంది. ద్రవ్యోల్బణం... జీతాన్ని, జీవితాన్ని నిశ్శబ్దంగా తినేస్తోంది... అందుకే... అందరికీ కావాల్సిందిప్పుడు ఆర్థిక భద్రత! అంటే డబ్బు ఎక్కువగా ఉండటం కాదు.. ఎలాంటి పరిస్థితి వచ్చినా కుటుంబం నిలబడగలగటం... ఉద్యోగం పోయినా, అనారోగ్యం వచ్చినా... అప్పు చేయాల్సిన అవసరం రాకపోవటం.. పిల్లల చదువులకు భయపడకపోవటం ఒక్కమాటలో చెప్పాలంటే... ఆర్థిక భద్రత అనేది విలాసం కాదు. జీవన రక్షణ కవచం!
#yes it's true 💯% #💗నా మనస్సు లోని మాట #🗣️జీవిత సత్యం #పవర్ ఆఫ్ మనీ #money


