* ఎమ్మెల్యే ముత్తుములను మర్యాదపూర్వకంగా కలిసిన ఏజీపీ రంగారెడ్డి.
* గిద్దలూరు జూనియర్ సివిల్ జడ్జి అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్ గా నియమితులైన ముత్తుముల రంగారెడ్డి శుక్రవారం మధ్యాహ్నం గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గౌ. శాసనసభ్యులు శ్రీ ముత్తముల అశోక్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి, పూలమాల శాలువా వేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా నూతనంగా నియమితులైన ఏజీపీ రంగారెడ్డిని ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాలుగుళ్ళ శేషశయనా రెడ్డి, న్యాయవాదులు మోహన్, తిరుమల ప్రసాద్, పోలీరెడ్డి, నాయక్, పిచ్చయ్య, విజయ్ మరియు టీడీపీ నాయకులు పాలుగుళ్ళ చిన్న శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.. #📰ఆంధ్రా వాయిస్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #🏛️రాజకీయాలు


