ShareChat
click to see wallet page
search
కాంగ్రెస్ నాయకుల అరాచకం - దళిత ఎమ్మెల్యేపై దాడి హేయమైన చర్య! అధికార గర్వంతో కాంగ్రెస్ నాయకులు బరితెగిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలపై భౌతిక దాడులకు దిగుతూ తెలంగాణలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారు! అక్రమాలను ప్రశ్నిస్తే దాడి చేస్తారా? అధికార అండతో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ చేస్తున్న అవినీతిని, అక్రమాలను బయటపెట్టినందుకు.. ఓర్వలేక ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై ఎంపీ మల్లు రవి రెచ్చిపోయి దాడి చేయడం సిగ్గుచేటు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని ఎండగడితే సమాధానం చెప్పలేక దాడులకు దిగడమేనా మీ 'ప్రజాపాలన'? అక్రమాలను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదా? ఒక బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి, ఒక దళిత ఎమ్మెల్యేపై భౌతిక దాడికి దిగడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. ఎమ్మెల్యే విజయుడిపై దాడి చేసిన ఎంపీ మల్లు రవిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అధికార మదంతో దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలి! #👨‍💼కె. టీ. రామారావు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🏛️రాజకీయాలు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి
👨‍💼కె. టీ. రామారావు - ShareChat
00:22