ShareChat
click to see wallet page
search
తండ్రి పరమేశ్వర ! కష్టం చెప్పుకోవడానికి నువ్వు ఎన్ని మెట్లు ఎక్కుతావో, కష్టం తీర్చడానికి నువ్వు నమ్ముకున్న నీ ఇష్ట దైవం అన్ని మెట్లు దిగి వస్తాడని మా అమ్మ చెప్పింది. మొక్కిన వారికి దిక్కు నీవు. అడిగినవారికి ఆపద్బాంధవు నీవు. పిలిచిన వారికి పరమాత్మవూ నీవు. ఆర్తి కలిగిన వారికి అంతరాత్మ నీవు. ముక్తి కోరేవారికి గమ్యం నీవు. అన్నిటికి నీవేనని, నీతో మాత్రమే మంచి చెడులను చెప్పుకోమని చెప్పింది. ఆచరించి చూశాను, నీ ఆదరణ కోరి వచ్చాను. రక్షంచావు, రక్షణ కల్పించావు, మా అమ్మ చెప్పిన మాటలను, శాసనాలు గా మార్చేశావు, ధన్యోస్మి తండ్రి #ఉమామహేశ్వర ! మీ పాదపద్మములే నాకు ఎల్లవేళలా శరణాగతి. ఒకనాడు నిన్ను దైవంగా కొల్చాను. మర్నాడు నిన్ను సర్వంగా భావించాను. నేడు నా తండ్రిగా నిలుపుకున్నాను కేదారేశ్వర. ఆ బంధం కన్నా గొప్ప బంధం ఏముంది. తండ్రి #బోలాశంకర ! ఆపదమొక్కులవాడివి, అడుగడుగున దండాల వాడివి. ప్రేమతో రవ్వంత భక్తిని చూపిస్తే కొండంత అండగా నిలిచే వాడివి. నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి. నీతో తప్ప నేను ఎవ్వరితో ఇమిడి ఉండలేనయ్యా. నీ ధ్యాసే, నా శ్వాసకు ఉండిపోనువ్వు తండ్రీ. నమో హార పార్వతి పతియే హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏 #💗నా మనస్సు లోని మాట #చిదానంద రూప శివోహం శివోహం #🕉️హర హర మహాదేవ 🔱 #om Arunachala siva🙏 #🙏ఓం నమః శివాయ🙏ૐ
💗నా మనస్సు లోని మాట - ~S1 N ~S1 N - ShareChat