ShareChat
click to see wallet page
search
Hare Krishna Prabhu dandvat pranam🙏 Date 21 st January 2026 Topic ; భగవంతుడు ఉన్నాడా మనకి కనిపించడా అని అడిగే వాళ్లకి మనం ఇవ్వాల్సిన వివరణ speaker ; Chaitanya Krishna Prabhu భగవంతుడు ఉన్నాడని ఎలా అర్థం చేసుకోవాలి? 1 .భగవంతుడి ఎనర్జీ, సిస్టం, ప్రిన్సిపల్స్ ఆధారంగా మనం భగవంతుడి ఉనికిని అర్థం చేసుకోవాలి ఈ కలియుగంలో మనమంతా బద్ధ జీవనంలో ఉన్నాము. మన చుట్టూ ఉన్న జీవితం అంతా ఒత్తిడితో, ఆందోళనతో, అసంతృప్తితో నడుస్తోంది. ఇంతకుముందు యుగాలలో భగవంతుడు ప్రత్యక్షంగా దర్శనమిచ్చేవాడు అని పురాణాలు చెబుతున్నాయి. కానీ కలియుగంలో భగవంతుడు మన కంటికి కనిపించడంలేదు. అందుకే చాలా మంది “భగవంతుడు ఉన్నాడా? లేక లేడా?” అనే సందేహంలో పడుతున్నారు. కొందరు గుడ్డిగా నమ్ముతున్నారు, మరికొందరు గట్టిగా ఖండిస్తున్నారు. అయితే భగవంతుడు మనకు ఒక ముఖ్యమైన బోధన ఇచ్చాడు – భగవంతుడిని గుడ్డిగా నమ్మవద్దు, అర్థం చేసుకోమని 2. భగవంతుడు ఉన్నాడని నిరూపించడానికి ఆయనను కంటితో చూడాల్సిన అవసరం లేదు. గాలి మనకు కనిపించదు, కానీ దాని ప్రభావం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే భగవంతుడిని కూడా ఆయన పనిచేసే విధానాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. భగవంతుడు ఉన్నాడని నిరూపించే మూడు బలమైన ఆధారాలు ఉన్నాయి. అవే – భగవంతుడి ఎనర్జీ (శక్తి), భగవంతుడి సిస్టం (వ్యవస్థ), భగవంతుడి ప్రిన్సిపల్స్ (సిద్ధాంతాలు). ఈ మూడు అంశాలను నిజాయితీగా విశ్లేషిస్తే భగవంతుడు ఉన్నాడని స్పష్టంగా తెలుస్తుంది. 3. ముందుగా భగవంతుడి ఎనర్జీ గురించి తెలుసుకోవాలి. భగవద్గీత ప్రకారం భగవంతుడికి మూడు శక్తులు ఉన్నాయి. మొదటిది అంతరంగిక శక్తి. ఇది ఆనంద శక్తి, ఆధ్యాత్మిక శక్తి. భగవంతుని నామస్మరణ, హరే కృష్ణ మహామంత్రం జపం, భగవద్గీత మరియు భాగవతం వంటి గ్రంథాల శ్రవణం ఈ శక్తికి చెందుతాయి. ఈ శక్తి ప్రత్యేకత ఏమిటంటే – ఇందులో ప్రవేశించినప్పుడు ప్రారంభంలోను ఆనందం ఉంటుంది, చివర కూడా ఆనందమే ఉంటుంది. ఒక వ్యక్తి తీవ్రమైన బాధలో ఉన్నా, భయంతో, ఒంటరితనంతో కుంగిపోయినా, హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తే అతని మనసులో క్రమంగా శాంతి ఏర్పడుతుంది. ఇది ఊహ కాదు, అనుభవం. ఇది అంతరంగిక శక్తి పని చేసే విధానం. 4 . రెండవది బాహ్య శక్తి, దీనినే మాయా శక్తి అంటారు. ఈ భౌతిక ప్రపంచం మొత్తం ఈ శక్తి ఆధీనంలోనే నడుస్తోంది. కామం, క్రోధం, లోభం, మోహం, మత్సరం వంటి లక్షణాలన్నీ ఈ శక్తికి చెందినవే. ఈ శక్తి ఒక ప్రత్యేకమైన నియమంతో పనిచేస్తుంది. దాని నియమం ఏమిటంటే – ప్రారంభంలో సుఖం, చివర్లో తప్పనిసరిగా దుఃఖం. మద్యం, వ్యసనాలు, అక్రమ భోగాలు మొదట ఆనందంలా అనిపిస్తాయి. కానీ చివరికి అవే వ్యాధులకు, మానసిక క్షోభకు, జీవిత నాశనానికి దారి తీస్తాయి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది బాహ్య శక్తి యొక్క డిజైన్. 5 . మూడవది మాధ్యమిక శక్తి. మనమంతా, ఈ 84 లక్షల జీవరాసులన్నీ, భగవంతుడి అంశలు. మన శరీరం బాహ్య శక్తికి చెందినది, కానీ మన ఆత్మకు స్వేచ్ఛ ఉంది. మనం మాయ వైపు వెళ్లాలా, లేక భగవంతుని వైపు వెళ్లాలా అనే ఎంపిక మన చేతిలోనే ఉంది. ఈ ఎంపిక ఆధారంగానే మన జీవితం శాంతిగా మారుతుందా లేక కలతలతో నిండిపోతుందా అనే విషయం నిర్ణయమవుతుంది. 6 . ఇప్పుడు భగవంతుడి సిస్టం గురించి చూద్దాం. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన వ్యవస్థ మీద నడుస్తోంది. ప్రతి రోజు సూర్యుడు సమయానికి ఉదయిస్తాడు, సమయానికి అస్తమిస్తాడు. చంద్రుడు పౌర్ణమి, అమావాస్యల రూపంలో మారుతూ ఉంటాడు. ఎవరు స్విచ్ ఆన్ చేయడం లేదు, ఎవరు స్విచ్ ఆఫ్ చేయడం లేదు. ఇది ఆటోమేటిక్ సిస్టం. అలాగే మన జీవితంలో కూడా పని చేస్తేనే ఫలితం వస్తుంది. రైతు కష్టపడితేనే పంట పండుతుంది, ఉద్యోగి పనిచేస్తేనే జీతం వస్తుంది. కష్టపడకుండా ఈ భౌతిక ప్రపంచంలో ఏదీ లభించదు. ఈ “కష్టపడాలి” అనే నియమాన్ని ఎవరు సృష్టించారు? మనుషులా? సైంటిస్టులా? కాదు. 7 . ఇది భగవంతుడు రూపొందించిన కర్మ సిస్టం. జననం, మరణం కూడా ఒక సిస్టమే. మనం పుడతాం, పెరుగుతాం, కష్టపడతాం, మరణిస్తాం, మళ్లీ పుడతాం. ఈ చక్రాన్ని ఎవరు రూపొందించారు? జంతువులు ఈ ప్రశ్న అడగవు. మనిషికే ఈ ప్రశ్నించే శక్తి ఉంది. అందుకే మానవ జన్మ ప్రత్యేకమైనది. ఈ సిస్టం వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకోవడమే మన జీవిత లక్ష్యం. 8 . ఇక భగవంతుడి ప్రిన్సిపల్స్ విషయానికి వస్తే, భగవంతుడు కేవలం “నమ్ము” అని చెప్పలేదు. ఆయన స్పష్టమైన సిద్ధాంతాలను ఇచ్చాడు. భగవద్గీత 700శ్లోకాలు, భాగవతం18000 శ్లోకాలు మహాభారతం లక్ష శ్లోకాలు 4వేదాలు, ఉపనిషత్తులు వంటి గ్రంథాలు దీనికి సాక్ష్యం. భగవద్గీతలో భగవంతుడు ఆహార నియమాల నుంచి జీవన విధానం వరకు అన్నింటినీ వివరించాడు. వండిన ఆహారం నిర్దిష్ట సమయానికి తినాలి, రాత్రివేళ భారమైన ఆహారం తీసుకోకూడదు అని చెప్పారు. ఇవి పాటిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, బుద్ధి స్పష్టంగా పనిచేస్తుంది. ఒక ఆహార నియమం కూడా మన గుణాలను మార్చగలిగితే, ఈ సూత్రాల వెనుక ఉన్న విజ్ఞానం ఎంత లోతైనదో అర్థం చేసుకోవచ్చు. 9 .ఈ అన్ని అంశాల మధ్య హరే కృష్ణ మహామంత్రం ఒక యూనివర్సల్ సూత్రంలా పనిచేస్తుంది. కరెంట్ ఎలా మతం, దేశం, కులం చూడకుండా అందరికీ ఒకే విధంగా పనిచేస్తుందో, కృష్ణ నామం కూడా అలానే పనిచేస్తుంది. ఎవరు అయినా సరే, ఎక్కడ పుట్టినా సరే, హరే కృష్ణ నామస్మరణ చేస్తే జీవితం శుద్ధమవుతుంది. ఇది మూఢనమ్మకం కాదు, ఎనర్జీ సైన్స్. 10 . అందుకే భగవంతుడు కలియుగంలో ప్రత్యక్షంగా రావడం కన్నా తన నామాన్ని ఇచ్చాడు. కృష్ణుడు తన నామం ద్వారా ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నాడు. భగవంతుడు కనిపించకపోయినా, ఆయన ఎనర్జీ పనిచేస్తోంది, ఆయన సిస్టం నడుస్తోంది, ఆయన ప్రిన్సిపల్స్ ఫలితాలను ఇస్తున్నాయి. ఈ మూడు ఆధారాలను నిజాయితీగా పరిశీలిస్తే, భగవంతుడు ఉన్నాడని అర్థమవుతుంది. 11. భగవంతుడు అంటే కేవలం ఒక రూపం కాదు, ఒక భావన కాదు. భగవంతుడు అంటే – ఎనర్జీ, సిస్టం, ప్రిన్సిపల్స్. ఈ మూడింటిని అర్థం చేసుకుని హరే కృష్ణ మహామంత్రాన్ని ఆశ్రయిస్తే, ఈ దుఃఖాలయమైన భౌతిక జీవితం నుంచి ఆనందమయమైన ఆధ్యాత్మిక జీవితానికి మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. . 12 .గురువు ఎందుకు అవసరం? గురువు అంటే ఎవరు? భగవంతుడు చెప్పింది “As it is”గా పాటించేవాడే గురువుగురువు లేకపోతే గుడ్డి భక్త .గురువు ఉన్నవాడికి ఎనర్జీ ,సిస్టo ,ప్రిన్సిపల్స్ స్పష్టంగా అర్థమవుతాయి. 13 .భగవంతుడు అంటే:ఒక రూపం మాత్రమే కాదు ఒక పేరు మాత్రమే కాదు భగవంతుడు = ఎనర్జీ + సిస్టం + ప్రిన్సిపల్స్ కృష్ణుడు కనిపించకపోయినా ఆయన నామం పనిచేస్తోంది ఆయన శక్తి పనిచేస్తోంద ఆయన సిస్టం ప్రపంచాన్ని నడిపిస్తోంది. ఈ సిస్టమ్స్ అన్నిటి వెనుక ఒకరు ఉన్నారు అదే భగవంతుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కచ్చితంగా అందరికీ చెప్పవచ్చు. అందుకేహరే కృష్ణ మహామంత్రం ఈ కలియుగంలో అత్యంత శక్తివంతమైన మార్గం. #భగవద్గీత
భగవద్గీత - friendship with Ifwe make our Krsna,it willneverbreak RV 8:Action in Knowledge of Krsna Kashha Golden Temple friendship with Ifwe make our Krsna,it willneverbreak RV 8:Action in Knowledge of Krsna Kashha Golden Temple - ShareChat