🌺 మురుగన్ 🌺
‘పెరుమాళ్’ అన్న పదం శ్రీ మహా విష్ణువుకు సంబంధించినది. ప్రతి ఊరిలోనూ ఒక శివాలయం, ఒక విష్ణు ఆలయం ఉండడం మనం చూస్తుంటాము. శివపార్వతుల ఇద్దరి తేజస్సుతో ఉద్భవించిన సుబ్రహ్మణ్యుణ్ణి అరుణగిరినాథర్ ‘పెరుమాళే’ అని పిలవడం చాలా అద్భుతమైన విషయం.
తమిళనాడులో సుబ్రహ్మణ్యుణ్ణి సాధారణగా శ్రీ మహా విష్ణువు సంబంధంతో ‘మురుగన్’ అని పిలుస్తారు. ఎందుకంటే, సుబ్రహ్మణ్యుడు, శ్రీ మహా విష్ణువు చెల్లెలైన పార్వతీ దేవి కుమారుడు కాబట్టి. శ్రీ మహా విష్ణువుకు మేనల్లుడు అవుతాడు కాబట్టి ‘మాల్ - మురుగన్’ అని ప్రఖ్యాతి. ‘మరుమగన్’ అంటే అల్లుడు. పూర్వజన్మలో వల్లి మరియు దేవసేన విష్ణువు కుమార్తెలు. అందుకే మహావిష్ణువు సుబ్రహ్మణ్యుడికి మామ అవుతారు. ఆయన శివునికి పుత్రుడు, విష్ణువుకి అల్లుడు. అందుకే అరుణగిరినాథర్ సుబ్రహ్మణ్యుణ్ణి ‘మరుగోనె’ అని అంటాడు.
కాని ఉత్తర భారతంలో ఈ ‘అల్లుడి’ విషయం ఎప్పటికి ఒప్పుకోరు. అక్కడ సుబ్రహ్మణ్యుణ్ణి బ్రహ్మచారిగానే కొలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో సుబ్రహ్మణ్య ఆలయాలలోకి ఆడవారిని అనుమతించరు. ఈ విషయంలో వారు చాలా కఠినంగా ఉంటారు. అంతేకాక ఉత్తరాన ‘సుబ్రహ్మణ్య’ అన్న పేరుకంటే ‘కార్తికేయు’నిగా ఎక్కువ ప్రాచుర్యం.
.
#☀️శుభ మధ్యాహ్నం #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🦚🙏ఓం శరవణ భవః🕉️🚩 #🦚శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి🕉️🚩

