ShareChat
click to see wallet page
search
ఇండియా అంటేనే మిస్టరీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే వుంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్టరీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్టరీలు ఇప్పటివరకూ వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్టరీలున్న దేవాలయాలు చాలా వున్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగివుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా శని శింగనాపూర్ ని చూద్దాం.🛕🚩 మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ వూరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒకటి కూడా లేవు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ వుండే శనిదేవుడు.. శని రూపంలో శిక్షిస్తాడని భక్తులనమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. యాగంటి..🛕🚩 ఆంధ్రప్రదేశ్ లోఇది ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగావున్న నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెబుతూంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే.. ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగివుందని, అందుకే ప్రతి 20 ఏళ్ళకు ఒక ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తులనమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూవుంటారు.. లేపాక్షి..🛕🚩 ఆంధ్రప్రదేశ్ లోని ఆనంతపురం జిల్లాలో లేపాక్షి వుంది. ఇక్కడ వున్న స్థంభాలు చాలా మిస్టరీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్థంభం క్రింద పేపర్ కానీ, క్లాత్ కానీ ఈజీగా పట్టించేయోచ్చు. అంటే స్థంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్థంభం క్రింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్థంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు.. తంజావూరులో మిస్టరీ..🛕🚩 తంజావూరులోని బృహదీశ్వరాలయం ఇప్పటికి ఒక మిస్టరీగానే వుంది. దీనిని రాజరాజచోళుడు 11 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి వుంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికి కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా.. సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికుపయోగించిన గ్రానైట్ ను కూడా ఎక్కడ నుండి తీసుకోచ్చారనేది కూడా తెలియదు. పూరీజగన్నాథ్ ఆలయం..🛕🚩 పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు పూరీక్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం వుంది. ఆ సముద్రపు శబ్దంకూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకూ సముద్రఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే వుండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంతుచిక్కలేదు.. షోలాపూర్..🛕🚩 మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజూ ఉపయోగించే బెడ్ షీట్ లకు పెట్టిందిపేరు. ఇక్కడ ఒక వింత గ్రామం వుంది పేరు షెత్పల్.. ఈ గ్రామంలో పాములకు పూజ చేయటం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతిఇంట్లో పాములకు కూడా ఒక గదివుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూవుంటాయి. కాని ఇంతవరకూ ఆ గ్రామంలో ఏ పాము ఎవరినీ కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతోంది.. అంటేనే భయమేస్తోంది కదూ.. అమ్రోహా..🛕🚩 ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధిచెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్ళు!! అవును.. ఇక్కడ ఆలయంలోపల.. చుట్టూ తేళ్ళు తిరుగుతూనే వుంటాయి. ఒకటికాదు, రెండుకాదు వేలసంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి ఎన్నో మిస్టరీలు మనదేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్ధం కాలేదు. ఇప్పటికి అవి మిస్టరీగానే ఉండిపోయాయి.... 🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱🔱🙏🔱 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 #తెలుసుకుందాం #హిందూ దేవాలయాలు💐🎂 #హిందూ దేవుళ్ళు * దేవాలయాలు #🇮🇳 Hindu Temples & Hinduism 🇮🇳 #hindu temples
తెలుసుకుందాం - 4 Wnuteluguvignanamvinodami blogspotin లేపాక్షి విరూపాక్ష ఆలయం WWI 4 Wnuteluguvignanamvinodami blogspotin లేపాక్షి విరూపాక్ష ఆలయం WWI - ShareChat