Virat Kohli : కింగ్ కోహ్లీ కనబడట్లేదోచ్.. ఇన్‌స్టాలో వెతికి వెతికి ఫ్యాన్స్ నీరసించిపోతున్న ఫ్యాన్స్
Virat Kohli : ప్రపంచ క్రికెట్ ఐకాన్, టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానులకు భారీ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో అత్యంత ఆధిపత్యం చలాయించే కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా మాయమైపోయింది. రాత్రికి రాత్రే అతని అకౌంట్ డియాక్టివేట్ కావడంతో 27 కోట్లకు పైగా ఉన్న ఫాలోవర్లు అయోమయంలో పడ్డారు. ఇది ఏదైనా సాంకేతిక లోపమా లేక కోహ్లీ స్వయంగా తీసుకున్న నిర్ణయమా అన్నది ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.