ShareChat
click to see wallet page
search
#bye bye 2025👋 #2026 ⁉️ New Year: 2026.. *ఈ నెంబర్ చాలా స్పెషల్‌, 20 ఏళ్లకు ఒకసారే ఇలా జరుగుతుంది..‼️* 01.01.2026👋 2025కి గుడ్ బై చెప్పేసి కొత్తేడాదిలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఎన్నో ఆశలతో 2026కి వెల్‌కమ్ చెప్పారు. ఈ ఏడాది ఎన్నో మార్పులకు సాక్ష్యంగా నిలవనుంది. అయితే 2026 నెంబర్ చుట్టూ ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2025 అనేది 45 × 45 = పూర్తి స్క్వేర్ సంఖ్య. దానికి వెంటనే వచ్చే ఏడాది 2026 = 45² + 1. అంటే ఒక పర్ఫెక్ట్ స్క్వేర్‌కి కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్న సంవత్సరం. ఇలాంటి అవకాశం ప్రతి 20 ఏళ్లకోసారి మాత్రమే వస్తుంది. ఇంకో విశేషం ఏంటంటే.. 2026 లోని అంకెలను (2+0+2+6 = 10) కలిపితే,2026 ÷ 10 = 202.6 వస్తుంది. అంటే ఇది Harshad Year. సంఖ్య తన అంకెల మొత్తంతో భాగించబడుతుంది. 2026 క్యాలెండర్‌ను దాచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అదే క్యాలెండర్ 2037 లో మళ్లీ ఉపయోగపడుతుంది. తేదీలు, వారాలు, సెలవులు అన్నీ అచ్చుగానే ఉంటాయి. ఇంకా ఒక అరుదైన విషయం.. ఫిబ్రవరి 13 శుక్రవారం, అలాగే మార్చి 13 కూడా శుక్రవారం అవుతుంది. వరుసగా రెండు నెలల్లో శుక్రవారం 13వ తేదీన రావడం చాలా అరుదు. దాదాపు 11-12 ఏళ్లకోసారి మాత్రమే ఇలా జరుగుతుంది. 2026 ను బైనరీ రూపంలో రాస్తే: 11111101010 ఇందులో దాదాపు అన్నీ 1లే ఉన్నాయి. ఈ శతాబ్దంలో ఇంత డెన్స్ బైనరీ ప్యాటర్న్ ఉన్న సంవత్సరం చాలా తక్కువ. ఇంకో సరదా విషయం ఏంటంటే.. 2 × 0 × 2 × 6 = 0. ఇంత పెద్ద సంఖ్య చివరకు సున్నా అవుతుంది. దీనినే "Zero-Product Year" అంటారు. 2026 లో ప్రపంచం సృష్టించే డిజిటల్ డేటా 300 జెట్టాబైట్స్ దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 2010 కి ముందు మానవ చరిత్ర అంతా సృష్టించిన డేటా కన్నా ఎక్కువ. భూమిపై ఉన్న ఇసుక కణాల సంఖ్యకంటే ఎక్కువ బైట్స్. ఫోన్, ఏఐ, సోషల్ మీడియా, సర్వర్లు అన్నీ కలిసి డేటా తుపాన్ సృష్టించే ఏడాది ఇది. 2026 లో పుట్టిన పిల్లవాడు 2044 లో 18 ఏళ్లు, 2056 లో 30 ఏళ్లు ఉంటాడు. ఇక ఈ ఏడాది పుట్టిన చిన్నారి 2100 ప్రత్యక్షంగా చూస్తాడు. అప్పటికి వారి వయసు 74 ఏళ్లు ఉంటుంది. అంటే ఈ ఏడాది పుట్టే తరం.. "ఏఐ రాక ముందు జీవించిన పాత మనుషులు" అని మన గురించి మాట్లాడే తరం కానుంది. ఇంకో సరదా లెక్క.. ప్రపంచంలోని ప్రతి ఒక్కరు 2026 లో 120 కాఫీ కప్పులు తాగితే, ఆ కప్పులను వరుసగా పెడితే చంద్రుడి వరకూ వెళ్లి, తిరిగి వచ్చి… మళ్లీ వెళ్లగలవు. మొత్తం మీద చెప్పాలంటే.. 2026 సాధారణ సంవత్సరం కాదు. ఇది గ్లిచ్ ఇయర్. సంఖ్యలు, క్యాలెండర్, టెక్నాలజీ, మానవ జీవితం అన్నీ ఒకే చోట కలిసే మలుపు ఇది. భవిష్యత్తులో చెప్పే మాట.. "ఇక్కడినుంచే నిజమైన మార్పు మొదలైంది." అని.
bye bye 2025👋 - 99=7745 Art by Man 2%6 WORLD) PPEACL 99=7745 Art by Man 2%6 WORLD) PPEACL - ShareChat